Search
  • Follow NativePlanet
Share
» »దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జ‌రుపుతార‌ని మీకు తెలుసా?!

దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జ‌రుపుతార‌ని మీకు తెలుసా?!

ఆనందాన్ని పంచే రంగుల పండుగ హోలీ. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ పండుగ కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అయితే భారతదేశంలోని వివిధ నగరాల్లో హోలీని వివిధ రకాలుగా జరుపుతార‌ని మీకు తెలుసా? హోలీ సంద‌ర్భంగా చాలా చోట్ల రంగులతో హోలీ ఆడతారు, మ‌రికొన్ని చోట్ల పూలతో హోలీ ఆడతారు. స‌ర‌దాగా ఒక‌రిపై ఒక‌రు రంగులు వెద‌జ‌ళ్లుతూ హోలీ జరుపుకొనే ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మ‌న భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో హోలీని ఎలా జరుపుకుంటారో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

లత్మార్ హోలీ

ఉత్తరప్ర‌దేశ్‌, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో హోలీని ఎంతో వైభ‌వంగా జ‌రుపుతూ ఉంటారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త ఈ కార్య‌క్ర‌మాల్లో పెద్దఎత్తున పాలుపంచుకుంటారు. హోలికా దహన్ నుండి ఇక్క‌డి ప్రజలు రంగులతో ఆడుకోవడం ప్రారంభిస్తారు. ఈ స‌మ‌యంలో బర్సానాకు చెందిన లత్మార్ హోలీ చాలా ప్రసిద్ధి చెందింది. హోలీ రోజున‌ నంద్‌గావ్‌లోని హుర్రియాలు తమ కవచాలతో బర్సానాకు వెళతారు. అదే సంద‌ర్భంగా బర్సానాలోని గోపికలు ఇక్క‌డ‌ కర్రలతో హోలీ ఆడతారు. అలాగే, దేశ రాజ‌ధాని ఢిల్లీలో హోలీ నిజ‌మైన పండుగ వాతావ‌ర‌ణాన్ని అందిస్తుంది. ఇక్కడ హోలీ వేడుకలలో ప్రజలు పెద్ద పెద్ద డీజేలు పెట్టి రోడ్ల‌పైనే డ్యాన్సులు చేస్తారు. అలాగే, వివిధ రకాల వంటకాలను ఆస్వాదిస్తారు. ఢిల్లీలోని చాలా చోట్ల హోలీ పార్టీలు కూడా జరుగుతాయి.

holi

మేదురు హోలీ

మ‌న తెలుగు రాష్ట్రాల‌లో హోలీని 'మేదురు హోలీ'గా జరుపుతారు. ఈ పండుగ స‌మ‌యంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని, ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీతం, డాన్సుల‌తో పాటు ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని సంబరాలు జ‌రుపుకొంటారు.

మహారాష్ట్రలో రంగ పంచమి

పశ్చిమ భారతదేశంలోని మహారాష్ట్రలో హోలీని 'రంగ పంచమి'గా జరుపుతారు. ఈ రోజున ప్రజలు రంగుల పొడులతో ఆడుకుంటారు.. పాటలు పాడతారు. వాయిధ్యాల‌ లయకు అనుగుణంగా స్టెప్పులు వేస్తారు. అలాగే, సాంప్రదాయ స్వీట్లతోపాటు రుచికరమైన ఆహారాలతో బిజీగా గ‌డిపేస్తారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ప్రజలు వీధుల్లో పాడటం మరియు సంగీత వాయిద్యాలను వాయించే ప్రత్యేక ఆచారాన్ని కూడా చూడ‌వ‌చ్చు.

holi celebrations in kerala

కేరళలోని మంజల్ కులీ

కొంకణి మరియు కుదుంబి కమ్యూనిటీలు ఈ పండుగను ఎంతో సంప్ర‌దాయ‌బ‌ద్దంగా నిర్వ‌హిస్తారు. కుటుంబ‌స‌మేతంగా ప్రజలు దేవాలయాలను సందర్శిస్తారు. అలాగే, జానపద పాటలను ఆల‌పిస్తారు. పండుగ‌లో నీటి రంగులను మాత్ర‌మే ఉప‌యోగిస్తారు. ఈ రంగుల ప్రత్యేకత ఏమిటంటే వీటిని పసుపుతో తయారు చేస్తారు.

ఉదయపూర్

రాజుల‌ నగరం ఉదయపూర్‌లో హోలీని ఘనంగా జరుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. సాయంత్రం స‌మ‌యంలో హోలికా దహన్ పేరుతో హోలికా యొక్క దిష్టిబొమ్మను ద‌హ‌నం చేస్తారు. ఆపై రాజ‌వంశీయులు బృందంగా ఏర్ప‌డి గుర్ర‌పు ఊరేగింపులు జ‌రుపుతారు. ఈ ఘ‌ట్టాల‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు వ‌స్తూ ఉంటారు.

bengal holi

బెంగాల్‌లో బసంత్ ఉత్సవ్ మరియు డోల్ జాత్రా

బెంగాల్‌లో వసంత ఆగమన వేడుకగా బ‌సంత్ ఉత్స‌వ్ పేరుతో హోలీని జ‌రుపుతారు. శాంతినికేతన్‌లో అద్భుతమైన ఈవెంట్ ప్లాన్ చేయ‌బుడుతుంది. అలాగే, ప్రధాన హోలీ వేడుకల్లో ఒక భాగమే డోల్ జాత్రా. రాధా కృష్ణుల విగ్రహాలను పూర్ణిమ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు సందర్భంగా ఒక‌రిపై ఒక‌రు నీరు, రంగులు చల్లి ఉత్సాహంగా గ‌డుపుతారు.

More News

    Read more about: holi 2024 holi of colors
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+