Search
  • Follow NativePlanet
Share
» » కర్నాటక రాష్ట్రంలో పక్షి అభయారణ్యాలు!

కర్నాటక రాష్ట్రంలో పక్షి అభయారణ్యాలు!

కర్నాటక రాష్ట్రం పర్యాటకులను అందరనూ వివిధ రకాల పక్షుల కిల కిల ధ్వనులతో ఆహ్వానిస్తూ వుంటుంది. ప్రపంచ నలుమూలల నుండి పక్షుల పట్ల ఆసక్తి కలవారు కర్నాటక రాష్ట్రానికి వచ్చి తమ ఇష్టానుసారం ఆనందిస్తారు. కర్నాటక లో సుమారు 513 పక్షి జాతుల వరకూ గుర్తించ బడ్డాయని అధికార అంచనాలు చెపుతున్నాయి. ఉత్తర కర్నాటక ప్రాంతాలు, కూర్గ్ మరియు మైసూరు లలోని అధిక భాగాలు పక్షి ప్రియులకి ఆసక్తి కలిగిస్తాయి. ఆ కారణంగానే ఈ ప్రాంతాల గురించి అధిక సమాచారం వుంటుంది. సాధారణంగా కనపడే విహన్గాలే కాక, అరుదైన పక్షులు కూడా మీరు ఈ ప్రాంతాలలో చూడవచ్చు. కొత్తగా పక్షులను గమనిన్చేవారికి, ఈ పక్షి జాతుల పేర్లు గురించి చాలా కొత్తగా వుంటుంది. అయితే, వాటి అందాలు అన్నీ చూసే వారి కన్నులను బట్టి వుంటాయి. కనుక, మీరు కొత్త వారైనప్పటికీ ఈ ప్రాంతాలు చూసి ఈ పక్షి జాతుల అరుదైన అందాలు చూసి వాటి కిల కిలారావాలను విని ఆనందించండి.

రంగన్న తిట్టు బర్డ్ సంక్చురి

రంగన్న తిట్టు బర్డ్ సంక్చురి

మైసూరు నగరానికి ఉత్తరంగా సుమారు 16 కి. మీ. లలో మండ్య జిల్లాలో కల రంగన్నతిట్టు బర్డ్ సంక్చురి కర్నాటక రాష్ట్రంలో పెద్దదిగా చెప్పబడుతుంది. ఇక్కడ సుమారు 170 రకాల పక్షులు, పెయింటెడ్ స్టార్క్ మరియు గ్రేట్ స్టోన్ ప్లోవేర్ వంటివి ఇక్కడ కలవు.

బంకాపూర పీకాక్ సంక్చురి

బంకాపూర పీకాక్ సంక్చురి

బంకాపూర నెమళ్ళ అభయారణ్యం లో పూర్తిగా నెమళ్ళు మాత్రమే వుంటాయి. ఈ సాన్క్చురి హవేరి జిల్లా లోని బంకాపూర కోట సమీపంలో కలదు. దీనిలో సుమారు వేయి కి పైగా నెమళ్ళు కలవు. నేమళ్లే కాక వుడ్ పెక్కర్స్, మగ్పీ, బాబ్లార్ మరియు గ్రేట్ హార్న్ ఔల్స్ వంటివి కూడా ఎగరటం చూడవచ్చు.

అత్తివేరి బర్డ్ సంక్చురి

అత్తివేరి బర్డ్ సంక్చురి

ఈ సాన్క్చురి కి ప్రతి సంవత్సరం వలసలు వచ్చే నీటి పక్షులు వస్తాయి. ఈ ప్రాంతాన్ని 2000 సంవత్సరంలో బర్డ్ సాన్క్చురి గా గుర్తించారు. అత్తివేరి ఉత్తర కన్నడ జిల్లా లో హుబ్లి సమీపంలో ముందగోడ్ విలేజ్ లో కలదు. దీనిలో దార్టార్ లేదా స్నేక్ బర్డ్, కేటిల్ ఎగ్రేట్, ఇండియన్ అండ్ లిటిల్ కర్మోరాంట్ , బ్లాకు హెడ్ ఇబీస్ వంటి జాతులు కలవు.

 గుడవి బర్డ్ సాన్క్చురి

గుడవి బర్డ్ సాన్క్చురి

షిమోగా లోని సోరబ్ తాలూకా లో కలదు. దీనిలో సుమారు 217 జాతుల పక్షులు కలవు. ఈ పక్షులను స్టడీ చేయాలనుకునే వారికి జూన్ నుండి అక్టోబర్ వరకూ సరైన సమయం.

 మాగడి బర్డ్ సాన్క్చురి

మాగడి బర్డ్ సాన్క్చురి

మాగడి బర్డ్ సాన్క్చురి గదగ్ లోని మాగడి సరస్సు వద్ద కలదు. ఈ ప్రదేశం కర్నాటక లో చక్కటి జీవ వైవిధ్యం కలది. పొడవు తల కల బాతులు ఇక్కడ సాధారణంగా కనపడుతాయి.

 కగ్గలాడు బర్డ్ సాన్క్చురి

కగ్గలాడు బర్డ్ సాన్క్చురి

కగ్గలాడు బర్డ్ సాన్క్చురి తుంకూర్ జిల్లా లోని సిరా తాలూకా లో కలదు. కగ్గలాడుప్రదేశం వెట్ ల్యాండ్ కనుక వలస పక్షులకు ఇది సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. పెయింటెడ్ స్టార్క్ లు, గ్రే హేరాన్స్ వంటివి ఇక్కడ కామన్ గా చూడవచ్చు.

 కొక్కరే బెల్లూర్

కొక్కరే బెల్లూర్

సౌత్ ఇండియా లో కొక్కరే బెల్లూర్ ప్రదేశం పెయింటెడ్ స్టార్క్ పక్షులకు అతి పెద్ద సాన్క్చురి. కన్నడంలో 'కొక్కరే' అంటే పెలికాన్ లు లేదా స్టార్క్ అని అర్ధం చెపుతారు. 2009 సంవత్సరంలో ఈ జాతిని అంతరించి పోతున్న జాతిగా ప్రకటించారు. ' బెల్లూర్ ' అంటే తెల్లని విలేజ్ అని అర్ధం. మాండ్య జిల్లా లోని మద్దూర్ తాలోకాలో కల ఈ గ్రామస్తులు ఈ వలస పక్షులను తమ కుటుంబాలలో ఒక భాగంగా చూసుకుంటారు.
వీటి సంరక్షణా కృషి రికార్డులలో పెరుగుతున్నదని తెలుపుతున్నప్పటికి, కొద్ది సంవత్సరాల నుండి ఈపక్షుల సంఖ్య తగ్గుతూనే వుంది.

 బోనాల్ బర్డ్ సాన్క్చురి

బోనాల్ బర్డ్ సాన్క్చురి

బోనాల్ బర్డ్ సాన్క్చురి కర్ణాటకలో రెండవ పెద్ద బర్డ్ సాన్క్చురి. ఇవి యాదగీర్ జిల్లాలోని శోరాపూర్ తాలూకా లో కల బోనాల్ విలేజ్ సమీపం లోని అత్యధిక తేమ కల భూములు. ఇక్కడ సుమారు 21 జాతుల పక్షులు పర్పుల్ హెరాన్, వైట్ నెక్ స్తార్క్ వంటి వి వున్నట్లు రికార్డు లు చూపుతున్నాయి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+