Search
  • Follow NativePlanet
Share
» »ఆంజనేయ స్వామిని ద్వేషించే ఊరు !

ఆంజనేయ స్వామిని ద్వేషించే ఊరు !

By Mohammad

భారతదేశంలో ఎక్కడ చూసినా ఆంజనేయుని ఆలయాలు దర్శనం ఇస్తాయి. సాధారణంగా దుష్టశక్తుల బారి నుండి కాపాడటానికి ... బలం చేకూర్చటానికి ఆంజనేయుడిని పూజిస్తాము కానీ ఇక్కడ ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో హనుమంతుడిని పూజించారు సరికదా ఉచ్చరించటానికి కూడా ఇష్టపడరు. ఆ ఊరిలో ఎవరికీ ఆంజనేయుడని, హనుమంతుడని, మారుతి అని పేర్లు కూడా పెట్టరు కూడా. ఒకేవేళ పొరపాటున పలికితే ఇక అంతే సంగతులు ..!

ఆ ఊరి పేరు ద్రోణగిరి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరా జిల్లాలో కలదు. దేశ రాజధాని ఢిల్లీ నుండి 400 కిలోమీటర్ల దూరంలో, 6 గ్రామాల సమూహంతో ఏర్పడ్డదే ద్రోణగిరి. దీనికి గల ఇతర పేర్లు దునగిరి, దూణగిరి. ఈ గ్రామం సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కుమవొన్ పర్వత శ్రేణులలో కలదు. ద్రోణగిరి లో ప్రసిద్ధి చెందిన శక్తి పీఠం కలదు. గుడిలో కొలువైన దేవతను 'దునగిరి దేవి' గా కొలుస్తారు.

దునగిరి గ్రామం లోని ఆలయం

దునగిరి గ్రామం లోని ఆలయం

చిత్ర కృప : Gautam Dhar

పురాణాల్లో ద్రోణగిరి

పాండవుల గురువైన ద్రోణాచార్యుడు ఈ ప్రదేశంలోని కొండ పై తపస్సు చేశాడు కనుకనే ద్రోణగిరి అన్న పేరొచ్చిందని స్థానికులు చెబుతారు. పాండవులు వనవాస సమయంలో కొద్దీ రోజుల పాటు ఇక్కడ గడిపినట్లు మహాభారతంలో పేర్కొన్నారు. దున గిరి దేవి ని మహామయ హరిప్రియ గా అభివర్ణిస్తారు. ఈ శక్తి పీఠానికి గల మరో పేరు 'ఉగ్ర పీఠ'.

ద్రోణగిరి లో ఆంజనేయ స్వామి ని పూజించరు .. ద్వేషిస్తారు. ఏం ? అంత పాపం ఈ ఊరికి ఆంజనేయస్వామి ఏమి చేసాడనేగా మీ సందేశం అయితే ఇది చదవండి ..

ఆంజనేయస్వామి విగ్రహం

ఆంజనేయస్వామి విగ్రహం

చిత్ర కృప : Manfred Sommer

రామాయణ కాలం అంటే త్రేతాయుగం అని. రాముడు - రావణాసురుడు మధ్య యుద్ధం జరిగే సమయంలో లక్షణుడు స్పృహ తప్పి కింద పడిపోతాడు గుర్తుందా ? అప్పుడు ఆంజనేయస్వామి ఎక్కడో హిమాలయాల పర్వతాల వద్ద ఉన్న సంజీవని పర్వతం తీసుకొని వచ్చి లక్షణుడిని మూర్ఛ నుండి తప్పిస్తాడు అవునా ?

ఇది కూడా చదవండి : అంజనేయస్వామి జన్మించిన ప్రదేశం !

ఆ సంజీవని పర్వతం ఈ ద్రోణగిరి ప్రదేశంలోనే ఉండేదట. తాము ఎంతగానో పూజించే ఆ కొండను ఆంజనేయస్వామి తీసుకెళ్ళేసరికి ఇక్కడున్నవారికి కోపం కట్టలు తెగిందట. అప్పటి నుంచి ఆంజనేయ స్వామి పూజలు చేయటం మానేశారు.

ద్రోణగిరి గ్రామ ప్రజలు ఆంజనేయస్వామి ని ఎంతగా ద్వేషిస్తారంటే ... ఒకవేళ ఆంజనేయస్వామి పేరుని ఎవరైనా పలికినా, పూజించినా దానిని నేరంగా భావించి వారిని ఆ ఊరి నుండి వెలేస్తారట..!

పర్వతాలు, ద్రోణగిరి

పర్వతాలు, ద్రోణగిరి

చిత్ర కృప : Jay Tandale

దునగిరి లేదా ద్రోణ గిరి ఎలా చేరుకోవాలి ?

విమానాశ్రయం

ఉధం సింగ్ నగర్ లోని పంటనగర్ ఎయిర్ పోర్ట్ దునగిరి కి సమీపాన, అల్మోరా కు 127 KM ల దూరంలో కలదు. ఈ విమానాశ్రయం ఢిల్లీ నుండి నేరుగా కనెక్ట్ చేయబడింది. న్యూ ఢిల్లీ నుండి కేవలం గంట ప్రయాణం లో పంటనగర్ ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చు. అక్కడి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి దున గిరి చేరుకోవచ్చు.

రైలు మార్గం

కథోడ్గం రైల్వే స్టేషన్, అల్మోరాకు 90 కిలోమీటర్ల దూరంలో కలదు. జమ్మూ తావీ, శ్రీనగర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుండి స్టేషన్ కు రైళ్లు వస్తుంటాయి. స్టేషన్ బయట క్యాబ్ లేదా టాక్సీ అద్దెకు తీసుకొని ప్రయాణించవచ్చు.

నీటి బుగ్గ, ద్రోణగిరి

నీటి బుగ్గ, ద్రోణగిరి

చిత్ర కృప : Gautam

బస్సు మార్గం

డెహ్రాడూన్ (412 KM), నైనిటాల్ (71 KM), అల్మోరా (100 KM) రాణిఖేత్ (50 KM), ద్వారాహత్ (14 KM), ఢిల్లీ (400 KM) తదితర ప్రాంతాల నుండి ల నుండి దునగిరి గ్రామానికి ప్రభుత్వ / ప్రవేట్ వాహనాలు కలవు.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+