Search
  • Follow NativePlanet
Share
» »షిర్డీ వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే!

షిర్డీ వెళ్లాల‌నుకుంటున్నారా..? అయితే, ఈ టూర్ ప్యాకేజీ మీకోస‌మే!

భార‌త‌దేశంలో ఆధ్యాత్మిక ప్ర‌దేశాల‌కు కొదవే లేదు. ప్ర‌తి రాష్ట్రంలోనూ ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక్కోదేవునికి ఒక్కో ప్రాంతం ప్ర‌సిద్ధిచెందింది. అలాగే దేశంలో సాయిబాబా భ‌క్తులు చాలామందే ఉన్నారు. వారంతా షిర్డీ వెళ్లాల‌ని చాలాసంద‌ర్భాల్లో అనుకుని ఉంటారు. కానీ, ఈ సెల‌వుల్లో మీరు షిర్డీ ప్లాన్ చేస్తుంటే మాత్రం..

ఈ ప్యాకేజీ గురించి ఒక్కసారి తెలుసుకోవాల్సిందే.. షిర్డీ సాయిబాబా ద‌ర్శ‌నం భాగ్యం పొందాల‌నుకునేవారికి ఐఆర్‌సిటిసి ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగా రైలు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ హైద‌రాబాద్ నుంచి మొద‌లవుతుంది. హైద‌రాబాద్ టు షిర్డీ ప్ర‌యాణం. ఈ టూర్ ప్యాకేజీ మొత్తం నాలుగురోజులు ఉంటుంది. అతిత‌క్కువ ధ‌ర‌తోనే ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ టూర్ వివ‌రాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

'సాయి శివమ్' (SAI SHIVAM) పేరుతో ప‌ర్యాట‌కుల‌కు ఈ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సిటిసి. ఈ ప్ర‌యాణంలో భాగంగా షిర్డి ద‌ర్శ‌నంతోపాటు నాసిక్‌ను కూడా సంద‌ర్శించొచ్చు. హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో ఈ ప్ర‌యాణం ఉంటుంది. మొత్తం మూడు రాత్రులు, నాలుగు రోజులతో ఈ ప్యాకేజీనీ ప్ర‌యాణికుల‌కు అందిస్తోంది. ఈ నెల 31, 2024న ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

Shirdi However this tour package is for you

టూర్ ప్యాకేజీ షెడ్యూల్..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా షిర్డీ , నాసిక్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి శివమ్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా మొద‌టిరోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఉద‌యం 06:40 గంటలకు 17064 అనే నెంబ‌ర్‌గ‌ల అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ బ‌యలుదేరుతుంది. ఆ నైటంతా ట్రైన్ జ‌ర్నీ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్క‌డినుంచి పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. అనంత‌రం హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు.

ఆ త‌ర్వాత షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. సాయి ద‌ర్శ‌నం అనంత‌రం సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను వీక్షించొచ్చు. రాత్రి స్టేయింగ్ అక్క‌డే ఉంటుంది. ఇక‌, మరుస‌టి రోజు షిరిడీలోని హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్క‌డినుండి త్రయంబకేశ్వర్, పంచవతి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. ఆ ట్రైన్ తిరిగి 09:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రింతా జ‌ర్నీ ఉంటుంది. నాలుగోరోజు ఉద‌యం 09.45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధ‌ర‌లు..

ఈ ప్యాకేజీ టికెట్ ధరల విష‌యానికొస్తే... సింగిల్ షేరింగ్ కు రూ. 9320 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్ షేరింగ్ అయితే, రూ. 7960 చెల్లించాలి. ఇక‌, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 7940 ఉంది. కంఫర్ట్ క్లాస్ లోఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.

స్టాండర్డ్ క్లాస్‌లో ధ‌ర‌లు ఒక‌సారి ప‌రిశీలిస్తే.. సింగిల్ షేరింగ్‌కు రూ. 7635 చెల్లించాలి. డబుల్ షేరింగ్ కు రూ. 6270 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌క‌యితే రూ. 6250 ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలోనే టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. ఇందులో కొన్ని నిబంధనలు కూడా వర్తిస్తాయి. ప‌ర్యాట‌కుల‌కు ఇత‌ర పూర్తి వివ‌రాల కోసం ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ను https://www.irctctourism.com/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+