Search
  • Follow NativePlanet
Share
» »థేని - గాలిలో సుగుంధ ద్రవ్యాల సువాసనలు !

థేని - గాలిలో సుగుంధ ద్రవ్యాల సువాసనలు !

థేని లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది ఇక్కడి సుగంధ ద్రవ్యాలు .. అవి వెదజల్లే సువాసనలు. అక్కడి తోటలన్నీ ఈ పరిమళాలతోనే గుప్పుగుప్పుమంటాయి.

By Mohammad

థేని లేదా తేని తమిళనాడు లోని పశ్చిమ కనుమల ఒడిలో సేదతీరుతూ ... అక్కడి ప్రకృతిని ఆహ్లాదపరుస్తూ ఉన్నది. వీకెండ్ లలో, పబ్లిక్ హాలిడేస్ లలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఆనందంగా గడిపివెళుతుంటారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కాబట్టి పర్యాటకులకు కూడా ఒకింత ప్లస్ పాయింటే ! పర్యాటకులను మరింతగా ఆకర్షించాలనే ఉద్దేశంతో అక్కడ ధరలు నామమాత్రంగా ఉంటాయి. కనుక బడ్జెట్ ప్రయాణాలలో థేని కూడా ఒక గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు.

మీనాక్షి ఆలయం -మమతానురాగాల నెలవు !

థేని లో ప్రముఖంగా చెప్పుకోవాల్సినది ఇక్కడి సుగంధ ద్రవ్యాలు .. అవి వెదజల్లే సువాసనలు. అక్కడి తోటలన్నీ ఈ పరిమళాలతోనే గుప్పుగుప్పుమంటాయి. డ్యాం లు, జలపాతాలు, కాఫీ తోటలు, ఆలయాలు మొదలగునవి థేని చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రధాన ఆకర్షణలు. ఈ పట్టణాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాల నుండి బస్సులు వస్తుంటాయి. థేని లో తప్పక సందర్శించవలసిన కొన్ని ప్రధాన ఆకర్షణలు ...

మేఘమలై హిల్స్

మేఘమలై హిల్స్

మేఘమలై హిల్స్ ను తెలుగువారు మేఘమాల కొండలు అని పిలుస్తారు. ఇది పశ్చిమకనుమలలో థేని పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ప్రదేశంలో సహజవృక్ష సంపద మరియు జంతు సంపద కలదు. సుమారు వందల రకాల పక్షలను కనుగొనవచ్చును.

చిత్రకృప : Vinoth Chandar

కొండలు

కొండలు

మేఘమలై హిల్స్ లో తమిళనాడు ప్రభుత్వం ఒక వైల్డ్ లైఫ్ సంక్చురి ని ఏర్పాటుచేసింది. వివిధ రకాల జంతువులకు, పక్షులకు, సరీసృపాలకు ఇది నిలయం. పులులు, ఉడుతలు, కోతులు, ఏనుగులు మొదలైన జంతువులను చూడవచ్చు. లవంగాలు, మిరియాలు తోటల సాగు అధికం. ఈ కొండలలో రెండు జలపాతాలు పుడతాయి.

చిత్రకృప : Prateek Rungta

సురులి ఫాల్స్

సురులి ఫాల్స్

ఈ ఫాల్స్ అక్కడ గల 18 రాతి గుహలకు ప్రసిద్ధి. ఇవి 40 అడుగుల ఎత్తు నుండి ఒక మడుగులో కింద పడి, మరలా 110 అడుగుల ఎత్తు నుండి కిందపడతాయి. ఈ జలపాతాలకు పుట్టినిల్లి మేఘమలై హిల్స్. సమీపంలోని సరళి వేలప్పర్ టెంపుల్ దర్శించదగ్గది.

చిత్రకృప : Kujaal

బాలసుబ్రమణ్యం టెంపుల్

బాలసుబ్రమణ్యం టెంపుల్

థేని లోని పెరియకులం లో బాలసుబ్రమణ్యదేవాలయం చూడదగ్గది. దీనిని రాజేంద్ర చోళుడు నిర్మించాడు. ఇందులో ప్రధాన దైవం మురుగన్ దేవుడు. ఆరు తలలు కలిగి భార్యతో దర్శనం ఇస్తారు స్వామి వారు. ఈ విగ్రహం భూమిలో నుంచి పుడుతుంది.

చిత్రకృప : Theni.M.Subramani

దేవదాన పట్టి కామాక్షి అమ్మన్ ఆలయం

దేవదాన పట్టి కామాక్షి అమ్మన్ ఆలయం

గుడి థేని కి 27 కి. మీ ల దూరంలో ఉన్న దేవదానపత్తి గ్రామంలో కలదు. ఈ టెంపుల్ మంజుల నది ఒడ్డున కలదు. టేపుల ద్వారాలు ఎప్పుడూ మూయబడి ఉంటాయి. అక్కడే పూజలు చేస్తారు. శివరాత్రి ఇక్కడ ఘనంగా జరుపుకొనే ఫెస్టివల్.

చిత్రకృప : Theni.M.Subramani

బోడిమెట్ట

బోడిమెట్ట

ఈ ప్రదేశం థేని కి 47 కి.మీ ల దూరంలో బోధినాయకనూర్ కు వెళ్ళే మార్గంలో కనిపిస్తుంది. సముద్రమట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులకు అందమైన విహార కేంద్రం. అధిక వృక్ష, జంతు సంపద తో పాటు పక్షులు అలరిస్తాయి.

