Search
  • Follow NativePlanet
Share
» »శీతాకాలంలో సంద‌ర్శించేందుకు నోయిడా స‌మీపంలోని బెస్ట్ ప్లేసేస్‌..

శీతాకాలంలో సంద‌ర్శించేందుకు నోయిడా స‌మీపంలోని బెస్ట్ ప్లేసేస్‌..

శీతాకాలంలో ఆహ్లాదకరమైన ప్రదేశాలను సందర్శించాలనుకునేవారు త‌ప్ప‌కుండా నోయిడాలోని ఈ ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించొచ్చు. ఇవి నోయిడా నుండి 200 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న‌ హిల్ స్టేషన్లు. వేసవిలోనే కాకుండా చలికాలంలో కూడా ఈ హిల్ స్టేషన్ పర్యాటకుల ఆధిక్యతను చాటుతూనే ఉంటుంది. ఈ సమయంలో కూడా ఇక్కడ చాలా మంది ప‌ర్యాట‌కులు కనిపిస్తారు. డిసెంబరు, జనవరి నెలలో ఇక్కడ ఉదయం, సాయంత్రం స‌మ‌యాల్లో ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటుంది. ఈ ప్ర‌దేశాల‌ను కుటుంబం లేదా స్నేహితులతో క‌లిసి ప్రశాంతంగా గడపవచ్చు. భారతదేశంలో అనేక హిల్ స్టేషన్లు ఉన్నప్పటికీ, ఇవి నగరానికి సమీపంలో ఉంటాయి. కాబ‌ట్టి వీటిని సంద‌ర్శించాలంటే ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. మ‌రెందుకాల‌స్యం నోయిడా స‌మీపంలోని ఈ హిల్‌స్టేష‌న్ల‌ను సంద‌ర్శించేయండి మ‌రి.

గర్ ముక్తేశ్వర్

నోయిడా నుండి కేవలం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న గర్ ముక్తేశ్వర్ నగర హ‌డావిడికి, కాలుష్యానికి దూరంగా ఉన్న అందమైన హిల్ స్టేషన్. నోయిడా నుండి ఇక్కడికి చేరుకోవడానికి గంట స‌మ‌యం పడుతుంది. ఇక్కడికొచ్చేప‌ర్యాట‌కులు పవిత్ర గంగా నదిని వీక్షించొచ్చు. ఈ నగరపు చరిత్ర ఎంతో గొప్పది. మహాభారత కాలంలో ఇది హస్తినాపూర్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉందని చరిత్ర చెబుతోంది. మహాభారత యుద్ధం ముగిసిన తరువాత, శ్రీకృష్ణుడు గర్ముక్తేశ్వర్‌కు వచ్చి యుద్ధంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని గంగలో దీపం సమర్పించాడని ఇక్క‌డి వారు చెబుతుంటారు.

sariskanationalpark

సరిస్కా

ఈ శీతాకాల సమయంలో ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం త‌ప్ప‌కుండా నోయిడా స‌మీపంలోని సరిస్కా ఎంతో ఉత్త‌మ‌మైన ప్ర‌దేశం. ఇది నోయిడా నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్‌కు ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ప్ర‌స్తుతం ఈ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో 28 పులులు, 20కి పైగా పాంథర్‌లు ఉన్నాయి. అందువల్ల, పర్యాటకులు ఇక్కడ పులులను బాగా చూడవచ్చు. అంతే కాకుండా ఇక్క‌డ‌ సరిస్కాలోని అల్వార్ బఫర్ రేంజ్ అడవి కూడా పర్యాటకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

నీమ్రానా కోట

నోయిడా స‌మీపంలోని నీమ్రానా కోట శీతాకాలంలో సంద‌ర్శించేందుకు ఎంతో అనువైన ప్ర‌దేశం. నగరం నుండి ఇది సుమారు 136 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవ‌డానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. నీమ్రానా రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఉన్న పురాతన నగరంగా ప్ర‌సిద్ధిచెందింది. ఈ నగరంలోని ప్రధాన ఆకర్షణ నీమ్రానా కోట. వీటితో పాటు ఇంకా ఇక్క‌డ సరిస్కా నేషనల్ పార్క్, బాలా ఫోర్ట్, వినయ్ విలాస్ మహల్, నీమ్రానా స్టెప్‌వెల్ వంటి ప్ర‌దేశాల‌ను సంద‌ర్శించొచ్చు.

neemranakotavrindavan

బృందావనం

ఇక్క‌డ ఆధ్యాత్మిక ప్రాంతాలు కూడా చాలానే ఉన్నాయి. నోయిడా స‌మీపంలో బృందావ‌నం భ‌క్తుల‌కు ఎంత‌గానో ప్ర‌సిద్ధి చెందింది. బృందావన్ నోయిడా నుండి సుమారు 138 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. బృందావనం శ్రీకృష్ణుడు తన బాల్యం గడిపిన ప్రదేశం. మధుర కృష్ణుడి జన్మస్థలం. హిందూ మతంలోని ఏడు పవిత్ర నగరాలలో ఒకటిగా ఈ ప్రాంతాన్ని పరిగణించారు. ఇక్కడ చూసేందుకు అందమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రదేశం ఏడాది పొడవునా ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులను ఆకర్షిస్తుంది.

అల్వార్

ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశాల‌లో అల్వార్ ఒకటి. అల్వార్ నోయిడా నుండి 172 కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో వెళితే 3 గంటల్లో ఇక్కడికి చేరుకోవ‌చ్చు. ఆరావళి పర్వత శ్రేణులతో చుట్టుముట్టబడిన ఈ నగరంలో అనేక చారిత్రక కేంద్రాలు ఉన్నాయి. అంతే కాకుండా, ఇక్కడ అనేక దేవాలయాలు, సరస్సులు క‌ల‌వు. ఆళ్వార్ ఒకప్పుడు మత్స్య సంపదలో భాగంగా ఉండేదని ఇక్క‌డివారు చెబుతున్నారు. దీని చరిత్ర క్రీస్తుపూర్వం 1500 నాటిదని చెబుతారు. సిలిసేద్ సరస్సు, విజయ్ మందిర్ ప్యాలెస్, కంపెనీ బాగ్, బాలా ఫోర్ట్, గవర్నమెంట్ మ్యూజియం, సిటీ ప్యాలెస్, విజయ్ మందిర్ ప్యాలెస్, కర్ణి మాత టెంపుల్ వంటివి అల్వార్‌లోని ప్రసిద్ధ ఆకర్షణలు.

More News

    Read more about: noida tour winter travel
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+