Search
  • Follow NativePlanet
Share
» » భక్తులను అలరించే ధర్మస్థల దీపోత్సవం !

భక్తులను అలరించే ధర్మస్థల దీపోత్సవం !

నవంబర్ నెల వచ్చిందంటే చాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలు పండుగలు, ఉత్సవాలు జరిపేందుకు రెడీ అయిపోతాయి. ఈ పండుగలలో దీపావళి ఒక ప్రధాన పండుగ. భారత దేశ పండుగలలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సాధారణంగా ఈ పండుగ దక్షిణ దేశ ప్రాంతాలలో మూడు నుండి అయిదు రోజుల పాటు జరుపుతారు. దక్షిణ కన్నడ జిల్లా లోని ధర్మస్థలలో ఈ పండుగ కన్నుల పండువ గా చేస్తారు.

ధర్మస్థల శ్రీ క్షేత్ర దేవాలయంలో లక్ష దీపోత్సవం నిర్వహిస్తారు. దీనిని ధర్మస్థల దీపోత్సవం అని కూడా అంటారు. ఈ వేడుకలో 'దీపావళి' అనే పదానికి సరైన అర్ధంగా కన్నులు మిరుమిట్లు గొలిపే దీపాల వరుసలను ప్రదర్శిస్తారు. అన్ని పండుగల వలెనె, దీపావళి కి కూడా ఒక పురాణ కధ వుంది.

 భక్తులను అలరించే ధర్మస్థల దీపోత్సవం !

ఈ దీపావళి పండుగ రోజును శ్రీకృష్ణుడు రాక్షసుడైన నరకాసురుడిని వధించిన సందర్భంగా ఆనందోత్సవాలతో జరుపు కుంటారు. అతిశయించిన ఆనందాలతో, టపాసులు కాలుస్తారు. చెడుపై మంచి సాధించిన విజయంగా భావిస్తారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం పొందిన రోజుగా భావిస్తారు. అందుకు సూచనగా చీకటిని పారద్రోలే దీపాలను వెలిగిస్తారు.

ఈ దీపావళి సందర్భంగా, ధర్మస్థల దేవాలయంలోని టెంపుల్ కమిటీ ' లక్ష దీపోత్సవం' అనే పేరుతో ఒక ప్రత్యేక వేడుక చేస్తుంది . అజ్ఞాన అంధకారం తొలగించేందుకు లక్ష దీపాలను వెలిగిస్తారు. వివిధ ఆధ్యాత్మిక, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. మనసులను రంజింప చేస్తారు.

ధర్మ అంటే ధర్మం అని, స్థల అంటే ప్రదేశం అనే అర్ధం చెపుతారు. కనుక ధర్మస్థల ప్రదేశంలో ధర్మాన్ని ఆచరణలో పెడతారు. ఈ సమయంలో మత పర సహనాలు ప్రదర్సితమవుతాయి కూడాను. అదే దీపావళి పండుగ వేడుకల వెనుక గల సిద్ధాంతం. ఏ మతం వారైనప్పటికీ ఈ వేడుకలలో పాల్గొంటారు. ధర్మస్తలలో ఆహారం మరియు వసతి నిరంతరాయంగా అందరకూ అందించబడతాయి. ఆకలితో ఏ ఒక్కరూ ఈ ప్రదేశం నుండి వెళ్లరు. ఈ టెంపుల్ ప్రతి రోజూ వచ్చిన భక్తులన్దరకూ అన్నదానం నిర్వహిస్తుంది. సమాజానికి తన వంతు ధర్మం ఆచరిస్తోంది. స్థానికంగా కల స్వయం సహాయక కేంద్రాలను, ఉపాధి అవకాశాలను టెంపుల్ అధికారులు ప్రోత్సహిస్తారు.

దీపావళి వేడుకల సమయంలో ధర్మస్థల టెంపుల్ కు వేలాది భక్తులు వస్తారు. దీపాల వరుసలతో కళ కళ లాడి పోయే టెంపుల్ దర్శించి ఆనంద భరితులవుతారు. అయిదు రోజులపాటు, ప్రతి రోజూ ఒక లక్ష దీపాలను వెలిగించి దేముడిని ఆరాధిస్తారు.

ఇదే సమయంలో ప్రతి ఏటా జరిగే రధోత్సవం కూడా నిర్వహిస్తారు. దేవాలయంలోని శ్రీ మంజునాథ స్వామిని ఈ రధంలో వుంచి నగరంలోని పలు ప్రాంతాలలో రధాన్ని నడిపిస్తారు. కర్నాటక లోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది కళాకారులు ఈ వేడుకలకు హాజరై దేముడిని పూజిస్తూ తమ తమ కళా ప్రతిభలను చాటుకుంటారు.

ధర్మస్థలలో జరిగే దీపావళి వేడుకలు మిమ్మల్ని తప్పక ఆనంద పరుస్తాయి. కనుక ఈ వేడుకల తేదీలను మీరు గుర్తించి ధర్మస్థల దీపావళి దీపోత్సవం కు హాజరై, స్వామీ శ్రీ మంజునాధుడి అనుగ్రహం పొందండి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+