Search
  • Follow NativePlanet
Share
» »రా..ర‌మ్మంటూ ఆహ్వానిస్తోన్న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌..

రా..ర‌మ్మంటూ ఆహ్వానిస్తోన్న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌..

రా..ర‌మ్మంటూ ఆహ్వానిస్తోన్న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌..

రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌... తెలంగాణ‌లోని హైద‌రాబాద్ బొల్లారంలో ఉన్న ఒక చారిత్ర‌క నిర్మాణం. ఇందులో అడుగుపెట్టాల‌ని చాలామంది కోరుకుంటారు. కానీ, అత్యాధునిక భ‌ద్ర‌త మ‌ధ్య ఇటువైపు తొంగిచూసేందుకూ కూడా వీలుండ‌దు. అలాంటిది రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను వీక్షించేందుకు అధికారికంగా అవ‌కాశం దొరికితే ఎవ‌రైనా వ‌దులుకుంటారా? ఇప్పుడు అలాంటి అవ‌కాశ‌మే క‌ల్పించారు అధికారులు. దీంతో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ప్ర‌త్యేక‌తేలేంటీ? రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వెనకు ఉన్న చారిత్ర‌క నేప‌థ్యం ఏంటీ అని తెలుసుకునేందుకు ప్ర‌జ‌లు ఊవిళ్లూరుతున్నారు. మ‌రెందుకు ఆల‌స్యం ఆ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ విశేషాలెంటో మ‌న‌ము తెలుసుకుందామా!

హైద‌రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను చూడాల‌నుకునేవారికి ప్ర‌భుత్వం మంచి అవ‌కాశం క‌ల్పించింది. ఇక నుంచి ఏడాది పొడ‌వునా సంద‌ర్శించేలా తెలంగాణ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమ‌వారం, ప్ర‌భుత్వ సెలవుదినాలు మిన‌హా మిగిలిన అన్ని రోజుల్లో రాష్ట్ర‌ప‌తి నిల‌యాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చ‌ని తెలిపింది. ఈ ఉగాది ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోకి వెళ్లే స‌దుపాయాన్ని క‌ల్పించింది. సాధార‌ణ ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న‌ను ఉగాదిరోజున‌.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ప్రాంగ‌ణంలోని మెట్ల‌బావి, జైహింద్ ర్యాంపు పున‌రుద్ధ‌ర‌ణ‌కు చారిత్ర‌క ఫ్లాగ్ పోస్ట్ ప్ర‌తి రూపానికి వ‌ర్చువ‌ల్ విధానంలోనే రాష్ట్ర‌ప‌తి శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

rashtrapatibhavan1

చారిత్ర‌క నేప‌థ్యం...

దేశంలో అత్యున్నమైనది రాష్ట్రపతి పదవి అయితే అత్యున్నత నివాసం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌. దీనికి దీటుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఉంటుంది. దేశ పరిపాలనా ఉత్తర భారతానికే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతో దక్షిణాన దీన్ని ఏర్పాటు చేశారు. సిమ్లాలోనూ రాష్ట్రపతి భవన్‌ ఉంది. 1805లో బ్రిటీష్‌ అధికారులు బొల్లారం రాష్ట్రపతి నిలయాన్ని నిర్మించారు. అప్పట్లో వైశ్రాయ్‌ అతిథిగృహంగా దీన్ని పిలిచేవారు. 1950లో కేంద్రం ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొంది. అప్పటినుంచి రాష్ట్రపతి నిలయంగా పిలుస్తున్నారు. సిఫాయిల తిరుగుబాటు సమయంలో కోఠిలోని బ్రిటీష్‌ రెసిడెంట్‌పై దాడి జరగడంతో రెసిడెంట్‌ నివాసాన్ని బొల్లారానికి మార్చారు. ఆ త‌ర్వాత బ్రిటీష్‌ రెసిడెంట్‌ నివాసాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. 160 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ భవన్‌ను కేంద్రం నిజాం నుంచి రూ.60లక్షలకు కొనుగోలు చేసింది.

rashtrapatibhavan

రాష్ట్ర‌ప‌తుల సంద‌ర్శ‌న‌...

నీలం సంజీవరెడ్డి ఆరుసార్లు సందర్శించారు.

1991లో శాంతిభద్రతల సమస్యల వల్ల ఆరేళ్లపాటు రాష్ట్రపతి పర్యటన జరగలేదు.

2000లో కేఆర్‌ నారాయణన్‌ విడిది చేశారు.

2006లో అబ్దుల్‌కలాం రెండురోజులతో అతి తక్కువ కాలం విడిది చేశారు.

2007లో రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రతిభాపాటిల్‌ ఏటా శీతాకాల విడిది చేసేవారు.

అంతకుముందున్న రాష్ట్రపతులు వర్షాకాలం, శీతాకాలంలో విడిది చేసేవారు. ప్రతిభాపాటిల్‌ పర్యటన తర్వాత రాష్ట్రపతులందరూ శీతాకాల విడిదిగా దక్షిణాదికి వస్తున్నారు. విడిదిని 15 రోజుల నుంచి వారానికి పరిమితం చేశారు.

rashtrapatibhavan

ఆన్‌లైన్ బుకింగ్ అవకాశం...

ఈ భ‌వ‌న్‌ను సంద‌ర్శించేందుకు ముందుగానే మార్చి 14 నుంచి ఆన్‌లైన్ బుకింగ్ అవ‌కాశం క‌ల్పించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవ‌చ్చు. అక్క‌డికి వెళ్లి నేరుగా కూడా టికెట్లు తీసుకోవ‌చ్చు. భార‌తీయుల‌కు రిజిస్ట్రేష‌న్ రుసుము రూ. 50, విదేశీయుల‌కు రూ.250 లుగా నిర్ధారించారు. సంద‌ర్శ‌కుల కోసం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఉచితంగా పార్కింగ్‌, వ‌స్తువుల‌ను భ‌ద్ర‌ప‌రుచుకునేందుకు ప్ర‌త్యేక‌గ‌ది, వీల్ ఛైర్ స‌దుపాయం, మంచినీరు, ప్రాథ‌మిక చికిత్స స‌హా ఇత‌ర వ‌స‌తుల‌ను ఏర్పాటు చేశారు. ఈ చారిత్ర‌క భ‌వ‌నంలో ఆధునీక‌రించిన ఆర్ట్‌గ్యాల‌రీ, భూగ‌ర్భ‌సొరంగ మార్గం, రాక్‌గార్డ‌న్‌, హెర్బ‌న్ గార్డన్‌, బ‌ట్ట‌ర్ ప్లై గార్డ‌న్‌, న‌క్ష‌త్ర గార్డెన్‌, జైహింద్ ర్యాంపు, ఫ్లాగ్‌ఫోస్ట్ త‌దిత‌రాల‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+