Search
  • Follow NativePlanet
Share
» » చిటపట చినుకుల్లో కొండ గుట్టల చివర్లో

చిటపట చినుకుల్లో కొండ గుట్టల చివర్లో

వర్షాకాలంలో కర్నాటకలో ట్రెక్కింగ్ కు అనువైన మార్గాలకు సంబంధించిన కథనం.

వేసవి వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం బండెడు ఆహ్లాదన్ని, సంతోషాన్ని తెస్తుంది. వర్షాకాలం ప్రతి ఒక్కరికీ ఆనందం కలిగించే విషయమే. ముఖ్యంగా ఉత్సాహం ఉరకలు వేసే యువతకు ఈ వర్షాకాలం సంతోషాన్నే కాకుండా సహసాలు చేసే ఆలోచనలను కూడా అందిస్తుంది.

ముఖ్యంగా ట్రెక్కర్స్ కు. ఉద్యాన నగరిగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో వీకెండ్ వచ్చిందంటే చాలు ట్రెక్ సూట్, బ్యాగ్ వేసుకొని కొండలు, గుట్టల వైపు నడుస్తారు. ముఖ్యంగా చిరుజల్లులు పడే సమయంలో అంతెత్తున ఉండే గుట్టలను ఎక్కుతూ ముందుకు సాగడం అటు మానసిక, ఇటు శారీరక ధారుడ్యాన్ని కూడా పెంపొందిస్తుందనడం అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో బెంగళూరుకు దగ్గరగా ఉండి ఈ వర్షాకాలంలో ట్రెక్కింగ్ కు అనుకూలమైన ఐదు ప్రాంతాలకు సంబంధించిన కథనం మీ కోసం

దూద్ సాగర్ ట్రెక్

దూద్ సాగర్ ట్రెక్

P.C: You Tube

అందమైన జలపాతాల్లో తెల్లని నురుగులు గక్కే దూద్ సాగర్ మొదటి వరుసలో ఉంటుంది. పేరులో ఉన్నట్టే ఈ దూద్ సాగర్ జలపాతంలో పై నుంచి పడే నీరు పాలవలే కంటికి కనిపించి విందును చేస్తుంది. ఇక ఇక్కడ ట్రెక్ మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది. జీవవైవిద్యంతో కూడిన ఈ దూద్ సాగర్ జలపాతం చుట్టూ ఉన్న చిట్టడవి మీకు పచ్చని తివాచీతో స్వాగతం పలుకుతుంది. మీరు కోరుకొంటే రాత్రి పూట కూడా ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంది.

ట్రెక్ దూరం.......... దాదాపు 28 కిలోమీటర్లు (కాసాల్డ్ రాక్ వైపు నుంచి), 22 కిలోమీటర్లు (కులెమ్ వైపు నుంచి)

ట్రెక్ కు అవసరమైన సమయం.... దాదాపు 6 నుంచి 8 గంటలు

ట్రెక్ మార్గం....సులభంగానే ఉంటుంది.

కుద్రేముఖ్ ట్రెక్

కుద్రేముఖ్ ట్రెక్

కుద్రేముఖ్ ను భూతల స్వర్గం అనడంలో సందేహం లేదు. చుట్టూ పచ్చని పర్వత శిఖరాలు దగ్గర్లో సముద్ర తీర ప్రాంతం ఇవన్నీ ట్రెక్కర్స్ ను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఎతైన చెట్ల కంటే పచ్చటి గడ్డి మైదానాలు ఎక్కువగా కనిపిస్తాయి. పచ్చటి గడ్డి మైదనాల్లో సమయాన్ని మరిచి అలా నడుచుకొంటూ వెళ్లడం ప్రక`తితో మమేకం కావడం కాదా?

P.C: You Tube

ట్రెక్ దూరం.......... 22 కిలోమీటర్లు

ట్రెక్ కు అవసరమైన సమయం.... దాదాపు 6 నుంచి 7 గంటలు

ట్రెక్ మార్గం.... మథ్యస్థం నుంచి కొంత కఠినంగా

కొడచాద్రి ట్రెక్

కొడచాద్రి ట్రెక్

P.C: You Tube

కర్నాటక ప్రభుత్వం ప్రకటించిన సంరక్షించబడే ప్రాంతాల జాబితాలో కొడచాద్రి పర్వత ప్రాంతం స్థానం సంపాదించుకొంది. దీన్నిబట్టి ఇక్కడ ప్రక`తి సంపద ఎంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలను ఇష్టపడే వారికి ఈ కొడచాద్రి స్వర్గధామం. ట్రెక్కర్స్ కు మార్గమధ్యలో ఉన్న జలపాతాలు పలకరించి దాహం తీరుస్తాయి.

ట్రెక్ దూరం.......... 18 కిలోమీటర్లు

ట్రెక్ కు అవసరమైన సమయం.... దాదాపు 5 నుంచి 6 గంటలు

ట్రెక్ మార్గం.... కొంత కఠినం

నిషాని మూతే ట్రెక్

నిషాని మూతే ట్రెక్

P.C: You Tube

కూర్గ్ ప్రాంతంలో అత్యంత తక్కువ మందికి తెలిసిన నిషాని మూతే ట్రెక్ మార్గం బ్రహ్మగిరి కొండల్లో ఒక భాగం. కావేరి జన్మస్థానం తలకావేరి కూడా ఈ ట్రెక్ మార్గానికి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ట్రెక్ చేయడానికి స్థానిక అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ట్రెక్ దూరం.......... 16 కిలోమీటర్లు

ట్రెక్ కు అవసరమైన సమయం.... దాదాపు 5 నుంచి 6 గంటలు

ట్రెక్ మార్గం.... సులభం

తడియాండమోల్ ట్రెక్

తడియాండమోల్ ట్రెక్

P.C: You Tube

ట్రెక్ కు మీరు కొత్త అయితే ఈ తడియాండమోల్ ట్రెక్ మార్గం మీకు అనువైనది. కర్నాటకలో మూడో అతి పెద్ద పర్వత శిఖరం ఈ తడియాండమోల్ ట్రెక్. అయినా కూడ మార్గం చాలా బాగుంటుంది. అందువల్ల పెద్దగా శ్రమ పడకుండానే ఈ ట్రెక్ మార్గాన్ని పూర్తి చేయవచ్చు. ఫొటోగ్రఫీ కి కూడా అనువైన ప్రాంతం.

ట్రెక్ దూరం.......... 15 కిలోమీటర్లు

ట్రెక్ కు అవసరమైన సమయం.... దాదాపు 5 నుంచి 6 గంటలు

ట్రెక్ మార్గం.... సులభం

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+