Search
  • Follow NativePlanet
Share
» »తన తలను ఖండించి రాక్షసుల ఆకలి తీర్చిన ‘చండి దేవి’ని దర్శిస్తే...

తన తలను ఖండించి రాక్షసుల ఆకలి తీర్చిన ‘చండి దేవి’ని దర్శిస్తే...

హిమాచల్ ప్రదేశ్ లోని చిన్తపూర్ని అనే శక్తి పీఠం గురించిన కథనం.

భారత దేశంలోని హిమాలయాలు పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అలాంటి ఓ పుణ్యక్షేత్రం శక్తిపీఠం కూడా. ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించిన పురాణ కథనాలు వేర్వేరుగా ఉంటాయి. ఒక చోట దాక్షాయణి తల ఇక్కడ పడి పుణ్యక్షేత్రంగా మారిందని చెప్పబడింది.

అమరో చోట మాత్రం కళికా దేవి తన శిరస్సును ఖండించి రాక్షసుల దాహం తీర్చిందని చెప్పబడుతుంది. ఏది ఏమైనా పురాణ కాలం నుంచి ఈ క్షేత్రంలోని అమ్మవారు ప్రజల కోర్కెలను తీర్చుతోంది. ఇక్కడ అమ్మవారిని కూడా వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు.

సముద్ర మట్టానికి దాదాపు 3,117 అడుగుల ఎత్తులో ఉన్న ఈ క్షేత్ర సందర్శానికి విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

శక్తి పీఠాల్లో ఒకటి

శక్తి పీఠాల్లో ఒకటి

P.C: You Tube

హిమాలయాల్లోని పవిత్రమైన ఆధ్యాత్మిక ధామాల్లో చిన్తపూర్ని కూడా ఒకటి. హిందూ పురాణాల ప్రకారం భారత దేశంలోని 52 శక్తి పీఠాల్లో ఈ చిన్తపూర్ని కూడా ఉంది. పూర్వం దక్షప్రజాపతి కుమార్తే అయిన దాక్షాయణి పరమశివుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

దక్షప్రజాపతి

దక్షప్రజాపతి

P.C: You Tube

అయితే ఈ పెళ్లి దక్షప్రజాపతికి ఇష్టం ఉండదు. అందువల్లే తన ఇంట్లో జరిగే ఏ శుభ కార్యాలకు కూడా ఆయన కుమార్తే దాక్షాయణిని కాని, అల్లుడైన పరమశివుడని కాని పిలిచేవాడు కాదు.

యాగం

యాగం

P.C: You Tube

ఈ క్రమంలోనే ఓ సారి దక్షుడు ఓ గొప్ప యాగం చేయాలని భావిస్తాడు. ఈ విషయం తెలుసుకొన్న దాక్షాయణి తనకు ఆహ్వానం లేకపోయినా, భర్త వద్దంటున్నా వినకుండా పుట్టింటి పై మమకారంతో యాగం జరిగే చోటుకు వెళ్లి అవమానించబడి ఆత్మహుతి చేసుకొంటుంది.

వీరభద్రుడు

వీరభద్రుడు

P.C: You Tube

విషయం తెలుసుకొన్న పరమేశ్వరుడు రుద్రుడై పోయి తన జఠాజూటం నుంచి వీరభద్రుడిని స`ష్టించి అతని ద్వారా యాగం ధ్వంసం చేయిస్తాడు. అటు పై దాక్షాయణి పార్థీవ శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండం చేస్తుంటాడు.

సుదర్శన చక్రం

సుదర్శన చక్రం

P.C: You Tube

దీనితో స`ష్టి కార్యం ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సమస్య పరిష్కారం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయణి శరీరాన్ని 52 భాగాలుగా కత్తిరిస్తాడు. అలా కత్తిరించబడ్డ శరీర భాగాలు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పడిపోయాయి.

తల పడిన ప్రాంతమే

తల పడిన ప్రాంతమే

P.C: You Tube

ఇలా పడిన శరీర భాగాలు శక్తిపీఠాలుగా మారి ప్రజలతో పూజలు అందుకొంటున్నాయి. ఈ క్రమంలోనే దాక్షాయణి తల పడిన చిన్తపూర్ని శక్తిపీఠంగా మారి పురాణ కాలం నుంచి ప్రజలతో నీరాజనాలు అందుకొంటోంది.

చిత్త శుద్ధితో కోరుకొంటే

చిత్త శుద్ధితో కోరుకొంటే

P.C: You Tube

అంతేకాకుండా ఇక్కడి దేవతను చిన్మస్తిక దేవి పేరుతో కొలుస్తారు. ముఖ్యంగా చిత్త శుద్దితో కోరుకొన్న కోరికలన్నీ తీరుతాయని ప్రజలు నమ్ముతారు. మార్కెండేయ పురాణం ప్రకారం రాక్షసులకు కాళీ రూపమైన చండి దేవికి ఘెర యుద్ధం జరుగుతుంది.

