Search
  • Follow NativePlanet
Share
» »చిటపట చినుకుల్లో కర్నాటకలోని ఈ పర్యాటక అందాలను చూడాల్సిందే

చిటపట చినుకుల్లో కర్నాటకలోని ఈ పర్యాటక అందాలను చూడాల్సిందే

కర్నాటకలో అత్యంత అందమైన పర్యాటక కేంద్రాలుకు సంబంధించిన కథనం.

పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని అనేక పర్యాటక ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకొంటూ పర్యాటకులను రారమ్మని ఆహ్వనిస్తున్నాయి. అదే విధంగా సముద్ర తీర ప్రాంతాల్లోని ఇసుక తిన్నెలు కూడా ఈ వర్షాల వల్ల వర్ణించడానికి వీలు కాని అందాలను సంతరించుకొంటున్నాయి.

ఇక వర్షాల వల్ల గత కొన్ని నెలలుగా స్థబ్దుగా ఉన్న జలపాతాలు హొయలు పోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్నాటక ఎన్నో సముద్ర తీర ప్రాంతాలు, పర్వత శిఖరాలు, జలపాతాలకు నిలయం. ఇందులో అతి ముఖ్యమైన కొన్ని పర్యాటక కేంద్రాల వివరాలు క్లుప్తంగా మీ కోసం. మరెందుకు ఆలస్యం చదవి రానున్న వీకెండ్ లో వీటిలో ఒక్క పర్యాటక కేంద్రానైనా సందర్శించి బిజీ లైఫ్ నుంచి కొంత ఉపశమనం పొందండి

శివమొగ్గా

శివమొగ్గా

P.C: You Tube

శివమొగ్గాను షిమోగా అని కూడా పిలుస్తారు. కర్నాటక సంప్రదాయ, సంస్కృతి రాజధానిగా షిమోగకు పేరు. ఇక్కడ ఉన్న సారవంతమైన భూములు, అందమైన జలపాతాలు, పచ్చటి పర్వత శిఖరాలు పర్యాటకులను రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. కర్నాటకలో వర్షాకాలమైన ఈ ఆగస్టు నెలలో ప్రకృతితో మమేకం కావడానికి ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి లేదంటే అతిశయోక్తి లేదు.

ఎన్నో నదులు

ఎన్నో నదులు

P.C: You Tube

తుంగభద్ర, శరావతి, వరదా, కుమద్వతీ నదీమ తల్లులన్నీ శివమొగ్గాను అత్యంత సుందరంగా తీర్చి దిద్దాయి. అదే విధంగా ఈ శివమొగ్గాను గంగా, కదంబ, చాళుక్య, రాష్ట్రకూట, విజయనగర రాజులు పరిపాలించారు అందువల్ల ఇక్కడ అద్భుత శిల్పకళతో కూడిన భవనాలను, దేవాలయాలను చూడవచ్చు.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

P.C: You Tube

ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలు...శివప్పనాయక సమ్మర్ ప్యాలెస్, కోటే సీతరామ స్వామి దేవాలయం, సాక్రీడ్ హార్ట్ క్యథడ్రాల్, తవరె కుప్ప లయన్ సఫారీ, సక్రేబెలె ఎలిఫెంట్ క్యాంప్శివమొగ్గలోనే రైల్వే స్టేషన్ ఉంది. ఇక శివమొగ్గకు నూతనంగా ఎయిర్ పోర్టు కూడా అదుబాటులోకి వచ్చింది. అదే విధంగా 195 కిలోమీటర్ల దూరంలో మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా ఉంది.

గోకర్ణ

గోకర్ణ

P.C: You Tube

అటు ఆధ్యాత్మిక పరవళ్లతో పాటు ఇటు ఆహ్లాదకరమైన పర్యాటకాన్ని కోరుకొనేవాళ్లు తప్పక గోకర్ణను సందర్శిస్తారు. ఇది శైవులకు పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. రామాయణ కాలంతో ముడిపడిన ఈ క్షేత్రాన్ని ప్రతి ఏడాది ఎంతో మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. అదే విధంగా అత్యంత అందమైన బీచ్ లకు నిలయమైన గోకర్ణ అంటే భారతీయులకే కాక విదేశీయులకు కూడా మక్కువ ఎక్కువ. అందువల్లే కర్నాటకకు వచ్చే విదేశీయుల్లో దాదాపు 80 శాతం మంది గోకర్ణను చూడకుండా వెనుతిరగరు.

చూడాల్సిన పర్యాటక కేంద్రాలు

చూడాల్సిన పర్యాటక కేంద్రాలు

P.C: You Tube

.మహాబలేశ్వర్ దేవాలయం, మహాగణపతి దేవాలయం, ఓం బీచ్. అదే విధంగా ఇక్కడ బీచ్ లలో బనానా బోట్ రైడ్, ప్యారాసైలింగ్ వంటి జలక్రీడలు కూడా అందుబాటులో ఉంటాయి.

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

P.C: You Tube

గోకర్ణకు రైల్వే స్టేషన్ ఉంది. ఇది పట్టణానికి అత్యతం సమీపంలోనే ఉంటుంది. గోకర్ణకు దగ్గరగా అంటే గోవాలోని దబోలిమ్ ఎయిర్ పోర్ట్ ఉంది. దూరం 140 కిలోమీటర్లు.

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

P.C: You Tube

జోగ్ ఫాల్స్ ను గేరుసొప్ప ఫాల్స్ అని కూడా అంటారు. భారత దేశంలోని అత్యంత ఎతైన జలపాతాల్లో జోగ్ ఫాల్స్ రెండో స్థానంలో ఉంటుంది. శరావతి నది పై ఏర్పడిన జోగ్ ఫాల్స్ ఎత్తు దాదాపు 830 అడుగులు. నాలుగు ఉప పాయలు కలిపి జోగ్ ఫాల్స్ ఏర్పడింది. వాటిని వరుసగా రాజ, రాకెట్, రాణి, రోవర్ అని అంటారు. కర్నాటకలో ఎక్కువ మంది పర్నాటకులు సందర్శించే పర్యాటకే కేంద్రాల్లో జోగ్ ఫాల్స్ ముందు వరుసలో ఉంటుంది. పర్యాటక శాఖ నిర్మించిన 1,500 మెట్లతోవలో కిందుకు వెలితే ఈ జలపాతం అందాలను మరంత దగ్గరగా చూడవచ్చు.

దగ్గర్లో చూడదగిన పర్యాటక ప్రాంతాలు

దగ్గర్లో చూడదగిన పర్యాటక ప్రాంతాలు

P.C: You Tube

లింగనమక్కి డ్యాం, తుంగా డ్యాం, తవరేకొప్ప లయన్, టైగర్ అభయారణ్యం తదితరాలు ఇక్కడికి దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

P.C: You Tube

రైలు ప్రయాణం ద్వారా జోగ్ ఫాల్స్ ను చేరుకోవాలనుకొనేవారు జోగ్ ఫాల్స్ కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ రైల్వేస్టేషన్ కు చేరుకోవాలి. అదే విధంగా జోగ్ ఫాల్స్ కు 133 కిలోమీటర్ల దూరంలో హుబ్లీ ఎయిర్ పోర్ట్ ఉంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+