చిత్రకృప : NSiddhu

చిన్న సురులి ఫాల్స్

చిన్న సురులి ఫాల్స్

ఎప్పుడూ బిజీ జీవితం గడపాలనుకొనేవారికి ఈ ఫాల్స్ తప్పక హాయిని ఇస్తాయి. థేని నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వీటిని క్లౌడ్ ల్యాండ్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు. ఇవి కూడా మేఘమలై హిల్స్ నుంచే పుడతాయి.

చిత్రకృప : அ.உமர் பாரூக்

షణ్ముగ నది డ్యాం

షణ్ముగ నది డ్యాం

ఈ డ్యాం ను రాయపంపట్టి వద్ద షణ్ముగ నది పై నిర్మించారు. తమిళనాడు పర్యాటక శాఖ ఇప్పుడిప్పుడే బోట్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. కిలోమీటర్ దూరంలో ఉన్న షణ్ముగ సుబ్రమణ్య టెంపుల్ దర్శించవచ్చు.

చిత్రకృప : Dhruvaraj S

మావుతు

మావుతు

మావుతూ వేళప్పర్ ఆలయాన్ని ప్రసిద్ధి. ఇది వరుసానాథ్ శిఖరంపై కలదు థేని - అనిపత్తి మధ్య కలదు. ఈ టెంపుల్ లో క నీటి బుగ్గ కలదు. అందులో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం.

చిత్రకృప : Mprabaharan

కుమ్బాక్కరాయి ఫాల్స్

కుమ్బాక్కరాయి ఫాల్స్

ఈ ఫాల్స్ కొడైకెనాల్ లో పుట్టి, పెరియకులం కు 9 కిలోమీటర్ల దూరంలో థేని జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఫాల్స్ వద్ద పక్షులు ధ్వనులు ఆనందించవచ్చు. జలపాతం కుంటల్లో చేరి స్నానాలు కూడా చేయవచ్చు. ఇక్కడ ఒక మురుగన్ విగ్రహం కూడా కలదు.

చిత్రకృప : Ashok Prabhakaran

కైలాసనాథ టెంపుల్ కేవ్

కైలాసనాథ టెంపుల్ కేవ్

ఇది సురులి ఫాల్స్ వద్ద సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులో కలదు. తమిళ క్యాలెండరు లో వచ్చే ఆది, తాయి, చిత్ర మాసాలలో టెంపుల్ ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఇక్కడ గల నీటి బుగ్గకి ఔషధ గుణాలు కలవు.

చిత్రకృప : Theni.M.Subramani

గౌమారి అమ్మన్ టెంపుల్

గౌమారి అమ్మన్ టెంపుల్

ఈ టెంపుల్ ను పాండవ రాజు వీర పాండవ కట్టబొమ్మన్ నిర్మించాడు. ఈ టెంపుల్ లోని దేవతను పూజించి వీరపాండ్య తన దృష్ణిని తిరిగి పొందాడని చెబుతారు. ఈ టెంపుల్ దేవత వ్యాధులను నయం చేస్తుందని, కోరిన కోరికలను తీరుస్తుందని భక్తుల నమ్మకం.

చిత్రకృప : telugu native planet

పురాతనమైనది

పురాతనమైనది

కుచానూర్ సాని టెంపుల్ కు ప్రసిద్ధి. సాని గల మరొక కుబ్జనూర్ పేరుపై కుచానూర్ అనే పేరొచ్చింది. ఇది పురాతనమైనది. ఇతిహాసాల ప్రకారం ఇంద్రుడు ఈ దేవతను పూజించాడని ప్రతీతి. గణపతి దేవాలయం, హనుమాన్ దేవాలయం ఇక్కడ చూడవచ్చు.

చిత్రకృప : telugu native planet

ఏవేవి కొనుక్కోవచ్చు ?

ఏవేవి కొనుక్కోవచ్చు ?

మీరు గనక థేని లో ఉంటె మెత్తని టవల్స్, మామిడి పండ్లు, సిల్క్ కాటన్, సగుంధాల యాలకులు, తాజా కాఫీ గింజలు, గ్రీన్ టీ వంటివి కొనుగోలు చేయవచ్చు. థేని లో వసతికై చక్కటి గదులు కూడా అద్దెకు దొరుకుతాయి.

చిత్రకృప : Kiruba Shankar

ఉత్సవాలు

ఉత్సవాలు

థేని లో పొంగల్, మాసి మహం, శివరాత్రి పండుగలు బాగా జరుగుతాయి. పండుగలలో భాగంగా ప్రసిద్ధి చెందిన ఎద్దుల పందేలు నిర్వహిస్తారు.

చిత్రకృప : Jan J George

థేని

థేని

ఎలా వెళ్ళాలి ?

వాయు మార్గం : థేని కి సమీపాన మధురై ఎయిర్ పోర్ట్ 90 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి థేని చేరుకోవచ్చు.

రైలు మార్గం : థేని లో రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి చెన్నై, మధురై, కొచ్చి, త్రివేండ్రం, కన్యాకుమారి , బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.

రోడ్డు మార్గం : చెన్నై, మధురై, తంజావూరు తదితర ప్రాంతాల నుంచి థేని కి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్రకృప : Hemanthjijo

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+