Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌యాణించే స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్ వివ‌రాలివే..!

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌యాణించే స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ట్రైన్స్ వివ‌రాలివే..!

మ‌రికొద్ది రోజుల్లో విద్యార్థుల‌కు, ఉపాధ్యాయుల‌కు, ఇత‌ర ఉద్యోగుల‌కు వేస‌వి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక‌, వేస‌వి సెల‌వుల్లో చాలామంది వాళ్ల సొంత గ్రామాల‌కు, అమ్మ‌మ్మ‌, తాత‌ల ఊళ్ల‌కు బ‌య‌లుదేరేందుకు సిద్ధ‌మ‌వుతుంటారు. అలాంటి వారికోసం రైల్వేశాఖ ఓ తీపిక‌బురును అందించింది. సూదూర ప్రాంతాల‌కు ప్ర‌యాణించాల‌నుకునేవారు ఎక్కువ‌మంది రైలు మార్గాల‌నే ఎంపిక చేసుకుంటారు. ఇక సెల‌వుల్లో అయితే చాలామంది ట్రైన్ మార్గాల‌నే ఎంచుకుంటుంటారు. ఈ స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో రైళ్ల‌లో ర‌ద్దీనీ దృష్టిలో ఉంచుకుని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే 104 ప్రత్యేక రైళ్లను న‌డిపేందుకు సిద్ధ‌మ‌య్యింది.

ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వేశాఖ‌ ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. రైల్వేశాఖ ఇచ్చిన పూర్తి వివ‌రాల మేర‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వేస‌విలో స్పెష‌ల్ ట్రైన్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. ప్ర‌తి సోమ‌వారం నాడు 07030 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ సికింద్రాబాద్ నుంచి అగ‌ర్తాల‌కు జూన్ 24వ‌తేదివ‌ర‌కు న‌డుస్తోంది. ఏప్రిల్ 5వ తేదీ నుంచి 07029 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శుక్ర‌వారం నాడు అగ‌ర్తాల నుంచి సికింద్రాబాద్‌కు జూన్ 28 వ తేదీ వ‌ర‌కు ప్ర‌యాణికుల కోసం సిద్ధంగా ఉంటుంది.

summerspecialtrains

ఇక‌, ఏప్రిల్ 1వ తేదీ నుంచి మే 13వ తేదీవ‌ర‌కు 07046 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి సోమవారం సికింద్రాబాద్ నుంచి దిబ్రూగ‌డ్‌కు న‌డుస్తోంది. ఏప్రిల్ 4,2024 నుంచి మే 16వ తేదీ వ‌ర‌కు 07047 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి గురువారం దిబ్రూగ‌డ్ నుంచి సికింద్రాబాద్‌కు ప్ర‌యాణిస్తుంది.

ర‌తి ఆదివారం గోరఖ్‌పూర్ నుంచి హైద‌రాబాద్‌కు..

ఏప్రిల్ 7, 2024 నుంచి జూన్ 30 వ‌ర‌కు 07637 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి ఆదివారం నాడు తిరుప‌తి నుంచి సాయిన‌గ‌ర్ షిరిడీకి ప్ర‌యాణిస్తోంది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి జూలై 1వ తేదీవ‌ర‌కు 07638 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి సోమ‌వారం సాయిన‌గ‌ర్ షిరిడీ నుంచి తిరుప‌తికి బ‌య‌లుదేరుతోంది. ఏప్రిల్ 5 వ తేదీ నుంచి జూన్ 28 వ‌ర‌కు 02575 నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి గోర‌ఖ్‌పూర్‌కు బ‌య‌లుదేరుతోంది.

ఏప్రిల్ 7వ తేదీ నుంచి జూన్ 30 వ తేది వ‌ర‌కు 02576 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి ఆదివారం గోరఖ్‌పూర్ నుంచి హైద‌రాబాద్‌కు ప్ర‌యాణిస్తుంది. ఏప్రిల్ 3వ తేది నుంచి జూన్ 26 వ తేది వ‌ర‌కు 07007 అనే నెంబ‌ర్‌గల ట్రైన్ ప్ర‌తి బుధ‌వారం సికింద్రాబాద్ నుంచి ర‌క్సౌల్‌కు బ‌యలుదేరుతోంది. ఏప్రిల్ 5 వ‌తేది నుంచి జూన్ 28 వ తేది వ‌ర‌కు 07008 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శుక్ర‌వారం ర‌క్సౌల్ నుంచి సికింద్రాబాద్‌కు ప్ర‌యాణిస్తుంది. ఏప్రిల్ ఆర‌వ తేదినుంచి జూన్ 29 వ తేది వ‌ర‌కు 07051 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శ‌నివారం హైద‌రాబాద్ నుంచి ర‌క్సౌల్‌కు బ‌య‌లుదేరుతోంది.

summerspecialtrains in telugu states

జూన్ నెల చివ‌రి వ‌ర‌కూ..

ఏప్రిల్ 9వ తేదినుంచి జూలై 2వ తేదివ‌ర‌కు 07052 అనే నెంబ‌ర్‌గల ట్రైన్ ప్ర‌తి మంగ‌ళ‌వారం ర‌క్సౌల్ నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరుతోంది. ఏప్రిల్ 6 వ తేదినుంచి జూన్ 29 వ‌తేది వ‌ర‌కు 07419 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శ‌నివారం సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌కు ప్ర‌యాణిస్తుంది. ఏప్రిల్ 8వ తేదినుంచి జూలై 1వ తేదివ‌ర‌కు 07420 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి సోమ‌వారం దానాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు బ‌య‌లుదేరుతోంది.

ఏప్రిల్ 5వ తేది నుంచి జూన్ 28 వ తేది వ‌ర‌కు 07115 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి జైపూర్‌కు ప్ర‌యాణిస్తోంది. ఏప్రిల్ 7వ తేదినుంచి జూన్ 30 వ‌ర‌కు 07116 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి ఆదివారం జైపూర్ నుంచి హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరుతోంది. ఏప్రిల్ 5వ తేదినుంచి జూన్ 28వ‌ర‌కు 01438 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి శుక్ర‌వారం తిరుప‌తి నుంచి షోలాపూర్ వ‌రకు బ‌య‌లుదేరుతోంది. ఏప్రిల్ 4వ తేదినుంచి జూన్ 27వ తేదివ‌ర‌కు 01437 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ప్ర‌తి గురువారం షోలాపూర్ నుంచి తిరుప‌తికి ప్ర‌యాణిస్తోంది.

More News

    Read more about: andhra pradesh telangana
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+