Search
  • Follow NativePlanet
Share
» »రంజాన్ నెలలో హైదరాబాద్‌లో తినడానికి ఉత్తమమైన ప్రదేశాలు

రంజాన్ నెలలో హైదరాబాద్‌లో తినడానికి ఉత్తమమైన ప్రదేశాలు

రంజాన్ నెలలో హైదరాబాద్‌లో తినడానికి ఉత్తమమైన ప్రదేశాలు

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కఠినమైన రోజువారీ ఉపవాసాన్ని పాటిస్తూ పండుగను జరుపుకుంటున్నారు. భారతదేశంలోని చాలా ప్రధాన నగరాలు మరియు పట్టణాలు రంజాన్ మాసంలో ప్రత్యేకమైన స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌లను స‌రికొత్త‌గా ప‌రిచ‌యం చేస్తాయి. అత్యంత రుచిక‌ర‌మైన‌ కబాబ్‌ల నుండి రుచికరమైన బిర్యానీలు వ‌ర‌కూ ఈ మార్కెట్‌ల‌లో అంద‌రికీ అందుబాటులో ఉండే ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి. స్ట్రీట్ ఫుడ్ మార్కెట్‌ల‌లో హైదరాబాద్ మార్కెట్‌ రుచి మాత్రం వేరు. ఆ ప్ర‌త్యేక‌త‌లేంటో చూద్దాం.

ఈ సమయంలో మీరు నిజాం హైదరాబాద్ నగరంలో ఉన్నట్లయితే లేదా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇదే స‌రైన స‌మ‌యం. ఈ సమయంలో మీరు నిజంగా రుచికరమైన విందును ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు. హైద‌రాబాద్‌ నగరంలో రంజాన్ మాసంలో తినడానికి ఉత్తమమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

charminar1

చార్ మహల్ పెట్ల బుర్జ్

ఓల్డ్ సిటీలో మీరు హుస్సేనీ ఆలం రోడ్‌లో భారీ రకాల కబాబ్‌లను ఆస్వాదించ‌వ‌చ్చు. ఇది కాకుండా ఈ ప్రదేశం పతర్ కా గోష్ట్ (ఆవిరితో వండిన మాంసం), మటన్ సూప్ మరియు మరాగ్ (క్రీమ్ మీట్)లకు ప్రసిద్ధి చెందింది. పత్తర్ గోష్ట్ ప్రతిచోటా విక్రయించబడదు. ఈ స్థలంలో అది ప్రావీణ్యం పొందింది. రంజాన్ మాసంలో ఇక్క‌డి ఘుమ‌ఘుమ‌లు భోజ‌న ప్రియుల‌ను ఇట్టే ఆక‌ర్షిస్తాయి. అందుకే ఈ సీజ‌న్‌లో ఇక్క‌డ ర‌ద్దీ చాలా ఎక్కువ‌గా ఉంటుంది.

troopbazar1

ట్రూప్ బజార్

నిస్సందేహంగా నగరంలో అత్యుత్తమ హలీమ్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఇది బిర్యానీకి కూడా గొప్ప ప్రదేశం. నమ్మశక్యం కాని కబాబ్ ప్లేటర్‌లను చూసేందుకు మీ రెండు క‌ళ్లూ స‌రిపోవంటే న‌మ్మండి. బయట తినడం ఖరీదని భావించేవాళ్లు, ఇక్కడ సరసమైన ధరలో కడుపునిండా భోజనం చేయవచ్చు. ఎక్కువ‌గా మ‌ధ్య‌త‌ర‌గ‌తివారికి ఈ బ‌జార్ మంచి ఫుడ్ కోర్ట్‌గా చెబుతారు. ఇది కాకుండా, మీరు ఇక్కడ ఇరానీ టీ, బిర్యానీ, హలీమ్, ఇతర వంటకాలను కూడా రుచిచూడ‌వ‌చ్చు.

ghansibazar1

పంచ మొహల్లా, చార్మినార్

కొన్ని పండ్లు మరియు మలై (క్రీమ్) కలయికను ఆస్వాదించడానికి చార్మినార్ సమీపంలోని ఉత్తమ ప్రదేశాలలో ఇది ఒకటి కావచ్చు. ఇది గత ఐదు-ఆరు సంవత్సరాలలో హైదరాబాద్‌లో, ముఖ్యంగా చార్మినార్ సమీపంలో ప్రసిద్ధ ఫుడ్ సెంట‌ర్‌గా మారింది. ఇక్క‌డికి వ‌చ్చేవారికి ఎంపిక చేసుకునేందుకు చాలా ర‌కాల రుచులు ప‌ల‌క‌రిస్తాయి. మల్బరీ క్రీమ్ మరియు మ్యాంగో క్రీమ్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా కోరుకునే రెండు రుచులుగా చెప్పొచ్చు. మీరు కూడా వీటిని తప్పకుండా ఆస్వాదించ‌డం అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు.

charminar

ఘాన్సీ బజార్, చార్మినార్

రంజాన్ సందర్భంగా చార్మినార్ ప్రాంతానికి చేరుకోగలగితే ఇక్క‌డ‌కి వెళ్లండి. ఎందుకంటే, ఈ సీజ‌న్‌లో రద్దీని ఎదుర్కొని అక్క‌డికి చేరుకోవ‌డం మామూలు విష‌యం కాదండోయ్‌. అలా ఇక్కడికి చేరుకున్న‌ట్ల‌యితే, మీరు కొన్ని పురాతన బేకరీ దుకాణాలను చూడొచ్చు. ఇక్క‌డ ల‌భించే మంచి టీ మరియు నాణ్యమైన ఉస్మానియా బిస్కెట్లు లేదా బన్ మాస్కా వంటి ఇతర స్నాక్స్ మీ శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాన్ని అందిస్తుంద‌ని మాత్రం చెప్పొచ్చు.

More News

    Read more about: hyderabad telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+