Search
  • Follow NativePlanet
Share
» »గుర్తుండిపోయే పర్యటన : బన్నెరఘట్ట నేషనల్ పార్క్ !

గుర్తుండిపోయే పర్యటన : బన్నెరఘట్ట నేషనల్ పార్క్ !

By Mohammad

మీకు బోర్ అనిపిస్తుందా ? ఆఫీసుకి .. ఇంటికీ తిరుగుతూ బేజారు వస్తుందా ? అయితే నగర జీవితం నుండి బయటపడటానికి ఒక ఉపాయం ఉంది. ఇక్కడికి చాలా మంది ప్రపంచ పర్యాటకులు కూడా వస్తుంటారు. మీరు బెంగళూరు లో ఉంటే, వారాంతంలో తప్పక ఈ ప్రదేశాన్ని సందర్శించాలి. బెంగళూరు నగరం నుండి కేవలం 22 కిలోమీటర్ల దూరంలో ఉంది ... బన్నెరఘట్ట వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ !!

బన్నెరఘట్ట నేషనల్ పార్క్

బన్నెరఘట్ట నేషనల్ పార్క్

చిత్ర కృప : Rameshng

బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ని 1971 వ సంవత్సరంలో ఏర్పాటుచేశారు. ఇది వన్య జీవుల విహార కేంద్రం. నేషనల్ పార్క్ లో - ప్రకృతి సందర్శన, జంతువుల స్థావరాలు, కృతిమ జలపాతం, జలచరాలు అక్వేరియం, మొసళ్ళ పార్క్, పక్షుల పార్క్, బట్టర్ ఫ్లై పార్క్, క్రూరమృగాల పార్క్, స్నేక్ పార్క్ మరియు మ్యూజియం వంటివి కలవు.

పార్క్ లోపలి భాగం

పార్క్ లోపలి భాగం

చిత్ర కృప : Rajesh Kumar Follow

బన్నెరఘట్ట జూ

బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో ప్రధాన ఆకర్షణ పులులు. సింహాలు కూడా పార్క్ లో చూడగలము. ఎలుగుబంట్లు, కోతులు, ఏనుగులు, జిరాఫీలు, చిరుతలు, ఖడ్గ మృగాలు మొదలైన వన్య జంతువులు చూడవచ్చు. ఏనుగుల సఫారీ, జంగల్ సఫారీ వంటివి మీకు తప్పక వినోదాన్ని ఇస్తాయి.

కెమెరాకు చిక్కిన తెల్లచారల పులి

కెమెరాకు చిక్కిన తెల్లచారల పులి

చిత్ర కృప : Miraage.clicks Follow

జంతువులే కాక ఎన్నో రకాల వృక్షాలు అంటే గంధం చెట్లు, జాలరి, జిజీఫస్, చింత, వేప వంటివి ఇక్కడ ఉన్నాయి. బన్నెరఘట్ట లో చూడవలసిన మరో ప్రధాన ఆకర్షణ స్నేక్ పార్క్.

బన్నెరఘట్ట మరిన్ని ఫోటోల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్నేక్ పార్క్ లో వివిధ జాతుల పాములను చూడవచ్చు. కొండచిలువ, కోబ్రా, త్రాచుపాము మొదలైనవి చూడవచ్చు. అక్వేరియం, మొసళ్ళ పార్క్ కూడా సందర్శించదగినదే!

బట్టర్ ఫ్లై పార్క్

బట్టర్ ఫ్లై పార్క్

చిత్ర కృప : Muhammad Mahdi Karim

బట్టర్ ఫ్లై పార్క్

దేశంలోనే మొదటి సారిగా బట్టర్ ఫ్లై పార్క్ ను బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో ఏర్పాటుచేశారు. ఇది సుమారు 7. 5 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ పార్క్ లో ఆడియో విజువల్స్ మరియు మ్యూజియం ఏర్పాట్లు కలవు. 25 పైగా సీతాకోక చిలుక రకాల జాతులకు ఈ బట్టర్ ఫ్లై పార్క్ నిలయం.

బోటింగ్

బన్నెరఘట్ట నేషనల్ పార్క్ లో బోటింగ్ సౌకర్యం కలదు. కావల్కేర్ సరస్సు వద్ద అద్దెకు బోట్ లు లభిస్తాయి.

పార్క్ లోని పక్షులు

పార్క్ లోని పక్షులు

చిత్ర కృప : shrikant rao

పార్క్ లో ప్రవహించే స్వర్ణ ముఖి ప్రవాహం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. స్వర్ణముఖి కొండలు, చంపక ధామ స్వామి గుడి పార్క్ ఇతర ఆకర్షణలు గా ఉన్నాయి.

ముఖ్యమైన గైడ్ లైన్స్

  • టూరిస్టులు లోనికి వెళ్ళేటప్పుడు ప్రవేశ టికెట్ కు రుసుము చెప్పించాలి. మీవద్ద కెమెరాలు, మొబైల్ ఫోన్ లు ఉంటే అదనంగా టికెట్ తీసుకోవాలి.
  • పార్క్ ఒక్క మంగళవారం మినహా, ప్రతి రోజూ ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:00 గంటలవరకు తెరిచే ఉంచుతారు.
  • చెత్తబుట్టల పార్క్ లో ప్రతి చోట, ప్రతి మూల ఉంచారు. కనుక, చెత్త దయచేసి అక్కడే వేయండి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. స్వచ్ఛభారత్ లో భాగంగా ఇప్పుడు మరింత కఠినతరం చేశారు. వీలైతే జరిమానా వేయవచ్చు.
  • జంతువులను చూడటానికి మరీ దగ్గరకు వెళ్ళకండి.
  • జంతువులను చిరాకు తెప్పించే విధంగా ప్రయత్నిచకండి.
  • పార్క్ లో కోతులు హడావిడి చేస్తుంటాయి. కనుక, మీ వస్తువుల మీద కాస్త ఒక లుక్ వేసి ఉంచండి.
  • కెమెరా ఫ్లాష్ లతో వన్య జీవులను ఇబ్బందిపెట్టకండి.

బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ఎలా చేరుకోవాలి ?

బెంగళూరు లోని అన్ని ప్రధాన ఏరియాల నుండి బన్నెరఘట్ట పార్క్ కు BMTC బస్సులు నడుస్తాయి. కనుక బస్సు ప్రయాణం సులభంగా ఉంటుంది. సొంతవాహనాలు లేదా క్యాబ్ ల ద్వారా కూడా పార్క్ చేరుకోవచ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+