Search
  • Follow NativePlanet
Share
» »ఎయిర్‌పోర్టును త‌ల‌ద‌న్నేలా బేగంపేట రైల్వే స్టేష‌న్‌

ఎయిర్‌పోర్టును త‌ల‌ద‌న్నేలా బేగంపేట రైల్వే స్టేష‌న్‌

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఇప్ప‌టికే ప‌లు రైల్వే స్టేష‌న్‌లు అధునాత‌న హంగులతో ఆక‌ర్షిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో బేగంపేట రైల్వే స్టేష‌న్ కూడా చేరింది. కోట్ల రూపాయ‌లు వెచ్చించి.. ఎయిర్ పోర్టును త‌ల‌ద‌న్నేలా ఈ రైల్వే స్టేష‌న్‌ను తీర్చిదిద్దనున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. స్టేష‌న్‌లో అగుగుపెట్టే ప్ర‌యాణికులు ఓ స‌రికొత్త అనుభూతిని పొందుతార‌ని ప్ర‌క‌టించారు. మ‌రి అమృత్ భార‌త్ స్టేష‌న్ ప‌థ‌కం కింద న‌గ‌రంలో ఏ ఏ స్టేష‌న్‌లు డెవ‌ల‌ప్ అవుతున్నాయి? ఈ స్టేష‌న్‌ల‌లో ఎలాంటి సౌక‌ర్యాలు ఉండ‌బోతున్నాయి? చూద్దామా..

హైద‌రాబాద్‌లోని బేగంపేట రైల్వేస్టేష‌న్ ఇక‌నుంచి ఎయిర్‌పోర్ట్‌ను త‌ల‌పించ‌నుంది. ఎయిర్‌పోర్టు స్థాయి సౌక‌ర్యాల‌తో ఈ స్టేష‌న్‌లో అభివృద్ధి ప‌నులు సాగ‌నున్నాయి. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను అభివృద్ది చేసే ప‌నిలో ఉంది. ఇందులో భాగంగానే ప‌లు రైల్వేస్టేష‌న్ల‌ను సకల సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు ప‌నుల‌ను ప్రారంభించ‌డం జ‌రిగింది. ఈ ప‌థ‌కంలో భాగంగానే హైదరాబాద్ నగరంలోని పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చే ప‌నిలో ప‌డ్డారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. ఇందులో భాగంగానే మలక్‌పేట్‌, ఉప్పుగూడ, మల్కాజిగిరి, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్‌, హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లలో ఇప్పటికే పనులు ప్రారంభం కావ‌డం జ‌రిగింది.

begumpetrailwaystation

ఎయిర్‌పోర్ట్ స్థాయి సౌక‌ర్యాలు..

బేగంపేట రైల్వే స్టేషన్‌కు రోజుకు 16,648 మంది ప్ర‌యాణికులు వ‌చ్చి పోతుంటారు. అందుకే ఈ రైల్వేస్టేష‌న్‌కు ఎయిర్‌పోర్ట్ స్థాయి సౌక‌ర్యాల‌కు క‌ల్పించాల‌ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రైల్వేస్టేష‌న్ అభివృద్ధి కోసం సుమారు రూ.26.55 కోట్లు కేటాయించినట్లు సికింద్రాబాద్‌ డివిజన్‌ డిప్యూటీ కమర్షియల్‌ మేనేజర్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌ రైల్వే స్టేషన్‌కు రూ.309 కోట్లను కేటాయించారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు రూ.144.06 కోట్ల నిధులు కేటాయించిట‌న్లు అధికారులు తెలిపారు. ఇక‌, ఈ స్టేష‌న్‌ల‌లో ప్రయాణికుల కోసం అత్యాధునిక మరుగుదొడ్లు, 12 మీటర్ల వెడల్పు ర్యాంపుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, 2 లిఫ్టులు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫామ్‌ మొత్తానికి షెడ్డు నిర్మాణం, స్టేషన్‌ బయట గ్రీనరీ, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిర్దేశాలకు అనుగుణంగా మురుగునీటి శుద్ధికి ప్లాంటు ఏర్పాట్లు చేస్తున్నారు.

begumpetrailwaystation

ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం లిఫ్టులు, వంతెన‌లు..

వీటితోపాటు ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్లు ఆగేలా కూడా వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే ప్లాట్‌ఫామ్‌ల పొడవు పెంచిన అధికారులు వాటికి మరిన్ని హంగులు సమకూర్చేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సిద్ధ‌మ‌య్యారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లకు ఇరువైపుల నుంచి చేరుకునే విధంగా రోడ్లను కూడా ఏర్పాటు చేయ‌నున్నారు.

ఆరు మీట‌ర్ల వెడ‌ల్పుతో కొత్త వంతెన‌లు నిర్మించ‌నున్నారు. 24 బోగీల ట్రైను ఆగే ప్లాట్‌ఫామ్‌ అంతా పైకప్పులు రానున్నాయి. ఇంకా ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం లిఫ్టులు కూడా స‌మ‌కూర్చ‌నున్నారు. రెస్ట్ రూమ్స్‌, డిజిట‌ల్ సైన్ బోర్డుల‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. మ‌రి ఇన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తే.. ఈ స్టేష‌న్‌ల‌లో అగుగుపెట్టే ప్ర‌యాణికులు ఓ స‌రికొత్త అనుభూతిని పొందాల్సిందే క‌దా! మీరేమంటారు?!

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+