Search
  • Follow NativePlanet
Share
» »అతిపెద్ద షూటింగ్ స్పాట్‌గా.. రామోజీఫిల్మ్‌సిటి..

అతిపెద్ద షూటింగ్ స్పాట్‌గా.. రామోజీఫిల్మ్‌సిటి..

అతిపెద్ద షూటింగ్ స్పాట్‌గా.. రామోజీఫిల్మ్‌సిటి..

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కూడా సినిమా షూటింగ్ ప్ర‌దేశాల‌కు కొద‌వేలేదు. హైద‌రాబాద్‌లో అడుగుపెట్టే ప్ర‌తి ఒక్క ప‌ర్యాట‌కుడు త‌ప్ప‌కుండా అక్క‌డ ఉన్న షూటింగ్ స్పాట్స్‌ను చూస్తారు. పాతకాలపు సినిమాల‌లో మాదిరిగా ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇప్పుడంతా ఏ సినిమాలో చూసినా సిటి లైఫ్ గురించే చూపిస్తున్నారు. ప్రతి ఒక్క సినిమాలో కార్లు, బైక్‌లు మ‌న‌కు క‌నిపిస్తాయి. హైద‌రాబాద్ ప‌ర్యాట‌క ప్రాంతంగా కాకుండా, షూటింగ్ స్పాట్స్‌కు కూడా ప్ర‌సిద్ధి చెందింది.

హైద‌రాబాద్ వ‌చ్చే వారు త‌ప్ప‌కుండా ఇక్క‌డి రామోజీ ఫిల్మ్‌సిటిని చూసే వెళ్తారు. చాలామంది రామోజీ ఫిల్మ్‌సిటిని చూసేందుకే ఎక్క‌డెక్క‌డినుండో వ‌స్తారు. హైదరాబాదు నుంచి 25 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ప‌ర్యాట‌కులకు ఓ సరికొత్త ప్రపంచాన్నిపరిచయం చేస్తుంది. ఈ ప్ర‌దేశం కేవలం చలనచిత్ర రంగానికే కాకుండా, దేశంలోనే అతిపెద్ద హాలీడే స్పాట్‌గా కూడా ప్ర‌ఖ్యాతి గాంచింది. రండి, తెలంగాణ‌లోని కొన్ని ప్ర‌సిద్ధ షూటింగ్ స్పాట్‌ల గురించి తెలుసుకుందాం ప‌దండి..

1

రామోజీ ఫిల్మ్‌సిటి విశిష్ట‌త‌లు..

సుమారు రెండువేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ రామోజీ ఫిల్మ్‌సిటీను సంద‌ర్శించ‌డంతో ప‌ర్యాట‌కులు మ‌రో సరికొత్త అనుభవాన్ని పొందుతారు. ఇక్కడి వండర్‌ల్యాండ్‌కు ఏటా 1.5 మిలియన్ మంది పర్యాట‌కులు సంద‌ర్శిస్తార‌ని ఫిల్మ్‌సిటీ వర్గాలు చెబుతున్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటి ప్రపంచంలోనే అతిపెద్ద ఏకీకృత సినీ నగరంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.

ఇక్కడ కేవలం తెలుగు సినిమాలే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల షూటింగ్‌లు సైతం జ‌రుగుతుంటాయి. ఫిల్మ్‌సిటీలోని బర్డ్ పార్క్, బటర్‌ఫ్లై పార్క్ కూడా ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతాలను సందర్శించడానికి ముందు 'రామోజీ ఫిల్మ్‌సిటీ' అందించే ప్యాకేజీల గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. ఇక్క‌డికి ప్ర‌వేశించిందుకు ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. టికెట్లను ఆన్‌లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి లోపలికి ప్ర‌వేశం ఉంటుంది.

2

చార్మినార్‌

హైద‌రాబాద్ అన‌గానే చాలామందికి చార్మినార్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే, ఇక్క‌డ షాపింగ్ చేసేందుకు ఎన్నో ప్ర‌దేశాలు ఉన్నాయి. ఏ సందులోకి వెళ్లినా షాపింగ్ దుకాణాలే తార‌స‌ప‌డ‌తాయి. అన్నీ కూడా చౌకైన ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. చార్మినార్ పర్యాటకులనే కాక సినిమా వాళ్ళని కూడా ఎప్పుడో ఆకర్షించింది. హైదరాబాద్ అంటే చాలు చార్మినార్ తప్పక కనిపిస్తుంది అనే విధంగా సినిమాలలో ముద్రపడిపోయింది. ఎన్నో సినిమాల‌కు ఈ ప్రాంతం అడ్డా అనే చెప్పుకోవ‌చ్చు.

ఎందుకంటే ఎన్నో తెలుగు సినిమాలు ఇక్క‌డ నిర్మించారు. మ‌హేష్‌బాబు ఒక్క‌డు సినిమా చార్మినార్ చుట్టే తిరుగుతుంటుంది. ఇంకా చాలా సినిమాలో కూడా చార్మినార్ క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో అయితే టివీ సిరియ‌ల్స్‌లో కూడా చార్మినార్‌ను చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో పాతబస్తీ వద్ద ఉన్న చార్మినార్ కుతుబ్ షాహీ వంశస్థులచే నిర్మించిన ఒక ముఖ్య కట్టడం. చార్మినార్ అంటే నాలుగు స్తంభాలు అని అర్ధం. ఇంతకుముందు సినిమాలలో గ‌మ‌నించిన‌ట్ల‌యితే చార్మినార్ కింది నుంచి వాహనాలు వెళ్లేవి. కానీ ఇప్పుడు కాలుష్యం కారణంగా చార్మినార్ పక్క నుంచి వెళ్ల‌డం చూస్తున్నాం.

ఎలా చేరుకోవాలి

సికింద్రాబాద్, గచ్చిబౌలీ, దిల్‌సుఖ్ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీ బస్సులు నిత్యం అందుబాటులో ఉంటాయి. సొంత వాహనాల్లో వెళ్లేవారికి పార్కింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఇంకా ఆటోలు, క్యాబ్‌లు కూడా అందుబాటులోనే ఉంటాయి.

More News

    Read more about: ramoji film city hyderabad
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+