Search
  • Follow NativePlanet
Share
» »చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది

చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది

చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మహాస్థూపం ప్రధాన గోపురం చుట్టుకొలత 120 అడుగులు ఎత్తు 30 అడుగులు

ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు సజీవంగా ఉన్నాయి. చందవరం, మోటుపల్లి, కనపర్తి... ఇలా జిల్లాలోని ఎన్నో చోట్ల బౌద్ధ స్థూపాలు బయటపడ్డాయి. జిల్లాలోని జగన్నాథపురం (చందవరం) బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది.

గొప్ప బౌద్ధ ఆరామంగా పేరుగాంచిన గ్రామం చందవరం. దొనకొండ మండలంలో ఉంది. కర్నూలు - గుంటూరు రహదారిలో త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి గ్రామానికి 2 కి.మీ.ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన ఈ బౌద్ధారామం శాతవాహనుల పాలనలో క్రీ.శ. 2వ శతాబ్ది నాటిది. ఇక్కడ తవ్వకాలలో లభించిన వస్తువులను పరిశోధించిన తర్వాత రేడియోకార్బన్ డేటింగ్' విధానంలో బౌద్ధారామం వయస్సు 2వశాతాబద్దం కాలం నాటిదని నిర్ణయించబడినది. ఇది ఆంధ్రప్రదేశ్ లో నిర్మించబడిన మొదటి బౌద్దారామంగా నమ్ముతున్నారు.

క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు

క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు

క్రీస్తు పూర్వం రెండో శతాబ్దంలో బౌద్ధ భిక్షువులు ఇక్కడ ఆరామాలు నిర్మించుకున్నారని తెలుస్తోంది. ఈ ప్రాంతం సుమారు 800 ఏళ్ల పాటు ధార్మిక కేంద్రంగా, హీనయాన బౌద్ధ క్షేత్రంగా భాసిల్లింది. 1972లో పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొని తవ్వకాలు జరిపింది.

PC: facebook.com

200 అడుగుల ఎత్తు కొండ (సింగర కొండ) మీద

200 అడుగుల ఎత్తు కొండ (సింగర కొండ) మీద

200 అడుగుల ఎత్తు కొండ (సింగర కొండ) మీద 130 అడుగుల చుట్టుకొలత, 30 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ స్థూపం, సుమారు మరో 15 పెద్ద, వందలాది చిన్న స్థూపాలు బయటపడ్డాయి. ఇవన్నీ బ్రహ్మీ వ్రాతలో ఉన్న స్థూపాలు.

PC: facebook.com

మహా స్థూపంలో మహాచైత్య 1.6మీ ఎత్తు

మహా స్థూపంలో మహాచైత్య 1.6మీ ఎత్తు

మహా స్థూపంలో మహాచైత్య 1.6మీ ఎత్తు మరియు 60సెమీ వెడల్పు ఉంటుంది. మహాస్థూపం తక్షశిల (పాకిస్తాన్)లోని ధర్మరాజికా స్థూపాన్ని పోలి ఉంటుంది. మహాస్థూపం పానెల్స్ లైమ్ స్టోన్ తో చేయబడింది. పానెల్స్ మరియు డ్రమ్ విభాగంలో ‘బుద్దుని పాద ముద్రలు' ఉన్నాయి. స్థూపాలు, బోధి చెట్టు మరియు ఇతర కథలతో పాటు జాతక కథలు చెక్కబడి ఉన్నాయి.

PC: facebook.com

బౌద్ధ స్థూపం, దాని చుట్టూ బుద్ధుని జీవిత విశేషాలు

బౌద్ధ స్థూపం, దాని చుట్టూ బుద్ధుని జీవిత విశేషాలు

బౌద్ధ స్థూపం, దాని చుట్టూ బుద్ధుని జీవిత విశేషాలు, హిందూయిజం, జైనిజం మరియు బుద్ధిజం మతసంబంధిత చిత్రించిన శిల్పాలు, అశోకచక్రం ఉన్న శిల్పం, కొన్ని వందల బౌద్ధ భిక్షువుల సమాధులు, వారు విశ్రాంతి తీసుకున్న గదులు, ధ్యాన మందిరాలు, భిక్షువులు కొండపై వినియోగించిన నీరు క్రిందకు వెళ్ళేందుకు నిర్మించిన కాలువ, కొండపై వారు వినియోగించిన రోలు లాంటివి కూడా వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పాలరాతితో తయారైనవే.
PC: facebook.com

మ్యూజియం

మ్యూజియం

ఇక్కడ వాటిలో ప్రధానమైనవి మహాస్థూపం, మాహాచైత్యం, మ్యూజియం . ఇక్కడ బౌద్దమత సంబంధిత కార్యక్రమాలు చురుకుగా సాగేవి.
PC: facebook.com

