Search
  • Follow NativePlanet
Share
» »దేశంలోని ప్ర‌ఖ్యాత రైల్వేస్టేష‌న్ల గురించి మీకు తెలుసా..!

దేశంలోని ప్ర‌ఖ్యాత రైల్వేస్టేష‌న్ల గురించి మీకు తెలుసా..!

దేశంలోని ప్ర‌ఖ్యాత రైల్వేస్టేష‌న్ల గురించి మీకు తెలుసా..!

భారతదేశంలో చిన్నా, పెద్దా అన్నీ క‌లిపి దాదాపు 8000 స్టేషన్లు ఉన్నాయి. కొన్నింటికి ఆసక్తికరమైన పేర్లు, మ‌రికొన్నింటికి ఆసక్తికరమైన చరిత్ర కలిగి ఉంది. రైల్వే స్టేషన్‌లో చాలా అందమైన దృశ్యాలు చూడొచ్చు. వివిధ రకాల వ్యక్తులు, విభిన్న సౌకర్యాలు, అనేక ఆహారాలు కూడా ఇక్కడ తార‌స‌ప‌డుతుంటాయి. ఈ రోజుల్లో రైల్వే స్టేషన్ల చారిత్రక కట్టడాలపై ప్ర‌భుత్వాలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయి. దేశంలోని చాలా రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చాలనే చర్చ జరుగుతోంది. వీటిలో కొన్ని స్టేషన్లు పూర్తిగా రూపాంతరం చెందాయి. భారతదేశంలోని పురాతన స్టేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1

ఛత్రపతి శివాజీ టెర్మినస్, మహారాష్ట్ర

ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఈ భవనం 19 వ శతాబ్దంలో నిర్మించబడింది. అప్పుడు దీనిని విక్టోరియా టెర్మినస్ అని పిలిచేవారు. దీనిని విక్టోరియన్ గోతిక్ డిజైన్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ భవనంపై ఉన్న 8-నక్షత్రాల గోపురం దాని వైభవాన్ని మ‌రింత పెంచుతుంది. ఈ స్టేషన్‌ను F.W. స్టీఫెన్స్ రూపొందించారు. దీని నిర్మాణానికి సుమారుగా ప‌దేళ్లు పట్టింది. విక్టోరియా రాణి స్వర్ణోత్సవం రోజున దీన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఇది బొంబాయిలో అత్యంత ఖరీదైన భవనం. దీనిని నేడు ఛత్రపతి శివాజీ టెర్మినస్ అని పిలుస్తారు.

2

రాయపురం స్టేషన్, తమిళనాడు

రాయపురం స్టేష‌న్ దక్షిణ భారతదేశంలోని చెన్నైలోని పురాతన రైల్వే స్టేషన్. ఇది 1856లో ప్రారంభించబడింది. ఇక్కడ నుండి మొదటి రైలు 1 జూలై 1856 న వాలాజా రోడ్ వరకు నడిచింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా నేటికీ ఈ స్టేషన్ ఎలా ఉందో అలాగే ఉంది. బ్రిటీష్ వ్యాపారుల స్థావరానికి సమీపంలో ఉన్నందున ఈ స్టేషన్‌ను నిర్మించడానికి రాయపురాన్ని ఎంపిక చేశారట‌.

3

హౌరా స్టేషన్, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలోని హుగ్లీ నది ఒడ్డున ఉన్న హౌరా జంక్షన్ రైల్వే స్టేషన్ అతి పురాత‌న‌మైన‌ది. ఇక్క‌డ‌ రోమన్, బెంగాలీ నిర్మాణాల మిశ్రమాన్ని చూడొచ్చు. బోరో గడియారం ఈ స్టేషన్ ప్రధాన గుర్తింపు. 23 ప్లాట్‌ఫారమ్‌లతో కూడిన ఈ స్టేషన్ అందానికి కూడా ప్రసిద్ధి చెందింది. ఇది ఎర్ర రాళ్లతో నిర్మించబడింది. భారతదేశంలో రెండవ అతిపెద్ద, పురాతన రైల్వే స్టేషన్ ఇదే.

చార్‌బాగ్ రైల్వే స్టేషన్, ఉత్తరప్రదేశ్

వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణను చూడాలనుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్ సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే ఇది ఎరుపు, తెలుపు రంగులతో చిత్రించబడిన ఈ రైల్వే స్టేషన్ 1914లో నిర్మించబడింది. దీనిని JH హర్నిమాన్ రూపొందించారు. ఇక్క‌డ పెద్ద గోపురాలు, మినార్లతో పాటు, చెట్లు, మొక్కలు చుట్టూ అందమైన తోట కూడా ఉంది. బయటి నుంచి చూస్తే రాజపుతానా ప్యాలెస్‌కి ఏ మాత్రం తగ్గకుండా కనిపిస్తుంది ఈ స్టేష‌న్‌. విమానంలో నుంచి చూస్తే చెస్ బోర్డులా కనిపిస్తుంది. ఈ స్టేషన్ వరండా బయట నిలబడినా రైలు శబ్దం వినబడదు ఇదే ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌.

కాచిగూడ స్టేషన్, తెలంగాణ

హైదరాబాద్‌లో కాచిగూడ మూడవ అతిపెద్ద పురాత‌న రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ 116 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రైల్వే స్టేషన్ నిజాం కాలంలో నిర్మించబడింది. ముంబై వంటి నగరానికి కనెక్టివిటీని అందించేందుకు ఈ స్టేషన్‌ను మొదట నిర్మించారు. దీనిని మొదట్లో గోదావరి వ్యాలీ లైట్ రైల్వే అని పిలిచేవారు. స్టేషన్‌లోని రైల్వే మ్యూజియం కూడా ఇక్కడికి వచ్చే ప్రయాణికులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+