Search
  • Follow NativePlanet
Share
» »కెమరా కంటికి విందు భోజనాన్ని అందించే ప్రాంతాలు ఇవే

కెమరా కంటికి విందు భోజనాన్ని అందించే ప్రాంతాలు ఇవే

ఫొటోగ్రఫీకి అనువైన ప్రాంతాలకు సంబంధించిన కథనం.

కెమరా కంటితో చూడటం మీ హాబీనా? ఎవరూ తీయని ప్రకృతి అందాలను మీ కెమారాలో బంధించాలని తహతహలాడుతూ ఉన్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. ఈ విశాల భారత దేశంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు, పిట్టలు అందంగా కనిపిస్తే మరికొన్ని ప్రాతాల్లో ప్రాణంలేని రాతి శిల్పాలు ఎన్నో ఊసులు చెబుతాయి.

ఇదిలా ఉండగా ఫొటోగ్రఫీలో మీరు తీసే చిత్రాలు చాలా అందంగా రావాలంటే తెలిసిన ప్రాంతమే అయినా ప్రత్యేక సందర్భంలో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల ఈ కథనంలో మీకు ఫొటోగ్రఫీకి అనుకూలమైన ప్రాంతాలతో పాటు అక్కడ ఏ సమయానికి వెళ్లాలన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మరెందుకు ఆలస్యం కెమరాను మెళ్లో వేసుకుని వెళ్లండి. చక్కటి ఫొటోలు తీయండి.

లడక్

లడక్

P.C: You Tube

జమ్ముకాశ్మీర్ లో అత్యంత సుందరమైన పర్యాటక ప్రదేశం లడక్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ గడ్డగట్టిన సరస్సులు విచిత్రమైన అందంతో ప్రక`తి ప్రేమికులను మంత్రముగ్దులను చేస్తాయి. ట్రెక్కింగ్ తోపాటు మోటార్ బైకుల్లో పర్వత శిఖరాల పైకి చేరుకోవడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

లడక్

లడక్

P.C: You Tube

ముఖ్యంగా పగోనంగ్ సరస్సు వద్ద అందాలను మాటల్లో చెప్పడం కంటే అక్కడి అందాలను మన కెమరాలో బంధించడమే ఉత్తమం. ఒక్క ఫోటో లక్ష అక్షరాల కంటే ఎన్నో ఊసులు చెబుతుందనడానికి ఇక్కడ తీసే ఫోటోలే నిదర్శనాలు.

లడక్

లడక్

P.C: You Tube

ఇక్కడ అంతరించే స్థితిలో ఉన్న అనేక జంతువులను కూడా మన కెమరాలో బంధించవచ్చు. ఫొటోగ్రఫీ కోసమైతే మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ లడక్ ను సందర్శించడం మేలు. ఆ సమయంలో ఇక్కడి మైదనాలతో పాటు తెల్లటి మంచి దుపట్లు కప్పుకొన్న పర్వత శిఖరాలు కొత్త పెళ్లికూతురులా ముస్తాబై ఉంటాయి.

రాజస్థాన్

రాజస్థాన్

P.C: You Tube

ఎముకలను గడ్డకట్టించే చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాలే కాదు ఎర్రటి ఎండలు కాచే ఎడారుల్లో కూడా మనసుకు హత్తుకొనే ఫొటోలను తీయవచ్చు. ఇందుకు రాజస్థాన్ ప్రత్యక్ష ఉదాహరణ. సాధారణంగా ఎడారిలో ఫొటోగ్రఫీ అనగానే చాలా మందికి మౌంట్ అబు హిల్ స్టేషన్ గుర్తుకు వస్తుంది.

రాజస్థాన్

రాజస్థాన్

P.C: You Tube

అయితే అంతకు మించిన అందాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్ లో చాలా కోటలు గోల్డన్ బ్రౌన్ కలర్ రాయిని వినియోగించి నిర్మించారు.దీంతో వీటి పై సూర్యరశ్మి పడినప్పుడు ఒక విభిన్న రంగు పరావర్తనం చెందుతుంది.

రాజస్థాన్

రాజస్థాన్

P.C: You Tube

అందువల్లే ఇక్కడ తీసే ఫొటోల్లో మాటలకు వర్ణించలేని అందాలు కనిపిస్తాయి. కోటలే కాకుండా థార్ ఎడారి, ఒంటెలు, రంగు రంగు పేటాలు ధరించిన రాజస్థాన్ పల్లె ప్రజలు ఇవన్నీ మీ కెమరా కన్ను ఆకలిని తీర్చేవే అని చెప్పవచ్చు.

వారణాసి

వారణాసి

P.C: You Tube

వారణాసిలో ఈ ప్రాంతం అని ఏమి ఏదు. మీ చేతిలో కెమరా ఉంటే చాలా ఏ ఫోటో తీసినా ఇక్కడ ఏదో ఒక అందం కనిపిస్తూనే ఉంటుంది. ఒకే క్షణంలో రెండు వేర్వేరు ఫొటోలను తీసినా ఒకదానిలో ఉన్న ప్రత్యేకత మరోదానిలో కనిపించకపోవడం ఇక్కడ విశేషం అని చెప్పడం అతిశయోక్తి కాదు.

వారణాసి

వారణాసి

P.C: You Tube

ముఖ్యంగా పడవలో వెలుతూ ఫొటోలు తీయడం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. ముఖ్యంగా వారణాసి ఘాట్ లు ఫొటోగ్రఫీ కోసం చాలా అనుకూలంగా ఉంటాయి. ఉదయపు పూజపలతో పాటు రాత్రి సమయంలో ఇచ్చే గంగాహారతి వరకూ ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని కెమరాలో బంధించడం కోసం దేశ విదేశాల నుంచి ఫొటోగ్రఫర్లు ఇక్కడికి వస్తుంటారు.

వారణాసి

వారణాసి

P.C: You Tube

ముఖ్యంగా మణికర్ణికా ఘాట్ లో ఫొటోలు తీయడానికి పోటీ పడుతుంటారు. అక్కడ హిందూ సంస్క`తిని ప్రతిభింబించే ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా హోళి, నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇక్కడి పరిస్థితులు ఫొటోగ్రఫర్ల పనితనానికి పరీక్ష పెడుతాయని చెప్పడం అతిశయోక్తి కాదు.

మధురై

మధురై

P.C: You Tube

దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులోని మధురైలోని మీనాక్షి దేవాలయం ఫొటోగ్రఫర్లకు స్వర్గధామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా భారతీయ చిత్ర, శిల్పకళలంటే ఆసక్తి ఉండి వాటి పై ఫొటోలు తీయాలనుకొన్నవారికి మదురైకు మించిన ప్రదేశం మరొకటి లేదని చెప్పవచ్చు.

మధురై

మధురై

P.C: You Tube

గోపురం దాని పై ఉన్న శిల్పాలు, రాతి స్తంభాలు అన్ని మీ కెమరా కంటికి మంచి విందు భోజనాన్ని అందజేస్తాయి. ఇక ఉత్సవాలు జరిగే సమయంలో మీనాక్షి అమ్మవారి ఊరేగింపులో కెమారా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి కార్యక్రమం అందమైన ఫొటోకు కథా వస్తువే.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+