Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

హైద‌రాబాద్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ ప్యాకేజీ మీకోస‌మే..!

ఈ హాలిడేస్‌లో ప్ర‌శాంతంగా గ‌డ‌పాలనుకునేవారు చాలామంది చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు, విహార‌యాత్ర‌ల‌కు చెక్కేస్తుంటారు. ఇక‌, హైద‌ర‌బాద్ వంటి సిటీల్లో ఉండేవారు మాత్రం న‌గ‌రానికి స‌మీపంలో ఉండే ప్ర‌దేశాల‌కు వెళ్లేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటుంటారు. హైద‌ర‌బాద్‌లో ప‌ర్య‌టించిందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా చార్మీనార్, సాలార్‌ జంగ్ మ్యూజియం, కోటీ, లుంబినీ పార్క్ ఇంకా చాలానే ఉన్నాయి. అయితే హైద‌రాబాద్ టూర్‌కు వెళ్లాల‌నుకునేవారికి తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీ హైద‌రాబాద్ సిటీ టూర్‌, వండ‌ర్ లా పేరుతో అందిస్తోంది.

తెలంగాణ టూరిజం శాఖ అందిస్తోన్న ఈ టూర్‌లో భాగంగా హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాల‌ను వీక్షించొచ్చు. హైదరాబాద్ సిటీ హెరిటేజ్-కమ్-మ్యూజియం డైలీ టూర్ ప్యాకేజీలో చార్మినార్, మక్కా మసీదు, బిర్లా మందిర్, చౌమహల్లా ప్యాలెస్, లాడ్ బజార్‌లో షాపింగ్, సాలార్‌ జంగ్ మ్యూజియం, నిజాం కుపురానీ పెవిలియోన్, గుపురానీ పెవిలియన్, షాహీ టూంబ్స్, లుంబినీ పార్క్ వంటి ప్ర‌దేశాల‌ను తిల‌కించొచ్చు. ఈ టూర్ లో భాగంగా సంద‌ర్శించే ప్ర‌దేశాలేవో తెలుసుకుందాం ప‌దండి..

birlamandir

హైదరాబాద్ సిటీ హెరిటేజ్ కమ్ మ్యూజియం టూర్‌లో ప‌ర్యాట‌కులు వీక్షించే ప్ర‌దేశాలివే..!

గోల్కొండ కోట

నెహ్రూ జూ పార్క్ (శుక్రవారాల్లో మాత్రమే ఉంటుంది.)

బిర్లా మందిర్

చౌమహల్లా ప్యాలెస్ (శుక్రవారం మూసివేస్తారు)

చార్మినార్

మక్కా మసీదు & లాడ్ బజార్ వద్ద షాపింగ్ (నడక ద్వారా)

సాలార్‌జంగ్ మ్యూజియం (శుక్రవారం ఉండదు)

నిజాం జూబ్లీ పెవిలియన్ (నిజాం మ్యూజియం - పురాణి హవేలి) (శుక్రవారం మూసివేస్తారు)

కుతుబ్ షాహీ టూంబ్స్ (కేవ‌లం బ‌య‌టి ప్ర‌దేశాల‌ను మాత్ర‌మే చూడాల్సి ఉంటుంది.)

IMAX రోడ్ ఖైరతాబాద్ (టూర్ ముగిసే ప్రదేశం)

ఈ ప్ర‌దేశాల‌తో పాటు పర్యాటకుల అభ్యర్థనుల మేర‌కు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం,

యామయత్‌నగర్ వద్ద టెర్మినేటింగ్ పాయింట్ వంటి వాటిని సంద‌ర్శించేందుకు కూడా అనుమతి ఉంటుంది. హైద‌రాబాద్‌లోని అన్ని మ్యూజియంమ్‌లు శుక్ర‌వారం అందుబాటులో ఉండ‌వు. కాబ‌ట్టి శుక్ర‌వారం నాడు కేవ‌లం నెహ్రు జూలాజిక‌ల్ పార్క్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఈ టూర్‌లో భాగంగా ప్ర‌తి శుక్ర‌వారం ఏడు ప్ర‌దేశాలు మిగిలిన రోజులలో తొమ్మిది ప్రాంతాల‌ను ఈ టూర్ ప్యాకేజీ క‌వ‌ర్ చేస్తుంది. రోడ్డు మార్గంలో ఈ టూర్ ఉంటుంది. నాన్ ఏసీ, ఏసీ సౌక‌ర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

meccamasjid1

ధ‌ర‌ల వివ‌రాలు చూద్దాం...

నాన్ A/C విష‌యానికొస్తే.. చిన్న‌పిల్ల‌ల‌కు 300 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. అదే పెద్ద‌వారిక‌యితే, 380 రూపాయ‌లు చెల్లించాలి.

ఇక‌, ఏసీ అయితే పిల్ల‌ల‌కు 400రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. పెద్ద‌ల‌కయితే 500 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు.

బుకింగ్ చేసుకునే ప్రదేశాలివే..

ఉద‌యం 07:30 AM - హైద‌రాబాద్‌లోని రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, యాత్రి నివాస్, S.P.రోడ్, సికింద్రాబాద్-

ఫోన్: 9848126947

ఉద‌యం 07:45 AM- హైద‌రాబాద్‌లోని రిజర్వేషన్ కార్యాలయం, TSTDC, టూరిజం ప్లాజా, బేగంపేట్, హైదరాబాద్-

ఫోన్: 8367285285

ఉద‌యం 08:15 AM - CRO బషీర్‌బాగ్, గ్రౌండ్ ఫ్లోర్ శకర్ భవన్, ఎదురుగా. CCS పోలీస్ కంట్రోల్ రూమ్, టాటా మోటార్స్ పక్కన, బషీర్‌బాగ్, హైదరాబాద్- Ph నం: 9848540371 ఈ ప్ర‌దేశాల్లో ఈప్యాకేజీని బుక్‌చేసుకోవ‌చ్చు..

More News

    Read more about: hyderabad telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+