Search
  • Follow NativePlanet
Share
» »అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !

అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !

By Mohammad

అలంగుడి - తమిళనాడు లోని తిరువరూర్ జిల్లాలో ఉన్న అందమైన గ్రామం. ఇది మన్నార్గుడికి సమీపంలోని కుంబకోణం నుండి షుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలంగుడికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం కుంబకోణం. ఇది బృహస్పతి లేదా గురు గ్రహం ప్రధాన దైవంగా నిర్మించిన నవగ్రహ ఆలయాలలో ఒకటి. అలంగుడి శ్రీ ఆపత్సహాయేశ్వర్ ఆలయానికి ప్రసిద్ది చెందింది. సందర్శకులు కుంబకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో ఇక్కడికి చేరుకోవచ్చు.

అలంగుడి చరిత్ర

పవిత్ర స్థలమైన శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ఆపత్సహాయేశ్వరార్ గా పేరుగాంచిన శివుని విగ్రహం ఉంది. ఇక్కడ పార్వతీ దేవిని ఏలావర్కుళలి లేదా ఉమై అమ్మాయి అని పిలుస్తారు. ఒకప్పుడు అసురులు, దేవతలు "పాలకడలి" ని చిలకడానికి ప్రయత్నించారు. వారు అమృతం కోసం 'వాసుకి' అనే పాముని 'మందర' పర్వతానికి తాడువలె చుట్టి లాగారు. ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు పాము వదలిన విషాన్ని మింగాడు. అందువలన, శివుడు ఆ విషంనుండి ప్రపంచాన్ని రక్షించడం వల్ల "ఆపత్సహాయేశ్వర్" అంటే "రక్షకుడు" అని అర్ధం, అలా ఈ ప్రదేశం 'అలంగుడి' గా ప్రసిద్ధిచెందింది.

అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !

శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయం
చిత్ర కృప : Rasnaboy

ఇక్కడ శివుడిని పూజించడమే కాకుండా, దూరం నుండి, సమీపం నుండి అనేకమంది ప్రజలు బృహస్పతి లేదా గురు గ్రహం (జుపిటర్ గ్రహం) దోషాలను పోగొట్టుకోవడానికి పూజలు చేయడానికి, ప్రతి ఏటా గురువు మారినపుడు కూడా, పెద్ద సంఖ్యలో అలంగుడికి వస్తారు, వర్షాలు కురవడానికి, దురదృష్టాన్ని పారద్రోలడానికి ఎంతో భక్తీతో దేవుడిని ప్రార్ధిస్తారు.

సమీపంలోని ఆలయాలు - అలంగుడిలోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు మిగిలిన 8 నవగ్రహ స్థలాలు లేదా ఆలయాలన్నీ, అంటే, తిరునల్లార్ (సాటర్న్ లేదా శని), కన్జనూర్ (వీనస్ లేదా శుక్రుడు), సూర్యనార్ కోయిల్ (సన్ లేదా సూర్యుడు), తిరువెంకడు (మేర్క్యూరి లేదా బుధుడు), తిరునాగేశ్వరం (రాహువు), తిన్గలూర్ (మూన్ లేదా చంద్రుడు), కీజ్పెరుమ్పల్లం (కేతువు) అలంగుడికి సమీపంలో ఉన్నాయి (జుపిటర్ లేదా గురు గ్రహం ఉన్న ఆలయం తొమ్మిది నవగ్రహ స్థలాలలో ఒకటి).

అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !

ఆలయ రథం
చిత్ర కృప : Ssriram mt

శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయం

శ్రీ ఆపత్సహాయేశ్వరార్ ఆలయంలో ప్రధానంగా శివుడిని పూజిస్తారు. ఇక్కడ శివుడిని ఆపత్సహాయేశ్వరార్ గా పూజిస్తారు. శివుడు లింగం ఆకారంలో ఉంటాడు, ఇది "స్వయంభూ" గా పేరుగాంచింది. ఈ ఆలయంలో "కలన్గమార్ కథా వినాయగర్" గా ప్రసిద్ధిగాంచిన వినాయకుడి విగ్రహం, బృహస్పతి లేదా గురు భగవాన్ గా పేరుగాంచిన దక్షిణామూర్తి విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయం గురుగ్రహాన్ని పూజించడానికి లేదా ప్రతి ఏటా గురువు మారినపుడు గురుగ్రహ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఇక్కడికి గుంపులుగా వస్తారు. ఈ సమయంలో ప్రజలు గురుగ్రహానికి ప్రత్యెక పూజలు నిర్వహిస్తారు. గురుగ్రహాన్ని పూజించడానికి గురువారం ప్రత్యేకమైన రోజు, అందువల్ల వారంలో ఆరోజు ప్రత్యెక పూజలు నిర్వహించబడతాయి.

అలంగుడి - గురుగ్రహానికి అంకితం చేసిన ఊరు !

ఉత్తర ఆలయం గోపురం
చిత్ర కృప : Ssriram mt

ఈ ప్రాంతానికి అలంగుడి అనేపేరు ఒక పాత కధనుండి ఉద్భవించి౦ది. "పాలకడలి" (స్వర్గపు సముద్రం) ని చిలికే సమయంలో, వాసుకి అనేపేరుగల పాము విషాన్ని దేవతలపై చిందించింది. అపుడు, వారు శివుడిని ప్రార్ధించారు. అపుడు శివుడు ఆ విషాన్ని మింగాడు (హాలహల౦గా పేరుగాంచింది), దానివల్ల ఆ ప్రదేశానికి ఆలన్గుడి అనేపేరు వచ్చింది. ఆ దేవుడు ఆపత్సహాయేశ్వరార్ (ఆపద నుండి రక్షించినవాడు) గా పిలవబడ్డాడు.

అలాగే దేవతలను బాధ పెడుతున్న గజముఖాసురుడి బారి నుంచి వినాయకుడు కాపాడాడు. అందువల్ల ఇక్కడ ఆయనను కలంగమార్ కథా వినాయగర్ అని పూజిస్తారు.

శివుడిని పెళ్లాడడానికి పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసింది అందువలన ఈ ప్రాంతాన్ని తిరుమానమంగళం అని కూడా అంటారు.

అలంగుడి చేరుకోవడం ఎలా ?

అలంగుడి నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబకోణం ప్రధాన రైల్వే స్టేషన్, నీదమంగళం మరో రైల్వే స్టేషన్. యాత్రీకులు కుంబకోణం లేదా నీదమంగళం నుండి బస్సులు లేదా టాక్సీలలో అలంగుడి చేరుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+