చండి

చండి

P.C: You Tube

ఈ యుద్ధంలో చండి విజయం సాధిస్తుంది. అయితే ఈ యుద్దంలో ఆమెకు సహాయపడిన జయ, విజయ అనే ఇద్దరు రాక్షసులకు ఎంతకీ దాహం, ఆకలి తీరవు. దీంతో చండిక తన తలను తానే ఖండించుకొంటుంది.

మొండెం నుంచి పైకి చిమ్మె

మొండెం నుంచి పైకి చిమ్మె

P.C: You Tube

అటు పై మొండెం నుంచి పైకి చిమ్మె రుధిర దారువులతో జయ, విజయల ఆకలి తీర్చినట్లు చెబుతారు. ఈ ఘటన అందుకే ఇక్కడి దేవతను చిన్మస్తికా దేవి పేరుతో కొలుస్తారు. చిన్ అంటే లేనిది అని అర్థం కాగా మస్తిక అంటే తల అని అర్థం. ఈ దేవతను ఎక్కువగా అఘోరాలు పూజిస్తారు.

రుద్రుడు నలు దిక్కులు

రుద్రుడు నలు దిక్కులు

P.C: You Tube

ఈ శక్తిపీఠాన్ని రుద్ర దేవుడు నలు దిక్కులా కాపాడుతుంటాడని స్థలపురాణం చెబుతుంది. అందుకే ఈ శక్తి పీఠానికి తూర్పున కాళేశ్వర్ మహాదేవాలం, పశ్చిమాన నారాయణ్ మహాదేవ్, ఉత్తరాన మచ్ కుండ్ మహాదేవ్, దక్షిణాన శివ్ బారి ఆలయాలు ఉన్నాయి.

సంప్రదాయ వస్త్రాలు

సంప్రదాయ వస్త్రాలు

P.C: You Tube

చిన్తపూర్ని ఆలయంలోకి ప్రవేశించే ముందు ప్రతి ఒక్కరూ తల పై షాల్ కాని, టోపీ కాని ధరించాల్సి ఉంటుంది. స్త్రీలు తల పై కొంగుని తప్పక కప్పుకోవాలి. సంప్రదాయ వస్త్రాలనే ధరించాల్సి ఉంటుంది. ఆలయంలోకి తోలుతో చేసిన వస్తువులు అనుమతించరు.

పండిట్ మాయి దాస్ సంతతి వారే

పండిట్ మాయి దాస్ సంతతి వారే

P.C: You Tube

చిన్తపూర్ని మాతకు కలియా సరస్వత్ బ్రాహ్మణ వంశానికి చెందిన పండిట్ మాయి దాస్ సంతతి వారే 26 తరాలుగా పూజారులుగా ఉన్నారు. పండిట్ మాయి దాస్ కు చిన్మస్తికా దేవి కలలో కనబడి తాను చన్తపూర్నిగా కొలువై ఉన్న ప్రాంతాన్ని గురించి చెప్పినట్లు పూజారులు చెబుతారు.

సావనాష్టమి

సావనాష్టమి

P.C: You Tube

ప్రతి ఏడాది జులై-ఆగస్టు మధ్య అమ్మవారికి సావనాష్టమి పేరుతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. వీటికి దేవ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. అదే విధంగా దసరా నవరాత్రులు, కార్తిక మాసం, పౌర్ణమి రోజుల్లో కూడా ఎక్కువ మంది ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు.

సుమద్ర మట్టానికి 3,117 అడుగుల ఎత్తులో

సుమద్ర మట్టానికి 3,117 అడుగుల ఎత్తులో

P.C: You Tube

హిమాలయ పర్వత పంక్తుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానకి దాదాపు 3,117 అడుగుల ఎత్తులో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా నుంచి ఇక్కడకు కేవలం 47 కిలోమీటర్లు మాత్రమే బస్సు, రైలు సదుపాయాలు నిత్యం అందుబాటులో ఉన్నాయి.

కాలినడకన

కాలినడకన

P.C: You Tube

ఆలయానికి 1.2 కిలోమీటర్ల దూరంలో వాహనాలను నిలిపివేస్తారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. మంగళ, శుక్ర, శని, ఆదివారాల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. సాధారణంగా భక్తులు అమ్మవారికి తియ్యటి పదార్థాలను నివేదిస్తారు.

అందమైన పరిసర ప్రాంతాలు

అందమైన పరిసర ప్రాంతాలు

P.C: You Tube

ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా చాలా రమణీయంగా ఉంటాయి. బియాస్ నది, స్వాన్ నది అందాలను కూడా ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా చిన్నపాటి ట్రెక్కింగ్ కు కూడా అనువైన ప్రాంతం. అందువల్ల ఇటీవల యువత కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+