Search
  • Follow NativePlanet
Share
» »భద్ర వైల్డ్ లైఫ్ సంక్చురి

భద్ర వైల్డ్ లైఫ్ సంక్చురి

భద్ర వన్య జంతు సంరక్షణాలయం కర్నాటక లోని చిక్కమగలూర్ జిల్లాలో కలదు. సుమారు 500 చ.కి. మీ. ల విస్తీర్ణం కల ఈ వన్య జంతు సంరక్షణాలయం సముద్ర మట్టానికి 1.875 మీ. ల ఎత్తులో కలదు. దీనినికి సమీప పట్టణం చిక్కమగలూర్ . భద్ర నది ఉప శాఖలు భధ్ర గుండా ప్రవహిస్తాయి. చుట్టూ హెబ్బెగిరి, గంగే గిరి, మల్లయన గిరి, బాబా బూదాన్ గిరి వంటి కొండలు రమణీయంగా కనపడతాయి. పడమటి కనుమలలోని కుద్రేముఖ్ వద్ద మూలస్ధానంగా గల భద్రానది మూలాలను తప్పక చూడాల్సిందే. ఈ నది దక్కన్ పీఠభూమి గుండా ప్రవహించి దాని ఉపనదులతో సోమవాయిని ని తడబేహళ్ళ, హెబ్బె, ఒడిరాయన హళ్ళ వద్ద కలుస్తుంది. లక్కవల్లి సమీపంలో భద్ర నదిపై డ్యామ్ కట్టారు. ఇక్కడనుండి అది భద్రావతి మీదుగా ప్రవహించి కూడ్లి వద్ద తుంగ నదితో కలుస్తుంది. ఇది శివమొగ్గ కు దగ్గరగా ఉంది.

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

ఈ సంక్చురి లో విస్తృతమైన వృక్ష, జంతు జాలాలు కలవు. భద్ర సంక్చురి బెంగుళూరు వాసులకు ఒక రోజు పిక్నిక్ ప్రదేశంగా తప్పక చూడదగినది.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

ఈ సంక్చురి లో హేబ్బే గిరి అతి ఎత్తైన శిఖరం. సంక్చురి చుట్టూ అద్భుత ప్రకృతి దృశ్యాల కొండలు కలవు. ముల్లయన గిరి, హేబ్బెగిరి, గంగ గిరి , బాబా భూదాన్ గిరి కొండలు వీటిలో ప్రధానమైనవి.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

సంక్చురి కి తూర్పు భాగాన 551 మీ. ల ఎత్తు నుండి పడే హేబ్బే జలపాతాలు ఒక ప్రధాన ఆకర్షణ. బాబా బూదాన్ గిరి హిల్స్ సమీపంలో మానిక్యదారా జలపాతాలు కూడా చూడవచ్చు.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

భద్ర నది యొక్క ఉప శాఖలు కొన్ని సాన్క్చురి గుండా ప్రవహిస్తాయి. సంక్చురి పడమటి భాగం భద్ర రిజర్వాయర్ కలదు.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

భద్ర వన్య జంతువుల సంరక్షణాలయం 1951 లో స్థాపించినప్పటికీ, 1998 సంవత్సరంలో ప్రభుత్వం ఈ సంక్చురి ని ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ గా ప్రకటించింది. ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

ఈ సంక్చురి లో దట్టమైన పచ్చటి అటవీ ప్రదేశాలు, వివిధ రకాల మొక్కలు, జంతువులతో నిండి వుంటాయి. ఈ సంక్చురి లో నేటికీ సుమారు 33 పులులు కలవని అంచనా.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

ఏనుగులు, గౌర్, స్లోత్ బేర్, వైల్డ్ బోర్, బ్లాకు లియోపార్డ్, జంగల్ కేట్, జాకాల్, వైల్డ్ డాగ్, జాకాల్, సాంబార్ , మచ్చల జింక, బార్కింగ్ డీర్, మౌస్ డీర్, కామన్ లంగూర్ వంటి జంతువులు చూడవచ్చు.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

భద్ర వైల్డ్ లైఫ్ సంక్చురి వివిధ రకాల సరీనృపాలకు సైతం ఆశ్రయ మిస్తోంది.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

ఈ సంక్చురి లో సుమారు 300 రకాలకు పైగా పక్షులను చూసి ఆనందించవచ్చు.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వాటిలో కొన్ని స్థానికం కాగా మరికొన్ని వలస పక్షులు గా వుంటాయి. గ్రీ జంగల్ ఫౌల్, రెడ్ స్పర ఫౌల్, పెయింటెడ్ బుష్ క్విల్, ఎమేరల్ద్ డోవ్, సథరన్ గ్రీన్ ఇంపీరియల్ పీజియన్ గ్రేట్ బ్లాకు వుడ్ పెక్కర్, మలబార్ పారాకీట్, హిల్ మైనా , రూబి త్రోట్ బుల్ బుల్, శామా, మలబార్ ట్రోజన్, మలబార్ విజిలింగ్ ట్రాష్, ఫోర్ స్పీసీస్ హార్న్ బిల్, వంటివి తరచుగా కనపడతాయి.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

భద్ర సంక్చురి లో మీరు వివిధ రకాల సీతాకోక చిలుకలు కూడా చూడవచ్చు. ఈ సాన్క్చురి ఎంత బాగా సంరక్షిన్చబడుతున్నప్పటికి, వరదల వంటి సహజ ఉపద్రవాలు, పట్టన అభివృద్ధి,ఆధునీకరణలు కారణంగా ఇక్కడి వృక్ష, జంతు జాలాలకు తీరని న ష్టం వాటిల్లుతోంది .

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

సంక్చురి సమీపంలో భద్రావతి, తారికేరే, చంనగిరి పట్టణాలు కలవు. పర్యాటకులు ఈ పట్టణాలలో తగిన వసతులు పొందవచ్చు.భద్రా వతి పట్టణానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైలు, బస్సు సౌకర్యాలు కలవు. భాద్రావతి నుండి 170 కి. మీ. ల దూరంలో, హుబ్లి లో సమీప విమానాశ్రయం కలదు.
ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

 వన్ డే విహారం - విహంగ వీక్షణం!

వన్ డే విహారం - విహంగ వీక్షణం!

ఈప్రదేశ ఉష్ణోగ్రతలు కనిష్టం 10 డిగ్రీల నుండి గరిష్టం 35 డిగ్రీలుగా మారుతూంటాయి.పక్షులు వలసలు వచ్చే శీతాకాలం సందర్శనకు అనుకూలమైనది.

ఫోటో క్రెడిట్ : varakumar siddavatam

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+