ఆగస్టు 15 సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ సమరంలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశాల్లో ముఖ్యమైనది అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్.. ఈ పేరు వినగానే చాలామంది ఒళ్లుజలదరిస్తుంది. ఎందుకంటే ఎంతో మంది అమరవీరులు అసువులు బాసిన ప్రాంతమిది. పంజాబ్‌లోని ఈ స్మారకస్థలం ప్రపంచదేశాల స్వాతంత్య్ర చరిత్రలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నది.
12 వేల మంది ఉద్యమకారులు ..
అది 1919 ఏప్రిల్ 13వ తేది జలియన్ వాలా బాగ్‌లో పన్నెండు వేల మంది ఉద్యమకారులు రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారనే నేపంతో అప్పటి బ్రిటిష్ జనరల్ డయ్యర్ సారథ్యంలో వారిపై కాల్పులు చేశారు. ఆ ఉద్యమకారులు బయటకు వెళ్లే దారిని మూసేసి మరీ కాల్పులు చేపట్టారు. ఆ కాల్పుల బారి నుంచి తప్పించుకొనే మార్గం లేక పక్కనే ఉన్న బావిలోకి దూకేసి చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
ఆ అమానుష కాల్పుల్లో 379 మంది అధికారికంగా చనిపోతే, అంతకు మూడురెట్లు గాయపడినవారున్నారు. ఆ సమయంలో గాంధీజీ వంటి జాతీయ నేతలు మరికొందరు విరాళాలు సేకరించి ఆ ప్రాంతాన్ని స్మారకోద్యానంగా మార్పులు చేశారు. ఈ స్మారకోద్యానం గురించి పలు విషయాలు తెలుసుకుందాం..

పలు మార్పులు..
ఈ స్మారకోద్యానవనం 26,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో అనేక మార్పులు చశారు. ఇది స్వాతంత్యోద్యమ అనంతరం జాతీయ స్మారక చిహ్నంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ప్రదేశంలోని గోడలు ఇప్పటికి బుల్లెట్ రంధ్రాలతో మార్క్ చేయబడి ఉండడం మనం చూడొచ్చు. ఇక్కడి స్మారక ఫలకాలు టూరిస్టులకు ఇక్కడ జరిగిన ఊచకోత సంఘటన గురించి క్లుప్తంగా వివరించేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇక్కడ అందమైన కుడ్యశిల్పాలు, త్రీడీ ప్రొజెక్షన్లు, లేజర్ అండ్ సౌండ్ షోలను కూడా నిర్మించారు.. .

ఉధమ్ సింగ్ విగ్రహం..
ఈ స్మారకోద్యానవనం ప్రవేశ ద్వారం బయట తెల్లటి పాలరాయితో చేసిన శిల్పం కూడా ఉంటుంది. దీనికి వేరువేరు ముఖాలు అమర్చబడ్డాయి. ఈ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన "అమరవీరుల" పేర్లు బంగారంతో లిఖించడబడి ఉంటాయి. అంతేకాదు, వీటితోపాటు ఇక్కడ ఊచకోతకు గురయిన ఉధమ్ సింగ్ విగ్రహం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
అమరవీరులు బావి..
ఇక్కడ పేరుగాంచిన మరొక ప్రదేశం అమరవీరుల బావి. అ ఆ అమానుమైన కాల్పుల నుండి తప్పించుకునే క్రమంలో చాలా మంది ఉద్యమకారులు దూకిన బావి ఇది. ఈ బావినే అమరవీరుల బావి అని పిలుస్తారు. బావి సంరక్షణార్ధం చుట్టూ ఆలయం వంటి నిర్మాణం కూడా ఉంటుంది. జలియన్ వాలా బాగ్ ప్రతి రోజు ఉదయం 6:30 నుండి రాత్రి 7:30 వరకు పర్యాటకులకు అందుబాటులోనే ఉంటుంది. జలియన్‌వాలా బాగ్‌కు ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదు. ఏడాది పొడవునా ఈ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం టూరిస్టులకు లభిస్తుంది. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే రైలు, విమాన మార్గం లేదా రైలు మార్గం, రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications












