Search
  • Follow NativePlanet
Share
» »ఈ వేస‌విలో ఊటీ టు మైసూర్‌ చుట్టేద్దామ‌నుకుంటున్నారా..? అయితే ఈ ట్రిప్ మీకోస‌మే..!

ఈ వేస‌విలో ఊటీ టు మైసూర్‌ చుట్టేద్దామ‌నుకుంటున్నారా..? అయితే ఈ ట్రిప్ మీకోస‌మే..!

ఈ సీజ‌న్‌లో చాలామంది హిల్‌స్టేష‌న్‌లు సంద‌ర్శించేందుకు ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక ఇండియాలోని బెస్ట్ టూరిస్ట్ హిల్ స్టేషన్స్ లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ ప్రాంతం ఊటీ. ఈ ప్ర‌దేశాన్ని ఉదగమండలం అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతం ఏడాది పొడవునా అన్ని సీజన్స్ లోనూ పర్యాటక తాకిడితో కిటకిట‌లాడుతుంటుంది. ఇక్క‌డ సంద‌ర్శించేందుకు అనువైన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఈ స‌మ‌యంలో ఊటీ సంద‌ర్శించాల‌నుకునేవారికి తెలంగాణ టూరింజ ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఈ ప్యాకేజీలో మైసూర్ టూ ఊటీ రోడ్ ట్రిప్ ఉంటుంది. ఈ స్పెష‌ల్ ప్యాకేజీ ప్రతి సోమవారం తేదీల్లో మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం.. ఈ సమ్మర్ సరికొత్త ప్యాకేజీలో బెంగళూరు, మైసూరుతో పాటు ఊటీలోని ప్ర‌దేశాల‌ను కూడా చూడొచ్చు. ప్ర‌కృతి అందాల‌లో సేద‌తీరాల‌నుకునేవారు, కుటుంబంతో పాటు స‌ర‌దాగా విహార‌యాత్ర చేయాల‌నుకునేవారు త‌ప్ప‌కుండా ఈ ప్ర‌దేశానికి వెళ్లాల్సిందే..!

ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ సిటీ నుంచి మీ రోడ్ జ‌ర్నీ ప్రారంభ‌మ‌వుతుంది. ఈ ప్యాకేజీ ప్రతి సోమవారం తేదీల్లో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది.. బ‌స్సు మార్గం ద్వారా ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ టూర్ మొత్తం ఆరు రోజులపాటు సాగుతుంది. ఈ టూర్ లో ఎన్నో టూరిస్ట్ ప్లేసులను వీక్షించొచ్చు.

ooty4

హైదరాబాద్ - ఊటీ - మైసూర్ టూర్ షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

ఈ ప్యాకేజీని 'BENGALURU-OOTY-MYSORE TOUR' పేరుతో హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది. ఊటీ - మైసూర్ - బెంగుళూరు చూసేందుకు తెలంగాణ టూరిజం(Telangana Tourism) ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ప్రతి సోమవారం తేదీల్లో జర్నీ స్టార్ట్ అవుతుంది. మొద‌టి రోజు మీ ప్ర‌యాణంలో భాగంగా మధ్యాహ్నం 03.30 గంటలకు హైదరాబాద్ లోని యాత్రినివాస్ నుంచి మీ బస్సు ప్ర‌యాణం ప్రారంభ‌మవుతుంది. బషీర్ బాగ్ కు 4:00 PMకు చేరుకుంటుంది. ఆ రాత్రి బెంగళూరుకు జ‌ర్నీ ఉంటుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం (రెండో రోజు) ఆరు గంట‌ల‌కు బెంగుళూరు చేరుకుంటారు.

ootypackage1

క్క‌డ ఉద‌యం టిఫిన్ చేశాక స‌మీపంలోని ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాల‌ను చూడొచ్చు. Bull Temple, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, తిపస్ ప్యాలెస్ వంటివి సందర్శిస్తారు. అనంత‌రం సాయంత్రం తిరిగి హోటల్ కు చేరుకుంటారు. ఇక‌, మూడో రోజు బెంగళూరు నుంచి ఉదయం నాలుగు గంటలకే ఊటీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఊటీకి చేరుకుంటారు. ఆ త‌ర్వాత దొడబెట్టలోని పలు ప్రాంతాలను విజిట్ చేయొచ్చు. ఈ టూర్‌లో భాగంగా బోటానికల్ గార్డెన్ సందర్శనతో పాటు బోటింగ్ వంటివి కూడా చేయొచ్చు. అనంత‌రం సాయంత్రం 6 గంటలకు హోటల్ కు చేరుకుంటారు.

నాలుగ‌వ‌ రోజు మైసూరుకు (Mysore) వెళ్తారు. అదే రోజు సాయంత్రం బృందావ‌నం గార్డెన్ సంద‌ర్శ‌న ఉంటుంది. ఆ తర్వాత హోటల్ కు చేరుకుంటారు. ఐదో రోజు మైసూరుకు చేరుకుంటారు. మైసూర్‌లో ప్ర‌సిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రమైన చాముండేశ్వ‌రి ఆలయ దర్శనంతో పాటు మైసూర్ మహారాజ్ ప్యాలెస్, బిగ్ బుల్ టెంపుల్ ను దర్శనం చేసుకుంటారు. ఆ త‌ర్వాత అదేరోజు మధ్యాహ్నం 12 తర్వాత హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమవుతారు. ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. ఇక‌, ఈబ‌స్సు ప్ర‌యాణానికి సంబంధించిన టిక్కెట్ ధ‌ర‌లు విష‌యానికొస్తే.. పెద్దలకు రూ. 11,999 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లలకు రూ. 9,599 చెల్లించాలి. ఇక‌, ఈ ప్ర‌యాణం వోల్వో కోచ్ బస్సులో ఉంటుంది. మ‌రెందుకాల‌స్యం ఊటీ, మైసూర్ ప్రాంతాల‌ను సంద‌ర్శించాల‌నుకుంటే బ‌య‌లుదేరండి. ప్ర‌యాణికులు ఈ ప్యాకేజీని బుక్‌చేసుకోవాలంటే https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్‌ను త‌ప్పకుండా సంద‌ర్శించాల్సిందే..!

More News

    Read more about: ooty to mysore travel guide
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+