Search
  • Follow NativePlanet
Share
» »Chittorgarh Fort: రాజ‌స్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ కోట ప్ర‌త్యేక‌త‌లు..

Chittorgarh Fort: రాజ‌స్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ కోట ప్ర‌త్యేక‌త‌లు..

భారతదేశంలో ఉన్న చారిత్రక వారసత్వం గురించి చెప్పుకున్న‌ట్లయితే రాజ‌స్థాన్ పేరు ముందుగా గుర్తుకొస్తుంది. సంప్రదాయాలు మరియు సంస్కృతికి ప్రసిద్ధి చెందిన ఈ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన పర్యాటక కేంద్రంగా నిలిచింది. ఇక్కడికి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప‌ర్యాట‌కులు త‌ర‌లి వస్తుంటారు. రాజస్థాన్‌లో ఇటువంటి అనేక కోటలు ఉన్నాయి. ఇవి వాటి అందం మరియు చరిత్రకు ఎంత‌గానో ప్రసిద్ధి చెందాయి. చిత్తోర్‌ఘర్ కోట ఇక్కడ ఉన్న అటువంటి కోటల‌లో ఒక‌టిగా పేరుకెక్కింది.

ఇది ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ కోట ఇప్పటికీ దాని వారసత్వం, సంస్కృతిని కాపాడుతుంది. దీనిని భారతదేశంలోని అతిపెద్ద కోట అని కూడా పిలుస్తుంటారు. ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. ఈ కోట చరిత్ర గురించి కూడా తెలుసుకునేందుకు ప్ర‌జ‌లు ప్ర‌తిఏటా త‌ర‌లి వ‌స్తుంటారు. ఈ కోట ప్రత్యేకతలను తెలుసుకుందాం..

chittorgarhfort1

చిత్తోర్‌ఘర్ కోట చరిత్ర

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో ఉన్న ఈ కోటకు ఏడు తలుపులు ఉన్నాయి. ఈ త‌లుపుల సహాయంతో కోట లోపలికి ప్రవేశించవచ్చు. చిత్తోర్‌ఘర్ కోట 7వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ప్రధాన శక్తి కేంద్రంగా ఉంది. ఏడవ శతాబ్దంలో మౌర్య వంశ రాజు చిత్రాంగద మౌర్య ఈ కోటను నిర్మించాడని ఇక్క‌డివారు చెబుతుంటారు. అంతేకాకుండా, దీనిని మహాభారత కాలంలో పాండవులు నిర్మించారని కూడా చాలా మంది విశ్వ‌సిస్తుంటారు. అయితే దీనికి సంబంధించి కచ్చితమైన సమాచారం లేదు.

భారతదేశపు అతి పెద్ద కోట..చిత్తోర‌గ‌డ్‌...

ఈ కోట రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో భిల్వారాకు దక్షిణాన కొన్ని కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద కోటగా పరిగణించబడుతుంది. ఈ కోటలో ఉన్న ప్రవేశ ద్వారాలు, బురుజులు, రాజభవనాలు, దేవాలయాలు మరియు రిజర్వాయర్‌లు దీని అందాన్ని మ‌రింత పెంచుతాయి. దాని అందం మరియు గొప్ప చరిత్ర కారణంగా, ఈ కోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా నిలిచింది. చిత్తోర్‌లోని ఈ కోట జూన్ 21, 2013 న యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది.

chittorgarhfort

ఈ కోట అనేక విధాలుగా ఎంతో ప్రత్యేకమైనది. ఈ కోట దాని గొప్ప చరిత్రతో పాటు, మొదటి జౌహర్ సాక్షిగా కూడా నిలిచింది. రావల్ రతన్ సింగ్ పాలనలో అల్లావుద్దీన్ ఖిల్జీ దాడి సమయంలో, రాణి పద్మిని 1303లో తన 16 వేల మంది పరిచారికలతో కలిసి ఇక్కడ మొదటి జౌహర్‌ను నిర్వహించింది. అదే సమయంలో, క్రీ.శ. 1534లో రాణా విక్రమాదిత్య పాలనా కాలంలో, గుజరాత్ పాలకుడు బహదూర్ షా దాడి సమయంలో, రాణి కర్ణవతి తన 13 వేల మంది పరిచారికలతో రెండవ జౌహర్ చేసింద‌ని చెబుతుంటారు. అయితే మూడవ జౌహర్ పట్టా సిసోడియా భార్య ఫూల్ కన్వర్ నాయకత్వంలో 1568లో రాణా ఉదయ్ సింగ్ పాలనలో అక్బర్ దాడి సమయంలో జరిగింది.

ఈ కోట ప్రత్యేక‌త‌లు...

ఈ కోటలో 122 అడుగుల (సుమారు తొమ్మిది అంతస్తుల) స్తంభం 47 అడుగుల చదరపు పునాది మరియు 10 అడుగుల ఎత్తులో నిర్మించబడిన విజయ్ స్తంభం కూడా ఉంది. ఇది ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇది మహారాజా కుంభచే నిర్మించబడింది. దీని నిర్మాణ పనులు 1440 ADలో ప్రారంభమై 1448లో పూర్తయ్యాయి. ఈ కోటలో రిజర్వాయర్ మధ్యలో పద్మిని మహల్ కూడా ఉంటుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ అద్దంలో రాణి ప్రతిబింబాన్ని చూసినప్పుడు, ఆమె ఈ ప్యాలెస్‌లో ఉందని నమ్ముతారు. కోటలో రాణా కుంభ రాజభవనం కూడా ఉంది. ఈ ప్యాలెస్‌లో రాణి పద్మిని జౌహర్‌కు పాల్పడ్డారని ఇక్క‌డివారి విశ్వాసం.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+