ఏడాది కిందట గుండ్లకమ్మ నదిలో

ఏడాది కిందట గుండ్లకమ్మ నదిలో

ఏడాది కిందట గుండ్లకమ్మ నదిలో ఇసుక తీస్తూండగా రెండు పాలరాతి విగ్రహాలు దొరికాయి. ఈ ప్రాంతంలో లభించిన అవశేషాలతో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇక్కడి కొండ శిఖరం మీద రెండస్థుల స్థూపం ఉంది. ఈ ప్రధాన స్థూపం సాంచీలోని బౌద్ధ స్థూపాన్ని పోలి ఉంది. రాష్ట్రంలో అతి పెద్ద బౌద్ధ స్థూపంగా దీనికి పేరుంది. ఈ స్థూపానికి నాలుగు ద్వారాలున్నాయి. ఉత్తర ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుడి పాలరాతి శిల్పం ఉంది.
PC: facebook.com

చందవరం బౌద్దారామం వారణాశి

చందవరం బౌద్దారామం వారణాశి

చందవరం బౌద్దారామం వారణాశి నుండి కంచి వెళ్ళే బౌద్ధ సన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించబడింది.
PC: facebook.com

స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన

స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన

క్రీ.శ 710లో ఆది శంకరాచార్యుడు దక్షిణ భారతయాత్ర చేసిన సందర్భంగా బౌద్ధ ధర్మం, బౌద్ధ స్థూపాలు క్షీణించినందున ఈ స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన మహాబలేశ్వరాలయ నిర్హాణంలో ఉపయోగించి ఉండవచ్చని కొందరి భావన.
PC: facebook.com

నాటి విశ్రాంతి మందిరాలు:

నాటి విశ్రాంతి మందిరాలు:

బౌద్ధస్థూపం ఉత్తరాన ఉన్న ద్వారంలో ధ్యాన నిమగ్నుడైన బుద్ధుని పాలరాతి శిల్పం ప్రతిష్టించి ఉంది. బౌద్ధుల పగోడాను తలపించే నిర్మాణపు పునాదులు కూడా ఇక్కడ లభించాయి. బౌద్ధ భిక్షులు విశ్రాంతి తీసుకునే మందిరాల పునాదులూ ఈ ప్రాంతంలో ఉన్నాయి. బౌద్ధమతం క్రమంగా క్షీణించడంతో ఇక్కడి బౌద్ధారామాలను కూలగొట్టి, అందులోని శిల్పాలు, రాళ్లు, మట్టి మొదలైనవాటిని చందవరంలోనే ఉన్న మహాబలేశ్వర ఆలయనిర్మాణానికి ఉపయోగించి ఉంటారని నిపుణుల అంచనా!
PC: facebook.com

ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే

ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే

ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతవాసులే కాకుండా సుదూర ప్రాంతాల నుండి ఈ అమూల్యమైన చందవరం బౌద్ధ స్థూపాన్ని దర్శించుకునేందుకు వస్తుంటారు.
PC: facebook.com

ఎలా వెళ్ళాలి?:

ఎలా వెళ్ళాలి?:

ఒంగోలుకు 70 కి.మీ. త్రిపురాంతకానికి 10 కి.మీ. దూరంలో ఈ బౌద్ధ క్షేత్రం ఉంది.
వాయు మార్గం
ప్రకాశం జిల్లాకు దగ్గరలో ఉన్న విమానాశ్రయం విజయవాడ లోని గన్నవరం ఏర్‌పోర్ట్. ఈ ఏర్‌పోర్ట్ దేశీయ ఏర్‌పోర్ట్ , ప్రకాశం నుంచి 150 కి. మీ. దూరంలో ఉన్నది. ఈ ఏర్‌పోర్ట్ కి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం విమానాలు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి.
రైలు మార్గం
ప్రకాశంలో రైల్వే స్టేషన్ కలదు. ఈ స్టేషన్ చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే చెన్నై నుంచి ఢిల్లీ పోవాలన్న మరియు గుంతకల్ నుంచి గుంటూరు, విజయవాడ, వైజాగ్ పోవలన్న ఈ స్టేషన్ మీద నుంచే వెళ్ళాలి.
రోడ్డు మార్గం
ఈ ప్రాంతం గుండా జాతీయ రహదారి నెం.5 వెళుతుంది. కనుక వైజాగ్, విజయవాడ, గుంటూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి రోడ్డు రవాణా సదుపాయాలు బాగానే ఉన్నాయి.
Photo Courtesy: Indian7893

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+