సెప్టెంబర్‌లో విహరానికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే, ఈ సీజన్‌లో చాలామంది ట్రెక్కింగ్‌వంటి సాహాసాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కాబట్టి దేశంలో ఈ సీజన్‌లో ట్రెక్కింగ్ చేసేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. రండి ఆ ప్రదేశాలేంటో చూసేద్దాం.. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఈ ప్రదేశాలలో ట్రెక్కింగ్ చేసేయొచ్చు.
కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్
ఈ సీజన్‌లో ట్రెక్కింగ్ అనువైన ప్రదేశాలలో ప్రసిద్ధిచెందింది జమ్మూకాశ్మీర్‌లోని కాశ్మీర్ గ్రేట్ లేక్స్ ట్రెక్. ఇది భారతదేశంలోనే అత్యంత అందమైన ట్రెక్కింగ్ ప్రాంతగా పేరుగాంచింది. ఈప్రాంతాల్లో మొత్తం ఏడు రోజులు ఏడు ప్రదేశాలల్లో ట్రెక్కింగ్ అనుభూతిని పొందొచ్చు. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఆల్పైన్ సరస్సులు, కఠినమైన పర్వతాలు, పచ్చిక మైదానాలు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ప్రశాంతమైన సరస్సులు పర్యాటకులను మరింత ఆకర్షిస్తాయి. మరెందుకాలస్యం ట్రెక్కింగ్ ప్రియులు వెంటనే ఈ ప్రాంతాన్ని వీక్షించేయండి.

గోచా లా ట్రెక్
ట్రెక్కింగ్‌లో మరో అందమైన ప్రదేశం సిక్కిం రాష్ట్రంలోని గోచా లా. ఇది ట్రెక్కింగ్‌కు ఈశాన్య భారతదేశంలోని అత్యంత సుందరమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ పర్యాటకులు సందర్శించేందుకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఈ ప్రదేశం ప్రపంచంలోని మూడవ ఎత్తైన పర్వతం అయిన కాంచన్ జంగా అద్భుతమైన గొప్ప దృశ్యాలను పర్యాటకులకు అందిస్తుంది. అంతేకాదు, ఇక్కడ మరో 14 పెద్ద శిఖరాలను కూడా వీక్షించొచ్చు. ఈ ట్రెక్కింగ్‌లో పర్యాటకులు టర్కోయిస్ ఆల్పైన్ సరస్సులు, పచ్చిక మైదానాలు, రోడోడెండ్రాన్ అడవులు, సహజమైన దృశ్యాలతో పాటు మరెన్నో ప్రకృతి అందాల గుండా ప్రయాణం చేయొచ్చు. మరెందుకాలస్యం ట్రెక్కింగ్ ప్రియులు ఈ ప్రదేశాన్ని అస్సలు మిస్ కావొద్దు..
నాగ్ టిబ్బా ట్రెక్
ట్రెక్కింగ్‌కు మరో అందమైన ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని నాగ్ టిబ్బా ట్రెక్. ఇది గర్హ్వాల్ హిమాలయాలలోని నాగ్ టిబ్బా శ్రేణిలో ఉంటుంది. ఈ పర్వతం అత్యంత ఎత్తైన నాగ్ టిబ్బా ట్రెక్ స్వరఘోహిని, కాలా నాగ్, శ్రీకాంత్, గంగోత్రి, బందరుపూంచ్ వంటి మంచుతో కప్పబడి పర్యాటకులను ఆకర్షిస్తోంది. హిమాలయ శ్రేణుల అద్భుతమైన 100 డిగ్రీల వీక్షణను ఇది పర్యాటకులకు అందిస్తుంది. ఈ ట్రెక్ సందర్శకులను దట్టమైన అడవులు, క్లియరింగ్ లు, రిడ్జ్ నడకల గుండా తీసుకువెళుతుంది. వీకెండ్ ప్రయాణానికి ఈ ట్రెక్కింగ్ ఉత్తమమైన ఎంపిక అనే చెప్పాలి. మరెందుకాలస్యం మీ ట్రెక్కింగ్ జాబితాలో ఈప్రదేశాన్ని కూడా చేర్చండి.

సండక్ఫు ఫాలుట్ ట్రెక్
ఈ సీజన్‌లో ట్రెక్కింగ్ చేసేందుకు మరో అద్భుతమైన ప్రదేశం పశ్చిమ బెంగాల్‌లోని సండక్ఫు ఫాలుట్ ట్రెక్. ఈ ట్రక్కెంగ్ స్లీపింగ్ బుద్ధ, కాంచన్ జంగా, లాట్సే , మకాలుతో సహా ప్రపంచంలోని నాలుగు ఎత్తైన శిఖరాలను చూసిన అద్భుతమైన అనుభవాన్ని పర్యాటకులకు అందిస్తోంది. పచ్చని ప్రకృతి అందాల్లో ట్రెక్కింగ్ చేయొచ్చు.
రూపిన్ పాస్ ట్రెక్
ట్రెక్కింగ్‌తో పాటు అడ్వంచర్ ట్రిప్‌ను కూడా ఆస్వాదించాలనుకునేవారు తప్పకుండా హిమాచల్ ప్రదేశ్ లోని రూపిన్ పాస్ ట్రెకింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇది సుమారు 15,250 అడుగుల ఎత్తైన పర్వతం. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడమంటే ఒక అడ్వంచర్ అనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ సుమారు ఎనిమిది నుంచి పది రోజుల పాటు సాగుతుంది. ఈ ప్రయాణంలో ఇక్కడి అందమైన గ్రామాలను సందర్శించొచ్చు. జాఖా గ్రామం, సరువాస్ థాచ్ దీవులు, రూపిన్ జలపాతం వంటివి చూసేయొచ్చు.



Click it and Unblock the Notifications













