Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్ టు అరుణాచ‌లం స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ అస్స‌లు మిస్స‌వ్వొద్దు..

హైద‌రాబాద్ టు అరుణాచ‌లం స్పెష‌ల్ టూర్ ప్యాకేజీ అస్స‌లు మిస్స‌వ్వొద్దు..

తమిళనాడులోని ప్రసిద్ధమైన పుణ్య‌క్షేత్రాలలో అరుణాచలం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఇక్క‌డివారు తిరువణ్ణామలైగా పిలుస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఈ ప్ర‌దేశంలో అరుణాచలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నారు. ఒక్కసారి ఆ భోళాశంక‌రుడిని ద‌ర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని ఇక్క‌డికి వ‌చ్చేవారి ప్ర‌గాఢ విశ్వాసం. ఇటీవ‌లే అరుణాచలం సంద‌ర్శించేందుకు చాలామంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అలాంటివారికోసం తెలంగాణ టూరిజం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీనీ అందిస్తోంది.

పెరిగిన ర‌ద్దీ..

ఈ ప్యాకేజీని గురించి పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుందాం పదండి. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నగరం నుంచి ప్ర‌యాణాం చేయాల్సి ఉంటుంది. మొత్తం నాలుగురోజుల ట్రిప్ ఉంటుంది. వచ్చే (నవంబర్) నెలకు సంబంధించిన టూర్ తేదీని కూడా తెలంగాణ టూరిజం ముందుగానే ప్ర‌క‌టించేసింది. తమిళనాడు రాష్ట్రంలో వెల‌సిన అరుణాచలం ఆల‌యానికి ఇటీవ‌ల ర‌ద్దీ ఎక్కువ‌య్యింది. చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచ‌లేశ్వ‌ర ద‌ర్శ‌నానికి వెళ్లున్నారు.

అరుణాచ‌లేశ్వ‌రుని ఆల‌యాన్ని పంచభూత లింగా క్షేత్రాలలో ఒక‌టైనా అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని. అచలం అంటే కొండ అని అర్థం వ‌స్తుంద‌ని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇక్క‌డ గిరిప్రదక్షిణ చేసేందుకు చాలామంది ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఎందుకంటే ఇక్క‌డ గిరిప్ర‌దక్షిణ చేస్తే ఎంతో మంచి జరుగుతుందని భక్తుల ప్ర‌గాఢ విశ్వాసం..

hyderabadtoarunachalam

నాలుగురోజుల ప‌ర్య‌ట‌న‌..

ఈ ప్ర‌దేశానికి వ‌చ్చే తెలుగు రాష్ట్రాల వారికి తెలంగాణ టూరిజం ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం ప్ర‌యాణం ఉంటుంది. మొత్తం 4 రోజుల పాటు ఈ పర్యటన కొన‌సాగుతోంది. నెలలో ఒక్కసారి మాత్రమే ఈ ప్యాకేజీనీ ఆప‌రేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 13, 2024వ తేదీన ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ ఈ తేదీ మిస్ అయితే, వచ్చే నెల(డిసెంబర్)లో వెళ్లొచ్చు. ఇత‌ర పూర్తి స‌మాచారం కోసం టిక్కెట్లు బుకింగ్ కోసం ప‌ర్యాట‌కులు తెలంగాణ టూరిజం వారి అధికారిక వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/ స‌ంప్ర‌దించ‌గ‌ల‌రు.

టూర్ ప్యాకేజీ వివ‌రాలివే..

హైద‌రాబాద్ - అరుణాచ‌లం పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. వీటి ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. పెద్దలకు రూ. 8000 ఉంది. అదే చిన్నారులకు అయితే, రూ. 6400 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా మొద‌టిరోజు సాయంత్రం 6:30 గంట‌లకు హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి ప్ర‌యాణం ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌రుస‌టి రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. 9 గంటల లోపు వినాయ‌కుని ద‌ర్శ‌నం పూర్త‌వుతుంది. అనంత‌రం తిరువ‌న‌మ‌లైకి బయల్దేరుతారు.

మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుని, అక్క‌డ స్వామివారి దర్శనం పూర్తి చేసుకుంటారు. ఆ రాత్రికి అరుణాచలంలోనే బ‌స చేస్తారు. మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ ముగించుకుని వేలూరుకు ప‌య‌న‌మ‌వుతారు. ఆత‌ర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనముంటుంది. సాయంత్రం 4 తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప‌య‌న‌మ‌వుతారు. నాలుగోరోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది.

More News

Read more about: telangana tourism arunachalam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+