Search
  • Follow NativePlanet
Share
» »కూల్ ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఢిల్లీలోని ఈ వాట‌ర్‌పార్క్‌లు బెస్ట్‌!

కూల్ ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఢిల్లీలోని ఈ వాట‌ర్‌పార్క్‌లు బెస్ట్‌!

చాలా చోట్ల పిల్లల వేసవి సెలవులు ఇచ్చేసారు. ఈ సెల‌వుల్లో విహార‌యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుక‌నేవారు చాలామంది.. మ‌రికొంద‌రేమో చ‌ల్ల‌ని ప్రాంతాల‌కు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అయితే, పిల్ల‌ల‌తో క‌ల‌సి సరాదాగా చిల్ అవ్వాల‌నుకుంటే మాత్రం త‌ప్ప‌కుండా ఢిల్లీలోని ఈ వాట‌ర్ పార్క్‌ల‌కు వెళ్లాల్సిందే.. కాబట్టి ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. ఢిల్లీకి స‌మీపంలో ఉన్న‌వారు త‌ప్ప‌కుండా ఈ వాట‌ర్ పార్క్‌ల‌ను సంద‌ర్శించొచ్చు. ఇత‌ర ప్రాంతాల్లో ఉన్న‌వారైనా స‌రే...ఈ ప్ర‌దేశాల‌ను వీక్షించొచ్చు. వేస‌విలో మ‌రింత వినోదం పొందాలంటే మాత్రం వాట‌ర్‌పార్క్‌ల‌ను సందర్శించాల్సిందే. పిల్లలతో సరదాగా గడిపేందుకు, మండే వేడి నుండి ఉపశమనం పొందేందుకు ఇవి ఎంతో ఉత్తమమైనవి.

పిల్లలతో కలిసి ప్రయాణం చేయాలంటే చాలామందికి విసుగుగా ఉంటుంది.ఎందుకంటే వారు ఒక్క‌ద‌గ్గ‌ర ఉండ‌రు. చెప్పిన మాట విన‌రు. అందుకే, పిల్ల‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన ప్ర‌దేశాల‌కు తీసుకెళితే వారితో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. వారితో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేవిధంగా ఉండే ప్ర‌దేశాల‌కు తీసుకెళ్లాలి. అవే వాట‌ర్ పార్స్క్. ఇందులో పిల్ల‌లతో పాటు పెద్ద‌లు కూడా స‌ర‌దాగా గ‌డిపేయొచ్చు. వేసవిలో సందర్శించడానికి వాటర్ పార్కులు ఉత్తమమైన ప్రదేశాలు కాబట్టి రాబోయే వారాంతంలో ఈ వాటర్ పార్క్‌లను సందర్శించడానికి ప్లాన్ చేసేయండి. రండి.. ఢిల్లీలోని ఫేమ‌స్ వాట‌ర్ పార్క్స్ గురించి తెలుసుకుందాం.

worldsofwonderpark1

వరల్డ్స్ ఆఫ్ వండర్ పార్క్

వరల్డ్స్ ఆఫ్ వండర్ పార్క్ నోయిడాలో ఉన్న ఉత్తర భారతదేశంలోని అతి పెద్ద వాటర్ పార్క్‌. ఇక్క‌డ పిల్ల‌లు అనేక కార్య‌క‌లాపాల‌ను ఆస్వాదించొచ్చు. వర్డ్ క్లాస్ స్లైడ్, గో కార్టింగ్ ట్రాక్, రెయిన్ డ్యాన్స్, వేవ్ పూల్ వంటి అనేక కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పార్క్‌లో పిల్లలు, పెద్దలకు ప్రత్యేక జోన్లు ఉన్నాయి. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాట‌ర్‌పార్క్ ఉద‌యం 9.30 నుండి సాయంత్రం 6.30 వరకు ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ పార్క్‌లో ప్ర‌వేశించేందుకు ప్ర‌వేశ రుసుము పెద్ద‌ల‌కు రూ.1299 చెల్లించాలి. పిల్ల‌ల‌క‌యితే రూ. 799 చెల్లించాల్సి ఉంటుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ.499 చెల్లించాలి. సోమవారం నుంచి ఆదివారం వరకు టికెట్ ధర ఇలాగే ఉంటుంది.

అప్పు ఘర్ గుర్గావ్ వాటర్ పార్క్

అప్పు ఘర్ గుర్గావ్ వాటర్ పార్క్ గుర్గావ్‌లో ఉంటుంది. ఈ అప్పు ఘర్ వాటర్ పార్క్ పిల్లలతో సరదాగా గడపడానికి ఎంతో ఉత్తమమైనది. ఈ వాటర్ పార్క్‌లో ఎన్నో రైడ్‌లు క‌ల‌వు. ఇవి ఎంతో సాహసంతో కూడుకున్న‌వి. ఈ వాటర్ పార్క్‌లో బీచ్ అనుభూతిని కూడా ఆస్వాదించవచ్చు. ఈ వాట‌ర్ పార్క్ ఉదయం 11 నుండి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు ప‌ర్యాట‌కుల‌కు అందుబాటులో ఉంటుంది. ఇక‌, శ‌నివారం ఆదివారం కూడా ఉంటుంది. ఆ రెండు రోజులు ఉదయం 11 నుండి సాయంత్రం 7 వరకు తెర‌చి ఉంటుంది. ఈ వాట‌ర్‌పార్క్ ప్ర‌వేశ‌రుసుము పెద్ద‌లక‌యితే రూ. 999/- నిర్ణ‌యించారు. అదే పిల్ల‌ల‌కయితే రూ.699 చెల్లించాలి. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కయితే రూ. 999 చెల్లించాల్సి ఉంటుంది.

adventureisland1

అడ్వెంచర్ ఐలాండ్

ఢిల్లీలోని రోహిణి అడ్వెంచర్ ఐలాండ్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన వాటర్ పార్క్. ఇది 60 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ పార్క్ మెట్రో వాక్, అడ్వెంచర్ ఐలాండ్ అని రెండు భాగాలుగా విభజించబడింది. పిల్లలతో కలిసి ఇక్కడికి రావడం ద్వారా రోజంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాట‌ర్‌పార్క్ ఉదయం 10.30 నుండి సాయంత్రం 6 వరకు తెర‌చి ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రోజుల్లో పెద్ద‌ల‌కు ప్ర‌వేశ‌రుసుము రూ.500 చెల్లించాలి. పిల్ల‌ల‌క‌యితే రూ. 500 చెల్లించాలి. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ. 500 చెల్లించాలి. శనివారం నుండి ఆదివారం వరకు పెద్దలకు- రూ. 600చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు- రూ. 600/ గా నిర్ణ‌యించారు. సీనియర్ సిటిజన్లకు- రూ. 600/ చెల్లించాలి.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+