Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్షాకాలంలో వ‌రంగల్‌లోని పాకాల స‌ర‌స్సును త‌ప్ప‌క వీక్షించాల్సిందే..!

వ‌ర్షాకాలంలో వ‌రంగల్‌లోని పాకాల స‌ర‌స్సును త‌ప్ప‌క వీక్షించాల్సిందే..!

వ‌ర్షాకాలంలో వీకెండ్ ట్రిప్‌కు వెళ్లాల‌నుకునేవారు సూదూర ప్రాంతాల‌కు ప్లాన్ చేసుకోకుండా స‌మీపంలోని ప్ర‌దేశాల‌ను ఎంపిక చేసుకుంటారు. మీరుకూడా అలాగే ఆలోచిస్తుంటే మాత్రం ఇక‌, ఆల‌స్యం చేయ‌కండి. హైదారాబాద్ న‌గ‌రానికి స‌మీపాన వరంగల్‌ జిల్లాలోని ప్ర‌కృతి అందాల‌తో నిండిన పాకాల స‌ర‌స్సునును వీక్షించేందుకు బ‌య‌లుదేరండి. ఈ స‌ర‌స్సు ద‌గ్గ‌ర ఎలాంటి ర‌ణ‌గోణ‌ధ్వ‌నులు ఉండ‌వు. కాలుష్య ర‌హిత ప్రాంత‌మిది. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో ప్ర‌కృతి అందాల‌లో సేదతీరాల‌నుకునేవారికి ఈ ప్రాంతం స‌రైన ఎంపిక అనే చెప్పుకోవాలి. ఇక‌, వ‌ర్షాకాలంలో ఈ స‌ర‌స్సు అందాల‌ను త‌ప్ప‌క చూడాల్సింది. రండి పాకాల స‌ర‌స్సు విశేషాలేంటో తెలుసుకుందాం..

వ‌రంగ‌ల్‌లోని ఖానాపురం మండలం అశోక్ నగర్‌లో వెల‌సింది పాకాల సరస్సు. ఇది వ‌రంగ‌ల్ జిల్లాలోని ప్ర‌సిద్ధిచెందిన స‌ర‌స్సు. ఈ సరస్సు దట్టమైన అడవి విస్తీర్ణం కలిగి ఉంటుంది. ఈ సరస్సును పూర్తిస్తాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఎకో టూరిజం, అడవి శాఖ ఆధ్వర్యంలో కొంతమేర‌కు ప‌నులు జ‌రిగాయి. గతంలో ఈ స‌ర‌స్సులో బోటింగ్ కూడా జ‌రిగేది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వ‌ర్యంలో ఒక పడవను ఒక స్పీడ్ బోటును కూడా ఏర్పాటు చేశారు. అయితే, అది ఎక్కువ రోజులు కొన‌సాగ‌లేదు.

స‌ర‌స్సులో బోటులో షికారు చేస్తూ చుట్టూ ఉన్న ప్ర‌కృతి అందాల‌ను వీక్షించేవారు. ఈ స‌ర‌స్సు వ‌ల‌స ప‌క్షులు విడిది కేంద్రమ‌ని చెప్పొచ్చు. ఇక్క‌డ ఎన్నో ర‌కాల ప‌క్షుల కిల‌కిల‌రావాల‌ను మ‌నం చూడొచ్చు. ప‌క్షి ప్రేమికుల‌కు ఈ ప్రాంతం ఎంతో అనువైన‌ది. వరంగల్ జిల్లాలోని నర్సంపేటకు స‌మీపంలో ఈ స‌ర‌స్సు ఉంటుంది. వరంగల్ నుంచి సుమారు అర‌వై కిలోమీట‌ర్లు వెళితే ఇక్కడికి చేరుకోవచ్చు.

pakalalake

వ‌న్ డే టూర్‌...

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వ‌ర్షాల‌కు పాకాల సరస్సు నీటితో జ‌ల‌క‌ళ‌లాడుతుంది. ఈ చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి అందాల‌ను ప‌ర్యాట‌కుల‌ను రా ర‌మ్మంటూ ఆహ్వానం ప‌లుకుతున్నాయి. వీకెండ్స్ కానీ సెలవు దినాల్లో పాకాల ట్రిప్‌కు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హైదారాబాద్ న‌గ‌రంలో ఉన్న‌వారు వ‌న్ డేలో ఈ స‌ర‌స్సును చుట్టేయొచ్చు. కుటుంబంతో, స్నేహితుల‌తో ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించేయొచ్చు.

పాకాల స‌ర‌స్సు 30 చదరపు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో విస్త‌రించింది. ఈ సరస్సును క్రీ శ.1213లో కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది. ఈ స‌ర‌స్సుతో పాటు ఇక్క‌డ 839 చదరుపు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో పాఖల్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం కూడా ఉంటుంది. ఈ అభ‌యార‌ణ్యం వివిధ రకాల జంతుజాలానికి ఆవాసంగా ఉంది. ఈ అభ్య‌యార‌ణ్యం వ‌రంగ‌ల్‌లోని ఎంతో పేరుగాంచింది. పాకాల అభయారణ్యంలో అనేక రకాల అరుదైన జీవ‌జాలం ఉంది.

pakalalake

పాఖల్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం...

ఈ అభ‌యార‌ణ్యంలో చితాల్, చిరుతపులి, నక్క, నీల్‌గాయ్, ఎలుగుబంటి, బోనెట్ మకాక్‌లకు వంటి జంతువులెన్నో ఉన్నాయి. ఇంకా ఇక్క‌డ కొండచిలువలు, నాగుపాములు, వైపర్‌లు, క్రైట్‌లు, భారతీయ ఊసరవెల్లులు కూడా త‌మ నివాసాన్ని ఏర్ప‌రుచుకున్నాయి. కొన్ని నెల‌ల క్రితం ఈ అభయారణ్యంలో ఒక పులి కూడా సంచ‌రించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా ఇందులో ఓపెన్ బిల్డ్ కొంగ, జకానాస్, రెడ్ క్రెస్టెడ్ పోచార్డ్, పెయింటెడ్ కొంగ, గార్గేనీతోపాటు 70 జాతుల ప‌క్షులు కూడా ఇక్క‌డ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ గుర్తించారు.

pakalalake

ఎలా వెళ్లాలి..?

హైదరాబాద్ నుంచి వెళ్లాల‌నుకునేవారు ముందుగా వరంగల్ వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 60 కిలోమీట‌ర్ల‌ దూరంలో నే పాకాల స‌ర‌స్సు ఉంటుంది. క్యాబ్‌లు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ ద్వారా కూడా రావొచ్చు. ఇక్క‌డికి వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంటుంది. క‌నుచూపుమేర పచ్చదనం, ఆ పక్కనే అభ్యయారణ్యం..! ఇలాంటి అద్భుత‌మైన, రమణీయమైన దృశ్యాల‌ను ప్ర‌తి ఒక్క ప‌ర్యాట‌కుడు చూడాల‌నుకుంటారు. మీరు కూడా అనుకుంటే మాత్రం పాకాల స‌ర‌స్సు సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరాల్సిందే..!

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+