Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోని స‌మ్మ‌ర్‌లో వెళ్ల‌కూడ‌ని సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలివే!

ఇండియాలోని స‌మ్మ‌ర్‌లో వెళ్ల‌కూడ‌ని సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలివే!

వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలామంది వాతావ‌ర‌ణం అనుకూలంగా లేక‌పోయినా విహారానికి సిద్ధ‌మైపోతారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం ఈ స‌మ‌యంలో పిల్ల‌ల‌కు వేస‌వి సెల‌వులు వ‌స్తాయి. దీంతో కుటంబ‌స‌మేంతంగా టూర్‌ను ఎంజాయ్ చేసేందుకు ముందునుంచే ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. మ‌న దేశంలో టూరిస్ట్ ప్ర‌దేశాల‌కు కొర‌త లేదు. అయితే, చాలా ప్ర‌దేశాలు సీజ‌న‌ల్‌గా చూడాల్సిన‌వి ఉంటాయి. అదే స‌మ‌యంలో ఈ వేస‌వి సీజ‌న్‌లో అస్స‌లు వెళ్ల‌కూడ‌ని ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నప్ప‌టికీ.. ఇది నిజం. పొర‌పాటున ఈ టూర్ ప్లాన్‌లో ఈ ప్ర‌దేశాలు ఉంటే మాత్రం, వెంట‌నే మీ ప్ర‌యాణంలో మార్పులు చేసుకోండి. లేదంటే.. మీ వేస‌వి విహారం జీవితంలో మర్చిపోలేని ఘోర‌మైన అనుభ‌వాల‌ను చ‌విచూడాల్సి వ‌స్తుంది. మ‌రెందుకు ఆల‌స్యం.. ఈ వేస‌వి సీజ‌న్‌లో దూరంగా ఉండాల్సిన ఆ ప‌ర్యాట‌క ప్ర‌దేశాలేంటో చూసేద్దాం రండి!

jaisalmer

ఎడారి బఫర్ జోన్‌.. ఫలోడి

రాజ‌స్థాన్ రాష్ట్రంలోని ఫలోడి జ‌ల్లాలోని ఓ ప‌ర్యాట‌క ప్ర‌దేశం ఫ‌లోడి. ఈ ప్రాంతం థార్ ఎడారిని బఫర్ జోన్‌లో ఉంటుంది. దీనినే సాల్ట్ సిటీ అని కూడా పిలుస్తారు. అంతేకాదు, భారతదేశంలోని అత్యంత వేడి ప్రదేశంగా ఫ‌లోడిని చెప్పొచ్చు. ఇక్క‌డి చారిత్రక నిర్మాణాల‌ను చూసేందుకు నిత్యం దేశ‌విదేశాల‌నుంచి ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి వాలిపోతుంటారు. అయితే, వేస‌వి సీజ‌న్‌లో మాత్రం ఇక్క‌డికి వ‌చ్చేందుకు ఎవ్వ‌రూ సాహ‌సించ‌రు. అందుకు ప్ర‌ధాన కార‌ణం వేసవి నెలల్లో ఈ ప్రాంతంలో న‌మోదయ్యే ఉష్ణోగ్రతలే. సుమారు 51 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ‌ల తీవ్ర‌త ఫ‌లోడిలో ఉంటుంది మ‌రి. ఇక్క‌డి ప్రజలు ఇప్పటికీ ఇక్కడ సాంప్రదాయ ఉప్పు వ్యాపారం చేస్తూ.. నివ‌సిస్తున్నారు.

