Search
  • Follow NativePlanet
Share
» »బెంగళూరులో ఈ రెస్టోరెంట్లలో భోజనం చేయడం మరిచిపోకండి?

బెంగళూరులో ఈ రెస్టోరెంట్లలో భోజనం చేయడం మరిచిపోకండి?

బెంగళూరులో ఉన్న బెస్ట్ రెస్టోరెంట్ల గురించి కథనం.

విద్యా, ఉద్యోగ, ఉపాధి కోసం భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది బెంగళూరుకు చేరుకొంటున్నారు. పండుగులకు ఊరికి వెళ్లాలనుకోవడం సమహజం. అయితే ప్రతి పండుగకు అలా ఊరికి వెళ్లడం వీలుకాకపోవచ్చు.. అయితే ఆ పండుగరోజైనా మన ప్రాంత వంటకాలను రుచి చూడాలనిపించడం సహజం. అలాంటి వారికోసమే బెంగళూరులో ఆయా రాష్ట్రాల రెస్టోరెంట్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన రెస్టోరెంట్లు, అందులో దొరికే ప్రత్యేక వంటకాల గురించిన సమాచారం మీ కోసం...

హైదరాబాద్ బిర్యానీ

హైదరాబాద్ బిర్యానీ

P.C: You tube

బిర్యానీల్లో హైదరాబాద్ బిర్యానీ చాలా ఫేమస్. అయితే ఆ బిర్యానీ తినాలంటే హైదరాబాద్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. బెంగళూరులోని జే.పీ నగర్, ఇంద్రానగర్ తదితర చోట్ల ప్యారడైజ్ రెస్టోరెంట్ ఉంది. అదే
విధంగా రిచ్‌మండ్ సర్కిల్‌లోని బిర్యానీ హౌస్‌లో కూడా హైదరాబాద్ బిర్యానీని తినొచ్చు..

గోవాన్ కుసిన్

గోవాన్ కుసిన్

గోవాన్ కుసిన్

P.C: You tube
గోవాలో దొరికే వంటకాలను మీకు తినాలని ఉందా? అయితే బెంగళూరులోని సర్జాపూర్ రోడ్‌లోని ఫిషర్‌మాన్స్ వార్ఫ్ రెస్టోరెంట్ మీకు స్వాగతం పలుకుతోంది. ఇక్కడ వెజ్, నాన్‌వెజ్ వంటకాలన్నీ దొరుకుతాయి. ముఖ్యంగా ప్రాన్ ఫ్రై, ఫిష్ రోస్ట్ టేస్టీగా ఉంటుంది.

పంజాబి ఫుడ్

పంజాబి ఫుడ్

P.C: You tube

పక్కా పంజాబి ఫుడ్‌ను రుచి చూడాలంటే నీవు బాబా చట్కాకి వెళ్లాల్సిందే. ఇక్కడ పంజాబి థాలీ నుంచి మొదలుకొని కడాయ్ చికెన్, లస్సీ వంటి ఎన్నో రకాల పంజాబి వంటకాలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా పంజాబి టైమ్స్ కూడా బెంగళూరులో చాలా ఫేమస్ పంజాబి ఫుడ్ రెస్టోరెంట్.

కేరళ సీ ఫుడ్

కేరళ సీ ఫుడ్

P.C: You tube

కేరళ సీ ఫుడ్ రుచి చూడాలంటే బెంగళూరులోని దొమ్ములూరులో ఉన్న వెంబనాడ్ ది పౌల్ రెస్టోరెంట్‌కు వెళ్లాల్సిందే. అదే విధంగా అరటి ఆకులో కేరళ వంటకాలను రుచి చూడాలంటే మాత్రం ఎంటే కేరళ
రెస్టోరెంట్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడి వంటకాలన్నీ ఎంతో రుచిగా ఉంటాయి.

తమిళనాడు డిష్

తమిళనాడు డిష్

P.C: You tube

తమిళనాడు వంటకాలను రుచి చూడాలంటే మీరు నాచియార్ రెస్టోరెంట్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ మీకు అన్ని రకాల నాన్‌వెజ్ వంటకాలను రుచి చూడొచ్చు.. కోరమంగళలోని అంజప్పార్ రెస్టోరెంట్‌లో కూడా మీరు మంచి తమిళనాడు వంటకాల రుచులను ఆస్వాధించవచ్చు..

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+