Search
  • Follow NativePlanet
Share
» »బెట్టద బిర్యానీ దొరికేది ఇక్కడే?

బెట్టద బిర్యానీ దొరికేది ఇక్కడే?

నంది హిల్స్ వద్ద దొరికే బెట్టద బిర్యానీకి సంబంధించిన కథనం.

బిర్యానీ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. ముఖ్యంగా నాన్‌వెజ్ ప్రియులు అయితే వారానికి ఒక్కసారైనా బిర్యానీ రుచి చూడాల్సిందే. మీరు ఇప్పటికే అనేక రకాలైన బిర్యానీలు తిని ఉంటారు. ఆ కోవలోకే వచ్చే బెట్టద బిర్యానీ తిన్నారా? ఈ బిర్యానీకి సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

బెంగళూరులో వివిధ రకాలైన బిర్యానీలు మీరు ఇప్పటికే రుచి చూసి ఉంటారు. అయితే బెంగళూరుకు దగ్గర్లోని నందిహిల్స్ వద్ద ఉన్న బెట్టద బిర్యానీ గురించి మీకు తెలుసా? ఈ బిర్యానీ పేరు ఒక విచిత్రంగా అని పిస్తోంది కదూ.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

నందిహిల్స్ బెంగళూరుకు దగ్గర్లో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. చాలా మంది ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూడటానికి వస్తుంటారు. బెంగళూరు వాసులకు నందిహిల్స్ ఒకరకమైన వీకెండ్ ప్లేస్ అని చెప్పవచ్చు.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

ఇక వీకెండ్ సమయంలో నందిహిల్స్‌కు ఫ్రెండ్స్ జతలో వెల్లడం చాలా మజాగా ఉంటుంది. అలాంటివారికి ఇక్కడ దొరికే బెట్టద బిర్యానీ రుచి చూపించాలనే ఈ కథనం. ఈ బిర్యానీ రుచి తిని తెలుసుకోవాల్సిందే కాని చెప్పడం అంత తేలిక కాదు.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

ఈ బెట్టద బిర్యానీ నందిహిల్స్ కు వెళ్లే దారి మధ్యలో మౌంట్ పలాజో హోటల్ ఎదురుగా ఉంది. మీరు గూగుల్ మ్యాప్ లో బెట్టద బిర్యానీ అని టైప్ చేస్తే అందుకు సంబంధించిన దారి మీకు గూగుల్ చూపిస్తుంది.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

ఈ బిర్యానీ మీకు ప్రతి రోజూ దొరకదు. కేవలం ఆదివారం మాత్రమే ఈ బిర్యానీ మీకు దొరుకుతుంది. మిగిలిన సమయంలో మాత్రం మీకు కేవలం వెజ్‌మీల్స్ మాత్రమే దొరుకుతుంది.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

ఇంజనీరింగ్ చదివిన కొంతమంది యువకులు ఈ బెట్టద బిర్యానీ హోటల్‌ను ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ సూర్యోదయాన్ని అయినా మిస్ చేసుకోండికాని బిర్యానీని మాత్రం మిస్ చేసుకోకండి అని రాసిఉంటుంది.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

అందులోనూ ఈ బిర్యానీ రోజు మొత్తం దొరకదు. కేవలం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే ఈ బిర్యానీ మీకు దొరుకుతుంది. మీకు ఈ బిర్యానీ రుచి చూడాలంటే ఆ సమయం మధ్యలోనే వెళ్లాల్సి ఉంటుంది.

బెట్టద బిర్యానీ

బెట్టద బిర్యానీ

P.C: You Tube

ఈ బెట్టద బిర్యానీ ధర కేవలం రూ.80 మాత్రమే. రుచి కూడా చాలా బాగుంటుంది. అందుకే చాలా మంది ఈ బెట్టద బిర్యానీ తినడానికే ఇటీవల నందిహిల్స్ కు వస్తున్నారు. ఈ సారి నందిహిల్స్ కు వెళ్లే సమయంలో ఈ బెట్టద బిర్యానీ తినడం మాత్రం మరిచిపోకండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+