Search
  • Follow NativePlanet
Share
» »ఎపిఎస్ఆర్‌టిసి అందిస్తోన్నప్ర‌త్యేక ప్యాకేజీ గురించి తెలుసా?

ఎపిఎస్ఆర్‌టిసి అందిస్తోన్నప్ర‌త్యేక ప్యాకేజీ గురించి తెలుసా?

ఎపిఎస్ఆర్‌టిసి అందిస్తోన్నప్ర‌త్యేక ప్యాకేజీ గురించి తెలుసా?

వేస‌వి సెల‌వులు మొద‌ల‌య్యాయి. పిల్ల‌లతో క‌ల‌సి స‌ర‌దాగా విహార‌యాత్ర‌ల‌కు వెళ్లేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంటుంటారు చాలామంది. ఇప్పుడు ట్యూర్ ప్యాకేజీలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఎటుచూసినా కొండ‌లు, మేఘాలు మ‌న చేతికి తాకుతున్న‌ట్లుగా అనిపించేంత ద‌గ్గ‌ర‌లో ఆకాశం, భూమిలోప‌లి గుహాలు ఇలాంటి ప్ర‌కృతి అందాల‌ను చూడాల‌నుకునేవారి కోసం ఎపిఎస్ఆర్‌టిసి ఒక అద్భుత‌మైన అవ‌కాశాన్ని ఇస్తుంది.

ఎపిలోని అర‌కులోయ‌, బొర్రాగుహ‌ల‌కు ప్ర‌త్యేక టూర్ ప్యాకేజీని ఎపిఎస్ఆర్‌టిసి ప్లాన్ చేసింది. మ‌రెందుకాల‌స్యం ఈ టూర్ ప్యాకేజీ విశేషాలెంటో తెలుసుకుని మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

arakuvalley

ధ‌ర ఎక్క‌వువ‌యినా..

ప‌ర్యాట‌క ప్రేమికుల కోసం ఎపిఎస్ఆర్‌టిసి తాజాగా ఓ కొత్త టూర్ ప్యాకేజీని తీసుకువ‌చ్చింది. ఈ ప్యాకేజీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. ఎపిలోని సంద‌ర్శ‌నీయ ప్రాంతాలైన ఎన్టీఆర్ జిల్లా లంబసింగి, పాడేరు, అరకులోయ మరియు బొర్రా గుహలను చూసే అవ‌కాశం ఉంటుంది. ధ‌ర మాత్రం కాస్త ఎక్కువగానే ఉంద‌నుకోండి. అయినా, విహార‌యాత్ర‌ల‌న్న‌ప్పడు ఆ మాత్రం ఖ‌ర్చు పెట్ట‌క‌పోతే ఎలా చెప్పండి.

మ‌రి ధ‌ర విష‌యానికి వ‌స్తే ఒక్కొక్కరికి రూ.2,500. ఈ ప్రత్యేక ప్యాకేజీ మే 5న ప్రారంభమవుతుంది. ప్రతి శుక్రవారం మరియు వారాంతంలో నాలుగు రోజుల ప్రత్యేక పర్యటనకు సంబంధించిన కార్యకలాపాలు ఈ ప్ర‌త్యేక ప్యాకేజీలో ఉన్నాయి. ఈ ప్ర‌త్యేక విహార‌యాత్ర ప్యాకేజీ విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్‌బీఎస్) నుంచి మే 5న ప్రారంభ‌మ‌వుతుంది. అలాగే ఇది మే 8వ తేది ముగుస్తుంది.

అక్క‌డి అందాల‌ను ఆస్వాదిస్తూ..

ఈ ప్ర‌త్యేక విహారాయాత్ర సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు విజ‌య‌వాడ నుంచి మొద‌ల‌వుతుంది. విహారయాత్ర‌లో భాగంగా మొద‌ట‌గా తుని, నర్సీపట్నం మీదుగా ఉదయం 9 గంటలకు పీఎన్‌బీఎస్ చేరుకుంటుంది. అక్క‌డ ఉన్న సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల‌ను చూసేయొచ్చు. మ‌రుస‌టి రోజు అంటే, మే 6న ఉదయం 5 గంటలకు ఆ బస్సు లంబసింగి చేరుకుంటుంది. అలా అక్క‌డి అందాల‌ను మీ మ‌దిలో ప‌దిల‌ప‌రుచుకుని లంబ‌సింగి చేరుకుంటారు. ఏజ‌న్సీ ప్రాంత‌మైన లంబ‌సింగి నుంచి సాయంత్రం ఆరు గంట‌ల‌కు ప్రారంభ‌మై ఉద‌యం 8.30 గంట‌ల‌కు పాడేరుకు చేరుకుంటుంది.

lambasinghi

ఆ ప్రాంతంలో ఆగి, ప‌చ్చ‌ని ప్ర‌కృతి ఒడిలో కాసేపు సేద‌తిరుతూ చుట్టుప‌క్క‌లా ప్రాంతాల‌ను చూస్తూ మీ అల్ప‌హారాన్ని ముగించొచ్చు. అలా మీ మొద‌టి రోజు ప్ర‌యాణాన్నిమొద‌లుపెడుతూ లంబ‌సింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, మోదకొండమ్మ అమ్మవారి ఆలయం, చాపరాయి జలపాతాలను సందర్శించొచ్చు. అలా అక్క‌డి ప్రాంతాల‌ను చూసి మ‌ధ్యహ్నా స‌మ‌యంలో అరకులోని ఓ రిసార్ట్‌లో భోజనం కూడా చేసేయొచ్చు. భోజ‌న‌ అనంతరం తిరిగి మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాలి. అక్క‌డినుంచి అరకు పద్మాపురం గార్డెన్స్ వరకు విహారయాత్ర కొన‌సాగుతుంది. ఆ రాత్రికి అర‌కులోని మీ ప్ర‌యాణం ఆగుతుంది. రాత్రిపూట పర్యాటకులు విందు చేయ‌డంతోపాటు క్యాంప్‌ఫైర్ కూడా చేయొచ్చు.

రెండవ రోజు ప‌క్షుల కిల‌కిల‌రావాల‌తో మీ ఉద‌యం మొద‌ల‌వుతుంది. అక్క‌డి నుంచి రిసార్ట్‌లో అల్పాహారం ముగించుకున్న త‌ర్వాత‌, అర‌కులోని గిరిజ‌న మ్యూజియం మరియు కాఫీ మ్యూజియాన్ని సంద‌ర్శించ‌వ‌చ్చు. అర‌కు లోయలో న‌డిబొడ్డున ఉండే ఈ మ్యూజియాలు ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. ఇక్క‌డికి వ‌చ్చేస‌రికి కాఫీ సువాస‌న‌లు వెద‌జ‌ల్లుతాయి. మ్యూజియం ప్ర‌వేశ‌ద్వారంలో ఉన్న గోడ‌ల‌పై రంగురంగుల కుడ్య‌చిత్రాలు ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేస్తాయి.

రిసార్ట్‌లో భోజనం అనంత‌రం పర్యాటకులు విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు. డిన్నర్‌కి వచ్చే ముందు బొర్రా గుహలు మరియు కైలాస గిరిని కూడా వీక్షించొచ్చు. ఈ ప్రత్యేక టూరిస్ట్ బస్సు విశాఖపట్నం నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరి మే 8న ఉదయం 6 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విహారయాత్రల పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులు ఆన్‌లైన్‌లో RTC ఏజెంట్ నుండి టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

More News

Read more about: araku lambasinghi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+