Search
  • Follow NativePlanet
Share
» » స్కూబా డైవింగ్ చేయాలనుకొంటున్నారా? ఈ ప్రాంతాలు ఎదురు చూస్తున్నాయి

స్కూబా డైవింగ్ చేయాలనుకొంటున్నారా? ఈ ప్రాంతాలు ఎదురు చూస్తున్నాయి

ఇండియాలో స్కూబా డైవింగ్ కు అనుకూలమైన ప్రాంతాల గురించి కథనం.

వాటర్ స్పోర్ట్స్ లో స్కూబా డైవింగ్ ను రారాజు అంటారు. ఇతి అత్యంత వినోధభరితమైన క్రీడే కాకుండా అత్యంత ఉత్కంటకు గురిచేసే జల క్రీడ. అందువల్లే ఈ స్కూబా డైవింగ్ కు ఆ పేరు. సముద్రం లోపుల జలచరాలతో జలకాలాడుతూ అక్కడి అందాలను చూడటం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందు కోసమే యువత ఈ స్కూబా డైవింగ్ ను ఎంచుకొంటోంది. ఈ విశాల భారత దేశంలో అనేక రాష్ట్రాలకు సముద్ర తీర ప్రాంతాలు ఉన్నాయి. అయితే కొన్నింటిలో మాత్రమే స్కూబా డైవింగ్ కు అనుకూలం. అటు వంటి ప్రాంతాల వివరాలు మీకు ఈ కథనంలో అందిస్తున్నాం. మీరు అడ్వెంచర్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వారైతే ఈ ప్రదేశాలలో పర్యటనకు వెళితే తప్పక అక్కడ స్కూబా డైవింగ్ అనుభవాన్ని చవిచూడండి. అయితే తప్పక నిపుణుల సహాయం తీసుకోవడమే కాకుండా వారి చెప్పిన జాగ్రత్తలు తూ.చా తప్పకుండా ప్రాటించండి.

 అండమాన్ నికోబార్ దీవులు

అండమాన్ నికోబార్ దీవులు

P.C: You Tube

ఇక్కడ సముద్ర నీరు అత్యంత శుభ్రంగా, శుచిగా ఉంటుంది. దీంతో స్కూబాడైవింగ్ అన్న వెంటనే ప్రతి ఒక్కరికి అండమాన్ నికోబార్ దీవులే గుర్తుకు వస్తాయి. ఇక్కడ స్కూబా డైవింగ్ సమయంలో అనేక సముద్ర వృక్ష జాతులు, స్కార్పియన్ చేప, ఆక్టోపస్, అంగెర్ ఫిష్, షార్క్స్ మరియు కోరల్ రీఫ్స్ వంటి సముద్ర జంతువులను అతి సమీపం నుంచి చూడటమే కాకుండా వాటితో పాటు ఈత కూడా కొట్టవచ్చు. ఒక్కొక్క డైవింగ్ కు ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తారు. ఇక్కడ ఉన్న డైవ్ సైట్లలలో ముఖ్యమైనవి

ది వాల్ (హావ్లాక్ ఐలాండ్)

సిన్క్యూ ద్వీపం (పోర్ట్ బ్లెయిర్)

ఫిష్ రాక్ (పాసేజ్ ద్వీపం)

గోవా

గోవా

P.C: You Tube

గోవా అన్న తక్షణం మనకు అక్కడి బీచ్ లే గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి మీరు గోవా వెళ్లినప్పుడు మాత్రం గోవాలో ఏ టూరిజం ప్యాకేజ్ అందించే సంస్థను అడిగినా స్కూబా డైవింగ్ కు అనుకూలమైన ప్రాంతాల పేర్లు, అక్కడికి చేరుకొనే విధానం, ధరలు తెలియజేస్తారు. గోవాలో స్కూబా డైవింగ్ ఎప్పటి నుంచి అందుబాటులో ఉన్నా అంతగా ప్రాచూర్యంలోకి రాలేదు. ఇక్కడ ఒక్కొక్క డైవింగ్ కు ఒక్కొక్కరికి రూ.5వేల నుంచి రూ.8వేలను వసూలు చేస్తారు. ఇక్కడ ఉన్న డైవ్ సైట్లలో ముఖ్యమైనవి

ఉమా గావ్ రీఫ్

షెల్టర్ కోవ్

లాకర్ ఆఫ్ డేవ్ జోన్స్

దిజెట్టీ

లక్షద్వీప్

లక్షద్వీప్

P.C: You Tube

36 ద్వీపాల కలయిక వల్ల లక్షద్వీప్ ఏర్పడింది. మొత్తం సముద్ర తీర ప్రాంతం 240 మీటర్లు. ఇక్కడ సముద్ర నీరు అత్యంత శుభ్రంగా, శుచిగా ఉండటం వల్ల స్కూబా డైవింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది. స్కూబా డైవింగ్ చేసే సమయలో రంగురంగుల చేపలు, అక్టోపస్ లు వంటివి మనలకు తాకుతూ వెలుతుంటాయి. ఇక్కడ ఒక్కొక్క డైవింగ్ కు ఒక్కొక్కరికి రూ.4వేల నుంచి రూ.7వేలును వసూలు చేస్తారు. ఇక్కడ ఉన్న డైవ్ సైట్లలో ముఖ్యమైనవి...

అగట్టి ఐలాండ్

బంగార్ ఐలాండ్

 పాండిచ్చేరి

పాండిచ్చేరి

P.C: You Tube

ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ మరియు చరిత్రకు పాండిచేరి ప్రసిద్ధి చెందినది. ఈ పట్టణం ఆధునిక వారసత్వం మరియు ఆధ్యాత్మిక సంస్కృతిని కూడా అందిస్తుంది. అంతే కాకుండా ఇక్కడి బీచ్ లు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇక్కడి సముద్ర తీర ప్రాంతాల్లో ఓర్ల్స్, లయన్ ఫిష్, కింగ్ ఫిష్, మోరే ఈల్స్, ఈగిల్ మరియు మాంటా కిరణాలు, చిలుక చేపలు, సీ పాములు మరియు టైగర్ చేపలు ప్రత్యేకం. ఇక్కడ ఒక్కొక్క డైవింగ్ కు ఒక్కొక్కరి నుంచి రూ. 6,500 నుంచి రూ.8 వేల వరకూ వసూలు చేస్తారు.

డైవ్ సైట్లు:

కూల్ షార్క్ రీఫ్

టెంపుల్ రీఫ్

ది హోల్

 కరావళి ప్రాంతం, కర్నాటక

కరావళి ప్రాంతం, కర్నాటక

P.C: You Tube

దక్షిణ భారత దేశ రాష్ట్రమైన కర్నాటకకు కూడా విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉంది. ఇక్కడి సముద్రంలోతు కొంత తక్కువగా ఉండటమే కాకుండా నీళ్లు చాలా తేటగా ఉంటాయి. అందువల్ల స్కూబా డైవింగ్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. చాలా కాలంగా ఇక్కడ స్కూబాడైవింగ్ అందుబాటులో ఉన్నా కూడా ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం స్కూబాడైవింగ్ విషయంలో ప్రాచూర్యంలోకి వస్తోంది. ఇక్కడ ఒక్కొక్క డైవింగ్ కు ఒక్కొక్కరికి రూ.5,500 వేల నుంచి రూ.7వేలును వసూలు చేస్తారు. ఇక్కడ ఉన్న డైవ్ సైట్లలో ముఖ్యమైనవి...

నేత్రాణి ద్వీపం

మురుడేశ్వర

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+