తుమకూరు ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. అక్కడ దేవరాయణ దుర్గ మరింత ఆకర్షిస్తుంది. ఇది ఒక చిన్న గుట్ట. ఈ గుట్ట పైనే నరసింహస్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం...

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
దేవరాయణ దుర్గ పై భాగంలో ఉన్న నరసింహస్వామి దేవాలయాన్ని ద్రవిడియన్ శైలిలో నిర్మించారు. తూర్పుముఖంగా దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం సుమారు 400 అడుగుల ఎత్తులో ఉంటుంది.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
ఈ దేవాలయం తూర్పు దిశలో ఒక తీర్థం ఉంటుంది. దేవాలయంలోకి వెళ్లడానికి ముందు ఈ తీర్థంలో భక్తులు తమ చేతులు, కాళ్లు కడుక్కొంటారు. ఈ తీర్థం పక్కనే శ్రీ పాదతీర్థం అనే మరో పవిత్ర ప్రాంతం ఉంది.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
కింది నుంచి పైకి వెళ్లడానికి మెట్లు ఉన్నాయి. ఇక్కడ కోతులు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందువల్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ చేతిలో ఉన్న వస్తువులన్నీ ఆ కోతులు తీసుకొని వెళ్లిపోతాయి.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
ఈ గుట్ట పై ఈ కోట కూడా ఉంది. ఈ కోట చూడటానికి చాలా అంంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఇ కోట పై భాగంలో చాలా చల్లగా ఉంటుంది. వీకెండ్ సమయంలో ఇక్కడకు ఎక్కువ మంది వస్తుంటారు.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
కింది నుంచి పైకి వెళ్లడానికి ఒక మార్గం కూడా ఉంది. ఈ మార్గం ద్వారా దేవాలయాన్ని చేరుకోవడానికి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఒక్కసారి పైకి చేరుకొన్నాక 360 డిగ్రీల కోణంలో చుట్టూ ఉన్న అందాలను చూడవచ్చు.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఈ దేవాలయాన్ని చూడటానికి చాలా మంది వస్తుంటారు. చుట్టూ ఉన్న ప్రాంతాలు అందంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
ఈ దేవాలయానికి దగ్గర్లో అంటే నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో అనేక లాడ్జ్‌లు ఉన్నాయి. బడ్జెట్ హోటల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక ఈ దేవాలయం ప్రతి రోజూ ఉదయం 10 గంటలు, సాయంత్రం 5 గంటల వరకూ తెరిచే ఉంటుంది.

నరసింహ స్వామి దేవాలయం
P.C: You Tube
అదే విధంగా ప్రతి రోజూ 11 గంటలకు ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. పిల్లలు లేని వారు ఈ అభిషేకంలో పాల్గొంటే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఈ సమయానికి పదుల సంఖ్యలో దంపతులు ఇక్కడకు చేరుకొంటారు.



Click it and Unblock the Notifications













