Search
  • Follow NativePlanet
Share
» »చెన్నై నుండి మదురై రోడ్డు ప్రయాణం

చెన్నై నుండి మదురై రోడ్డు ప్రయాణం

తమిళనాడు లో పర్యటన ఒక మధురానుభూతి. మీరు ప్రకృతి, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం , చరిత్రల ప్రియులైతే ఈ అంశాలు అన్నీ మీకు తమిళనాడు రాష్ట్ర పర్యటనలో లభిస్తాయి. తమిళనాడు రాష్ట్రం అనేక దేవాలయాలు కలిగి ఘనమైన చరిత్ర కలిగి వుంది. తమిళనాడు లోని అందమైన ప్రదేశాలను కొన్నిటిని చూస్తూ ఒక రోడ్ రోడ్ ట్రిప్ వేస్తె ఎలా వుంటుందో చూడండి. చెన్నై నుండి మదురై కు గల రోడ్డు ప్రయాణం మీకు మహాబలిపురం, పాండిచేరి, చిదంబరం, తంజావూర్ మరియు త్రిచి లను చూపుతుంది. ఈ రూట్ సుమారుగా 518 కి. మీ. ల దూరం కలదు.

చెన్నై నుండి మదురై రోడ్డు ప్రయాణం

చెన్నై లో ప్రయాణం మొదలు

చెన్నై లో ప్రయాణం మొదలు

మొదటగా ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ప్రయాణిస్తూ మహాబలిపురం చేరాలి. చెన్నై నుండి మహాబలిపురానికి సుమారుగా 52 కి. మీ. ల దూరం ఉంటుంది. ప్రయాణం మొదలు పెట్టె ముందు, మీరు చెన్నై లోని పర్యాటక ఆకర్షణ స్థలాలు చూసారా అనేది ధ్రువ పరచుకోనండి.

మహాబలిపురం చేరుట

మహాబలిపురం చేరుట

చెన్నై నుండి మహాబలిపురం రోడ్డు ప్రయాణం లో ఒక గంట సమయం పడుతుంది. మహాబలిపురం లో మీరు చూడవలసినవి సముద్ర తీర దేవాలయం మరియు క్రొకోడైల్ బ్యాంకు.

పాండిచేరి చేరుట

పాండిచేరి చేరుట

పాండిచేరి మహాబలిపురం నుండి పెద్ద దూరం ఏమీ కాదు. మీరు గతంలో ప్రయాణించిన ఈస్ట్ కోస్ట్ రోడ్ లోనే ప్రయానించండి. సుమారు 50 కి. మీ. లు దూరం గల పాండిచేరి చేరేందుకు ఒక గంట సమయం పడుతుంది. పాండిచేరి లో ప్రధానంగా మీరు చూడవలసినవి పొండి బీచ్ మరియు అరవేల్లె ప్రదేశాలు.

చిదంబరం చేరుట

చిదంబరం చేరుట

పాండిచేరి నుండి చిదంబరం సుమారు 63 కి. మీ. ల దూరం. ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ప్రయాణిస్తే సుమారు ఒక గంటన్నర పడుతుంది. చిడంబరంలోని పర్యాటక ప్రదేశాలు దర్శించండి.

తంజావూర్ చేరుట

తంజావూర్ చేరుట

చిదంబరం నుండి తంజావూర్ చేరేందుకు సుమారు రెండున్నర గంటల సమయం పడుతుంది. తంజావూర్ చేరేందుకు మీరు ఎన్ హెచ్ 227 మరియు ఎన్ హెచ్ 45 లు గుండా ప్రయాణించాలి. 110 కి. మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు, తంజావూర్ చేరతారు. తంజావూర్ అనేక ఆకర్షణీయ పెయింటింగ్ లకు, బ్రిహదీస్వర టెంపుల్ కు ప్రసిద్ధి. ఇంకనూ అనేక పర్యాటక ఆకర్షణలు కలవు.

త్రిచి చేరుట

త్రిచి చేరుట

త్రిచి పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేటికి ఈ పట్టణం తమిళనాడు రాష్ట్రం లో ఒక ప్రసిద్ధ పారిశ్రామిక పట్టణంగా గుర్తించ బడుతోంది. తంజావూర్ నుండి కోయంబత్తూర్ - నాగపట్టినం హై వే మీదుగా సుమారుగా ఒక గంట ప్రయాణంలో తంజావూర్ చేరవచ్చు.

మదురై చేరుట

మదురై చేరుట

మదురై లోని మీనాక్షి టెంపుల్, తమిళనాడు రాష్ట్రంలో ఒక గొప్ప ఆకర్షణీయ ప్రదేశం. మదుర మీనాక్షి టెంపుల్ చూడకుండా మీ రోడ్ ట్రిప్ ముగిసినట్లు కాదు. త్రిచి నుండి మదురై పట్టణానికి ఎన్ హెచ్ 45 బి మీదుగా సుమారు రెండు గంటల ప్రయాణంలో చేరవచ్చు.

మ్యాప్

మ్యాప్

మీరు చేసే రోడ్ ప్రయాణంలో మార్గాదర్సంగా ఉండేందుకు ఈ రూట్ మ్యాప్ లింక్ ఉపయోగించండి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+