Search
  • Follow NativePlanet
Share
» »ఈ రైళ్ల ప్రయాణం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా?

ఈ రైళ్ల ప్రయాణం ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసా?

భారత దేశంలో పర్యాటకపరంగా ప్రాముఖ్యత గాంచిన పర్వత రైలు మార్గాలు,

రైలు ప్రయాణం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టం. ముఖ్యంగా పర్వతలోయలు, పర్వతాల మధ్య నుంచి రైలు వెలుతూ ఉన్నప్పుడు కలిగే సంతోషాన్ని కేవలం అనుభవించాలే కాని మాటల్లో వివరించడానికి వీలుకాదు. తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటి ప్రయాణం మీకు మరిచిపోలేని అనుభూతిని మిగిలుస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో భారత దేశంలో టాప్ 5 పర్వత రైలు మార్గాల సమాచారం మీ కోసం...

డార్జిలింగ్ హిమాలయన్ రైలు మార్గం

డార్జిలింగ్ హిమాలయన్ రైలు మార్గం

P.C: You Tube

బొమ్మరైలు, చిన్నరైలు వంటి పేర్లు కలిగిన డార్జిలింగ్ హిమాలయన్ రైలు మార్గం న్యారోగేజ్ రైలు మార్గం. భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ లోని సిరిగులి నుంచి డార్జిలింగ్ వరకూ సుమారు 88 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

నీలగిరీ మౌంటైన్ రైలు మార్గం

నీలగిరీ మౌంటైన్ రైలు మార్గం

P.C: You Tube

కొయంబత్తూరుకు దగ్గర్లోని మట్టుపాళ్యం నుంచి చుక్‌బుక్ మంటూ ప్రయాణించే ఈ మార్గంలో ప్రయాణించడం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ముఖ్యంగా నీలగిరి పర్వత అందాలను మొత్తం ఈ రైలు ద్వారా ప్రయాణిస్తూ చూడవచ్చు. ఉదయం 7 గంటల నుంచి మెట్టుపాళ్యం నుంచి బయలుదేరే ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు ఊటికి చేరుకొంటుంది. వారంలో అన్ని రోజులూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది.

మథేరన్ పర్వత రైలు

మథేరన్ పర్వత రైలు

P.C: You Tube

మహారాష్ట్రలో ఈ అందమైన రైలు మార్గం ఉంటుంది. ప్రముఖ పర్వతమయ క్షేత్రం మథేరన్‌ను చేరుకోవడానికి ఈ రైలుమార్గం అందుబాటులో ఉంటుంది. నరేల్ అనే గ్రామం నుంచి బయలుదేరే ఈ రైలు మార్గమధ్యలో ప్రక`తి రమణీయతను మనకు పరిచయం చేస్తుంది. న్యారోగేజ్ మార్గంలో మొత్తం 12 కిలోమీటర్లను మనం ప్రయాణం చేయవచ్చు.

కెల్కా-సింమ్లా రైలు మార్గం

కెల్కా-సింమ్లా రైలు మార్గం

P.C: You Tube

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సింమ్లా నుంచి హర్యాణ రాష్ట్రం పంచకులా జిల్లాలోని కల్కా వరకూ ఈ రైలు మార్గం సాగుతుంది. ఈ మార్గంలో మొత్తం 103 సొరంగ మార్గాలు, 864 వంతెనలు ఎదురుపడుతాయి. ఈ మార్గం సముద్ర మట్టం నుంచి దాదాపు 2151 అడుగుల ఎత్తులో సాగడం గమనార్హం.

కంగ్రా లోయ రైలు మార్గం

కంగ్రా లోయ రైలు మార్గం

P.C: You Tube

హిమాలయ పర్వత పంక్తుల మధ్యన ఈ చిన్న రైలు మార్గం సాగుతుంది. పంజాబ్ లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని జోగిందర్ నగర్ వరకూ ఈ కంగ్రా లోయ రైలు మార్గం అందుబాటులో ఉంటుంది. మొత్తం 164 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం కొనసాగుతుంది. ఈ మార్గం సముద్రమట్టం నుంచి 4,230 వఅడుగుల ఎత్తులో ఉంటుంది.

More News

    Read more about: tour travel india hill station
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+