దేశంలో సాయిబాబా భక్తులు చాలామందే ఉన్నారు. వారంతా జీవితంలో ఒక్కసారైనా షిర్డీసాయిబాబా దర్శనం చేసుకోవాలని అనుకుంటుంటారు. అలాంటివారు తప్పకుండా ఈ ప్యాకేజీ గురించి ఒక్కసారైనా తెలుసుకోవాల్సిందే.. షిర్డీ సాయిబాబా దర్శనం భాగ్యం పొందాలనుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ నెలలో షిర్డీ ట్రిప్ ప్లాన్ చేసేవారికి ఐఆర్‌సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించొచ్చు. విజయవాడ నుంచి షిర్డీ ట్రిప్ ఉంటుంది. ఈ ప్యాకేజీ గురించిన పూర్తి వివరాలను ఇప్పడు చూసేద్దాం..
ఈ నెల 25న ప్యాకేజీ..
ఐఆర్‌సిటిసి దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనం కూడా కల్పిస్తుంది. ఇందులో భాగంగానే అతి తక్కువ ధరతో అక్టోబర్ నెలలో షిర్డీ సాయి బాబాను దర్శనం పొందే భాగ్యం పర్యాటకులకు కల్పిస్తోంది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అక్టోబర్ 15,2024వ తేదీన ఈ ప్యాకేజీ ప్రయాణికులకు అందుబాటులో ఉంది. ఒకవేళ ఈ తేదీ గనుకు మిస్ అయితే మరో తేదీలో టిక్కెట్లు బుక్ చేసుకుని షిర్డీ ప్రయాణానికి వెళ్లొచ్చు. ఈ టూర్‌లో భాగంగా ఈ ట్రైన్ ఒక్క విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా ప్రయాణికుల కోసం ఆగుతుంది.

టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ టూర్‌లో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. ఆ నైటంతా ట్రావెల్ చేయాలి. ఇక, మరుసటి రోజు ఉదయం 06.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి ప్రయాణం ఉంటుంది. అనంతరం ఆలయ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం షాపింగ్ కోసం కాస్త ఖాళీ సమయం లభిస్తుంది. ఆ నైటంతా షిర్డీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు సందర్శనకు వెళ్తారు.
అక్కడ్నుంచి మళ్లీ షిర్డీ ప్రయాణం ఉంటుంది. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పూర్తవుతుంది. ప్రయాణికులకు ఇతర పూర్తి సమాచారం కోసం లేదా టిక్కెట్లు బుకింగ్ కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/p సంప్రదించగలరు.

ప్యాకేజీ వివరాలివే..
కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.15900 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.10070, చెల్లించాలి. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8560 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6110 చెల్లించాలి. అదే సింగిల్ షేరింగ్ అయితే, రూ. 13450గ ఉంటుంది. డబుల్ షేరింగ్ కు రూ. 7620గా నిర్ణయించారు.



Click it and Unblock the Notifications













