Search
  • Follow NativePlanet
Share
» »ఒక్క రోజులో ఆరు గణపతి దేవాలయాల సందర్శన!

ఒక్క రోజులో ఆరు గణపతి దేవాలయాల సందర్శన!

హిందువులు సాధారణంగా ఏ పని మొదలు పెట్టాలన్నా గణపతి లేదా వినాయకుడిని పూజిస్తారు. గణేశుడు ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాడని, విజయవంతం చేస్తాడని అపార నమ్మకం. ఇండియాలో ఖ్యాతి గాంచిన గణేశ టెంపుల్స్ వివిధ ప్రదేశాలలో కలవు. కేరళ లోని కాసర్గోడ్ నుండి కర్నాటక లోని గోకర్ణ వరకు గల కోస్తా తీరం ఎంతో సుందరమైనది. అనేక అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడుకొని వున్నది. ఈ ప్రాంత ప్రకృతి అందాల సందర్శనలే కాక ఇక్కడ మీరు అనేక గణేశ టెంపుల్స్ కూడా చూడవచ్చు. మనం చూడాలనుకున్న 6 గణేశ టెంపుల్స్ లో....

.

మొదటిది మధుర మహా గణపతి టెంపుల్. ఇది కేరళ లోని కాసర్గోడ్ సిటీ కి 8 కి. మీ ల దూరంలో కలదు. మొదటి వినాయకుడి దర్శనం కనుక ముందు రాత్రి కాసర్గోడ్ లోని ఒక హోటల్ లో దిగాలి. మీరు కారు లో 6 గణేశ టెంపుల్స్ ఒక్క రోజులో చుట్టి రావాలంటే దర్శన సమయం కూడా కలిపి కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుంది. కాసర్గోడ్ గణేశ టెంపుల్ లో ఉదయస్తమాన పూజ నిర్వహించి ఆ దేముడికి ఇష్టమైన అప్పాలు నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడ నుండి ....

రెండవ గణపతి టెంపుల్ దర్శనం కొరకు మీరు ఈదపల్లీ - పాన్వెల్ హై వే మీదుగా మంగళూరు కు ప్రయాణించవచ్చు. మంగళూరులో గల శరవు మహా గణపతి టెంపుల్ ఇక్కడ నుండి సుమారు ఒక గంట లోపే చేరుకోవచ్చు. టెంపుల్ తేలికగానే కనుగొనవచ్చు. ఈ టెంపుల్ లోనే శ్రీ శరభేశ్వర మరియు శ్రీ నగబ్రహ్మ దేముళ్ళు కూడా చూడవచ్చు. ఈ టెంపుల్ సుమారు 800 సంవత్సరాల నాటిది, మంగళూరు ప్రధాన ఆకర్షనలలో ఒకటి. ఇక్కడ నుండి....

మూడవ గణపతి టెంపుల్ సుమారు 80 కి. మీ. ల దూరంలో కుమ్బాషి లో కలదు . దీనిని మహాగణపతి టెంపుల్ కలదు లేదా ‘ఆనేగుడ్డ శ్రీ వినాయక టెంపుల్ ‘ అని కూడా అంటారు.
ఈ టెంపుల్ లోని వినాయకుడి దర్శనం తర్వాత ....

నాలుగవది గా హత్తిన గాడి లోని సిద్ది వినాయక టెంపుల్ చూడవచ్చు. సిద్ది వినాయక టెంపుల్ సుమారు 8 వ శతాబ్దం నాటిది. హత్తినగాడి గ్రామం ఒక చిన్న గ్రామం, ఇది కర్నాటక లోని ఉడుపి జిల్లా లో కుందాపుర తాలుక లో కలదు. ఇక్కడికి మీరు సుమారు ఇరవై నిమిషాలలో చేరవచ్చు. ఇక్కడి పూజా పద్ధతి చాలా సింపుల్ గాను మంచి పద్ధతి గాను వుంటుంది. ఈ టెంపుల్ ను అనేక మార్లు పునరుద్ధరించారు. ఈ ప్రాంతంలో ఇది ప్రసిద్ధి చెందిన టెంపుల్. సుమారు రెండున్నర అడుగుల విగ్రహం సాలిగ్రామ రాతితో చెక్కారు. ఇక్కడ నుండి

అయిదవ గణపతి టెంపుల్ దర్శనం కొరకు మనం ఇక ఇడుగుంజి గణపతి టెంపుల్ చేరాలి. ఇది హత్తినగాడి కి 45 కి. మీ. ల దూరంలో వుంటుంది. ఉడిపి జిల్లాలో ఇడుగుంజి గణపతి టెంపుల్ ప్రసిద్ధి చెందినది. ఈ టెంపుల్ సుమారు 1500 వందల సంవత్సరాల నాటిది గా చెపుతారు. రెండు చేతులు కల ఈ గణపతి ఒక చేతిలో లడ్డు, మరో చేతిలో ఒక కమలం పట్టుకొని దర్శనమిస్తాడు. ఇప్పటి వరకూ మీరు సరిగా ప్రయాణిస్తే, ఈ టెంపుల్ చేరే సరికి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. ఈ టెంపుల్ లో ఉచిత భోజనం పెడతారు. ఈ ప్రసాదం తిన్న వెంటనే, మీరు గోకర్ణ కు ప్రయానించండి.

ఆరవ గణపతి దర్శనం కొరకు ఇదుగుంజి నుండి గోకర్ణ ప్రయాణించాలి. ఇది 65 కి. మీ. ల దూరం. రోడ్డు నేరుగా వుండి ఇరువైపులా చిన్న చిన్న టీ దుకాణాల తో వుంటుంది. గోకర్ణ లోని టెంపుల్ లోని వినాయక విగ్రహం కొంచెం అటూ ఇటూ గా ఇదుగుంజి టెంపుల్ లోని విగ్రహం లానే వుంటుంది. ఈ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్ చేరే ముందే వస్తుంది. ఈ గణేశ టెంపుల్ దర్శనంతో మీరు చూడాలనుకున్న ఆరు గణేశ టెంపుల్స్ దర్శన ప్రయాణం పూర్తి అయినట్లే.

దిగువ ఇవ్వబడిన రూట్ మ్యాప్ దగ్గర పెట్టుకొని చూస్తూ పోతే మీకు మరింత సౌకర్యం. ఆరు గణపతుల దర్శనాలతో పాటుగా అందమైన కోస్తా తీర ప్రయాణ అనుభూతులు కూడా తేలికగా పొందవచ్చు.

ఒక్క రోజులో ఆరు గణపతి దేవాలయాల సందర్శన!

More News

    Read more about: ganesha temple karnataka
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+