Search
  • Follow NativePlanet
Share
» » ఇక్కడ రూ.1000 సరుకు రూ.100లకే త్వరపడండి

ఇక్కడ రూ.1000 సరుకు రూ.100లకే త్వరపడండి

తక్కువ ధరకు వస్తువులు దొరికే ప్రాంతాలకు సంబంధించిన కథనం.

పర్యాటకానికి వెళ్లినప్పుడు షాపింగ్ చేయాలని చాలా మంది భావిస్తారు. అలా కొన్న వస్తువులను తమకు కావాల్సిన, దగ్గరివారికి కానుకలుగా ఇచ్చి వారిని ఆనందింపజేస్తుంటారు. ఇలా తెలిసిన వారందరికీ వస్తువులను అందజేయాలంటే కొంత ఎక్కువే ఖర్చవుతుందనడంలో సందేహం లేదు. ఇక పర్యాటకానికి వెళ్లినప్పుడు ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన వస్తువులూ నచ్చుతాయి. వారి ధరలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. దీంతో వస్తువులు కొనాలని ఉన్నా ఆ ధరలను చూసి మనం కొనలేకపోవచ్చు. ఇందుకు కొంత పరిష్కారమార్గమే స్ట్రీట్ షాపింగ్. నాణ్యమైన వస్తువులు కొంత తక్కువ ధరకు దొరికే ప్రాంతాల్లో కొనుగోలు చేయడం వల్ల మనకు కాస్త తక్కువ ధరకే వస్తువులు సొంతమవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు వంటి ప్రముఖ పర్యాటక నగరంలో చౌకగా వస్తువులు దొరికే మార్కెట్లకు సంబంధించిన వివరాలు మీ కోసం....

చిక్ పేట

చిక్ పేట

P.C: You Tube

బెంగళూరులో అత్యంత పురాతన వ్యాపర కూడలిగా చిక్కపేటకు పేరుంది. దాదాపు 400 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంది. సిటీ మార్కెట్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఈ చిక్ పేట్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చీరలు అతి తక్కువ ధరకు దొరుకుతాయి. అదేవిధంగా బంగారు, వెండి వస్తువులు కూడా కొంత తక్కువ ధరకు ఇక్కడ దొరుకుతాయి.

మెజెస్టిక్

మెజెస్టిక్

P.C: You Tube

ఎలెక్ట్రిక్ వస్తువులు, ఫర్ఫూమ్స్, దుస్తులు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల వస్తువులు మనకు చాలా తక్కువ ధరకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ లోకల్ గా తయారైన వస్తువులతో పాటు బ్రాండెడ్ వస్తువులు కూడా కొంత తక్కువ ధరకే దొరుకుతాయి.

దుబాయ్ ప్లాజా

దుబాయ్ ప్లాజా

P.C: You Tube

బేరమాడటంలో మీరు ఎక్స్ ఫర్ట్ అనుకొంటూ ఉంటే దుబాయ్ ప్లాజాకు మించిన షాపింగ్ డెస్టినేషన్ మరొకటి లేదు. ఇక్కడ సూది మొదలుకొని కుట్టు మిషన్ వరకూ హాండ్ కర్చీఫ్ మొదలుకొని లెదర్ జాకెట్ వరకూ ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దీంతో ఈ దుబాయ్ ప్లాజా నిత్యం అన్ని వర్గాల ప్రజలతో కిటకిటలాడుతూ ఉంటుంది. నగరంలోని రెస్ట్ హౌస్ రోడ్డులో ఉన్న ఈ దుబాయ్ ప్లాజా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచే ఉంటుంది.

మల్లేశ్వరం 8వ క్రాస్

మల్లేశ్వరం 8వ క్రాస్

P.C: You Tube

మల్లేశ్వరం 8వ క్రాస్ లో వెచ్చాలు మొదలుకొని ప్రతి ఒక్కటీ దొరుకుతుంది. దుస్తులు, షూలు, పూలు, పళ్లు ఇలా ఒక్కటేమిటీ ప్రతి ఒక్కటి నగరంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ తక్కువ ధరకు లభిస్తాయి. అందువల్లే చాలా మంది వారాంతాల్లో ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ ఈ షాపింగ్ ఏరియా అందుబాటులో ఉంటుది. అయితే కొన్ని షాపులు మాత్రం శని, ఆదివారాల్లో మూసి ఉంటారు.

ఇందిరా నగర్ 100 ఫీట్ రోడ్

ఇందిరా నగర్ 100 ఫీట్ రోడ్

P.C: You Tube

ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ షాపింగ్ ఏరియా వినియోగదారులకు ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. ఈ షాపింగ్ ఏరియా బ్రాండెడ్ వస్తువులకు చాలా ఫేమస్. అయితే అక్కడక్కడ మనకు తక్కువ ధరకే వస్తువులను అమ్మే ప్రాంతాలు కూడా అందుబాటులో ఉంటాయి. బేరం చేసే గుణం ఉంటే చాలా తక్కువ ధరకే వస్తువులను సొంతం చేసుకోవచ్చు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+