Search
  • Follow NativePlanet
Share
» »రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం !!

రామనాథస్వామి ఆలయం, రామేశ్వరం !!

ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది.ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది.

By Mohammad

రామనాథ స్వామి దేవాలయం భారత దేశంలోని తమిళనాడుకు చెందిన రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను కీర్తించారు. ఈ దేవాలయం 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది.

ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగియుంది.ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప పట్టణంలో ఉంది. ఇది శైవులకు, వైష్ణవులకు మరియు స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లినది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు "జ్యోతిర్లింగం"గా కొలువబడుతున్నాడు. "జ్యోతిర్లింగం" అనగా దీప స్తంభం అని అర్థం.

సందర్శించువేళలు : 5:00 AM-1:00 PM, 3:00 PM-9:00 PM

ఇతిహాసాల ప్రకారం

ఇతిహాసాల ప్రకారం

ఇతిహాసాల ప్రకారం, రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధి నేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.

చిత్రకృప : Ssriram mt

రాముడు ప్రతిష్టించాడు

రాముడు ప్రతిష్టించాడు

రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిషించాలనుకొని హనుమంతుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చే లోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరుచేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువ బడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము.

చిత్రకృప : M.Mutta

దేవాలయం గురించి

దేవాలయం గురించి

ఈ దేవాలయ ప్రధాన దైవం "రామనాథస్వామి" (శివుడు). ఈ దైవం లింగాకారంలో ఉంటుంది. ఈ దేవాలయ గర్భగుడిలో రెండు లింగాలు ఉంటాయి. వాటిలో ఒకటి రాముని భార్య సీతమ్మవారు తయారుచేసిన ఇసుక లింగం, రెండవది హనుమంతుడు కైలాసము నుండి తెచ్చిన విశ్వలింగం.

చిత్రకృప : Ramnathswamy2007

గాలి గోపురాలు

గాలి గోపురాలు

దక్షిణ భారత దేశంలోని ప్రాచీన దేవాలయాల వలెనే ఈ దేవాలయానికి కూడా అతి పెద్ద ప్రహరీ గోడ నాలుగు వైపులా ఉంది. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి. ఈ దేవాలయం అంతరంలో పెద్ద వరండాలు కలిగి, మధ్యలో అధికంగా ఐదు అడుగుల పైన వేదికలపై భారీ మండపాలు ఉన్నాయి.

చిత్రకృప : Vinayaraj

చొక్కట్టన్ మండపం

చొక్కట్టన్ మండపం

రెండవ కారిడార్ ఇసుకరాయి స్తంభాలు, దూలాలుమరియు పైకప్పుతోనూ తయారైనది. మూడవ కారిడార్ యొక్క పశ్చిమ వైపు మరియు పశ్చిమ గోపురం నుండి సేవుమాథవ విగ్రహానికి పోవు చదునైన మార్గం మధ్యలో ఒక ఏకైక నిర్మాణము చదరంగ బోర్డు వలె ఉంటుంది. ఇది "చొక్కట్టన్ మండపం"గా ప్రసిద్ధి చెందింది.

చిత్రకృప : Mathanagopal

ప్రపంచంలోనే పెద్దది

ప్రపంచంలోనే పెద్దది

బయటి కారిడార్ సముదాయము 6.9 మీటర్లు ఎత్తు, 400 అడుగుల తూర్పు పడమరలకున్నూ మరియు 640 అడుగులు ఉత్తర దక్షిణలకున్నౌ కలిగి ప్రపంచంలోనే పెద్దదిగా చరిత్ర సృష్టించింది.

చిత్రకృప : Nsmohan

రాజగోపురం

రాజగోపురం

కారిడార్ల మొత్తం పొడవు 3850 మీటర్లు ఉంటుంది. అందులో సుమారు 1212 స్తంభాలు బయటి కారిడార్లో ఉంటాయి. వాటి ఎత్తు భూమినుండి పైకప్పు మధ్య భాగానికి సుమారు 30 అడుగులు ఉంటుంది. ముఖ్య గోపురం లేదా రాజగోపురం: 53 మీటర్ల ఎత్తు ఉంటుంది. అనేక స్థాంబాలు వ్యక్తిగత కూర్పుతో చెక్కబడినాయి.

చిత్రకృప : Vensatry

చుట్టూ గల విగ్రహాలు

చుట్టూ గల విగ్రహాలు

ఆలయ సముదాయంలో మరియు రామేశ్వరం చుట్టూ గల విగ్రహాలు ఇచట రామనాథస్వామి మరియు విశాలాక్షి దేవతల విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్ తో వేరుచేయబడినాయి. ఇచట విశాలాక్షి, పర్వతవర్ధిని, విగ్రహం, శయన గృహం పెరుమాళ్, మొహానపతి విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలు ఉన్నాయి.

చిత్రకృప : Nsmohan

దేవాలయ పుష్కరణి

దేవాలయ పుష్కరణి

భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 తీర్థాలు (పవిత్ర జల భాగాలు) ఉన్నాయి. ఈ తీర్థాలలో స్నానమాచరించడం తపస్సుతో సమానంగా భావిస్తారు పర్యాటకులు. వాటిలో ప్రధాన తీర్థం "అగ్ని తీర్థం". అది బంగాళా ఖాతం సముద్రం.

చిత్రకృప : Ssriram mt

చార్ థామ్

చార్ థామ్

ఈ దేవాలయం అతి పవిత్రమైన హిందువుల "చార్‌దామ్" (నాలుగు ఆధ్యాత్మిక స్థలాలు) లలో ఒకటి. దీని మూలములు కచ్చితంగా తెలియనప్పటికీ, అద్వైత మత పాఠశాలను ఆది శంకరాచార్యులు ప్రారంభించారు. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూమత శాఖలైన శైవ, వైష్ణవ శాఖలుగా విభజించబడినప్పటికీ, చార్‌ధామ్‌ అందరు హిందువులకూ ప్రసిద్ధ యాత్రా స్థలాలుగా భాసిల్లాయి.

చిత్రకృప : RJ Rituraj

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?

రామేశ్వరం ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : మధురై సమీప విమానాశ్రయం. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లో రామేశ్వరము చేరికోవచ్చు.

రైలు మార్గం : రామేశ్వరం లో రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, అకర్నూలు, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుండి రైళ్ళు ఇక్కడికి వస్తాయి. (రామేశ్వరం - ఒఖా ఎక్స్ ప్రెస్)

రోడ్డు మార్గం : చెన్నై మరియు దాని సమీప ప్రాంతాల నుండి రామేశ్వరం కు వోల్వా, ప్రవేట్ బస్సులు నడుస్తాయి.

చిత్రకృప : M.Mutta

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+