goldentemple

గోల్డెన్ సిటీ జైసల్మేర్

జైసల్మేర్ రాజస్థాన్‌లోని ప్రసిద్ధమైన పర్యాటక ప్రదేశం. దీనినే గోల్డెన్ సిటీగా అని పిలుస్తారు. రాజస్థాన్ సంద‌ర్శ‌న‌కు వెళ్లే ప‌ర్యాట‌కుల జాబితాలో త‌ప్పనిస‌రిగా జైస‌ల్మేర్ ఉంటుంది. ఈ నగరం మిరుమెట్లుగొలిపే ఇసుక దిబ్బలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డి మెరిసే బంగారు ఇసుక దిబ్బలు చూప‌రుల‌ను కనువిందు చేస్తాయి. అయితే, వేసవి కాలంలో జైసల్మేర్ ప‌ర్య‌ట‌న అంత శ్రేయ‌స్క‌రం కాదు. ఇక్క‌డ వేస‌విలో 42°C వరకు ఉష్ణోగ్రతలు స‌ర్వ‌సాధార‌ణం. వేడిగాల‌లుతో కూడిన ఇక్క‌డి వాతావర‌ణం వేస‌వి విహారానికి అనుకూలంగా ఉండ‌దు.

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్

పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఆల‌య నిర్మాణ శైలి సందర్శకులకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. అయితే, గోల్డెన్ టెంపుల్ సీజ‌న‌ల్ విహారానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా.. శీతాకాలం, వసంతకాలం లేదా చల్లగా ఉండే నెలలలో గోల్డెన్ టెంపుల్ సందర్శించటం ఉత్తమమైన స‌మ‌యంగా చెప్పొచ్చు. వేసవిలో ఈ నగరం సంద‌ర్శ‌కుల‌కు అస్సలు అనుకూలంగా ఉండ‌దు. ఈ వేడి వాతావరణం ప‌ర్యాట‌కుల ఆరోగ్య‌పై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపిస్తుంది.

khujarotemple

శిల్పకళల నిల‌యం.. ఖజురహో

అల‌నాటి చారిత్ర‌క శిల్ప‌క‌ళా సంప‌ద‌కు నిలువెత్తు నిద‌ర్శం ఖ‌జుర‌హో. ఇక్క‌డి అబ్బురపరిచే శిల్పకళ, ఆకర్షణీయమైన శృంగార సన్నివేశాలను వర్ణించే శిల్పాలు సంద‌ర్శ‌కుల చూపు తిప్పుకోనీయ‌వు. ఈ ప్రాంతాన్ని మధ్యయుగ వారసత్వ చిహ్నంగా చెబుతారు. మ‌రీముఖ్యంగా చ‌రిత్ర ప్రేమికులు ఖజురహో అందాలను ఆస్వాదించేందుకు విదేశాల‌నుంచి కూడా ఇక్క‌డికి వాలిపోతుంటారు. కానీ, ఖ‌జుర‌హో అందాల‌ను ఆస్వాదించేందుకు వేస‌వి స‌రైన స‌మ‌యం కాదు. ఇక్క‌డి అధిక ఉష్ణోగ్ర‌త‌లు చూప‌రుల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.

ప్రేమికుల చిహ్నం.. తాజ్ మహల్‌

తాజ్ మహల్‌ ప్రేమికుల చిహ్నంగా.. ప్రపంచంలోనే ఒక అద్భుత కట్టడంగా పేరుపొందింది. కుటుంబ‌స‌మేతంగా సంద‌ర్శించాల‌నుకునే చారిత్ర‌క‌ నిర్మాణాల్లో తాజ్‌ మ‌హ‌ల్ త‌ప్ప‌క ఉంటుంది. ఇక్క‌డ తీసుకునే ఫోటోలు జీవితంలో మ‌ర్చిపోలేని క్ష‌ణాల‌ను నిత్యం చేరువ చేస్తాయ‌ని చాలామంది భావిస్తుంటారు. అయితే, ఈ ప్ర‌సిద్ధ ప‌ర్యాక‌ట ప్ర‌దేశంలో విహ‌రించేందుకు వేస‌విలో అస్స‌లు వెళ్ల‌కూడ‌దు. తాజ్ మహల్‌కు నెలవై ఉన్న‌ ఆగ్రా పట్టణంలో ఎండల తీవ్ర‌త దారుణంగా ఉంటుంది.

More News

    Read more about: summer tour places
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+