Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని ఈ ఆశ్రమాలకు ఎప్పుడైనా వెళ్లారా?

భారతదేశంలోని ఈ ఆశ్రమాలకు ఎప్పుడైనా వెళ్లారా?

భారతదేశంలోని ఈ ఆశ్రమాలకు ఎప్పుడైనా వెళ్లారా?

ట్రావెలింగ్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి. అలాంటి వాళ్లను నెలలో రెండు మూడు సార్లు మంచి ప్రదేశానికి తీసుకెళ్తే చాలు వారి ఆనందానికి అవ‌ధులు ఉండవు. అయితే ప్రయాణానికి, బసకు మంచి ఏర్పాట్లను చూసే వారు కొందరైతే, డబ్బు ఆదా చేసేవారు మ‌రికొంద‌రుంటారు. మీరు డబ్బు ఆదా చేసేవారి జాబితాలో ఉంటే మాత్రం భార‌త‌దేశంలోని ఈ ఆశ్రమాల‌ను త‌ప్ప‌క సంద‌ర్శించండి. ఈ ఆశ్ర‌మాల్లో బ‌స‌చేసేందుకు పూర్తిగా ఉచితం. అవును, అది మాత్ర‌మే కాదండోయ్‌, ఈ ఆశ్రమాలలో ఉచిత బోజ‌న స‌దుపాయం కూడా క‌ల‌దు. కాబట్టి, ఆలస్యం చేయ‌కుండా ఈ ఆశ్రమాలను మీ జాబితాలో చేర్చండి. మ‌రెందుకాల‌స్యం వీటి గురించి తెలుసుకుందాం ప‌దండి.

bharatheritageservices

భారత్ హెరిటేజ్ సర్వీసెస్

రిషికేశ్ ఉత్తరాఖండ్‌లోని అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. ప్రతిరోజు లక్షల మంది ప్రజలు సందర్శన కోసం ఇక్కడకు వస్తుంటారు. మీరు కూడా రిషికేశ్ సందర్శించడానికి వస్తున్నట్లయితే, ఇక్క‌డ బ‌స చేసేందుకు భార‌త్ హెరిటేజ్ స‌ర్వీసెస్‌కు త‌ప్ప‌నిస‌రిగా వెళ్లండి. ఎందుకంటే, ఈ ప్రాంతం ఉచిత బ‌స చేసే అవ‌కాశం ఉంటుంది. భోజ‌న స‌దుపాయం కూడా ఉచితంగా ల‌భిస్తుంది. ఈ సంస్థ ప్రజలకు ఉచితంగా సేవను అందిస్తుంది. దీనికి బదులుగా మీరు ఇక్కడ కొంత స్వచ్ఛందంగా పని చేయాల్సి ఉంటుంది. ఈ ఆశ్రమం ప్రశాంతమైన నివాస కాలనీలో అందమైన గంగా నది నడక మార్గం నుండి రెండు నిమిషాల నడక దూరంలో ఉంది. ఇక్కడ మీరు కాలుష్యం లేని ప్రాంతంలో గంగా నది వెంట ఉదయం మరియు సాయంత్రం నడవొచ్చు. ఈ మార్గంలో త్రివేణి ఘాట్ మరియు రామ్ ఝులకిల‌ను కూడా సంద‌ర్శించొచ్చు.

ramanashram

రమణాశ్రమం, తిరువణ్ణామలై

రమణాశ్రమం, రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతంలో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లాలో పడమర వైపు విస్తరించి ఉంది. 1950 లో మహర్షి స్వర్గస్తులయినప్పుడు అనేక వేల మంది భక్తులు అయన దర్శనార్ధమ్ ఇక్క‌డ‌కు వచ్చారు. ఆయన స్వర్గస్తులయిన తరువాత కూడా చాలా మంది భక్తులు, ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు. ప్రతీ సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి, కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూవుంటారు. దక్షిణ భారతదేశంలోని తమిళనాడు నగరాన్ని సందర్శించడానికి దాదాపు ప్రతిరోజూ వేలాది మంది దేశ‌విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఈ ప్రసిద్ధ ఆశ్రమం శ్రీ భగవాన్ మందిరానికి ప్రసిద్ధి చెందింది.

paramarthaniketan1

పరమార్థ నికేతన్

పరమార్థ నికేతన్ గంగానది ఒడ్డున, పచ్చని హిమాలయాల ఒడిలో ఉంది. ఈ ఆశ్రమాన్ని 1942లో పూజ్య స్వామి శుక్దేవానందజీ మహరాజ్ స్థాపించారు. 1986 నుండి, పూజ్య స్వామి చిదానంద సరస్వతీజీ మహారాజ్ పరమార్థ నికేతన్ అధ్యక్షుడు మరియు ఆధ్యాత్మిక అధిపతిగా కొన‌సాగేవారు. గత ఇర‌వైఐదేళ్లుగా సాధ్వి భగవతి సరస్వతి పరమార్థ నికేతన్ ఆశ్రమంలో నివసిస్తున్నారు. 1000 కంటే ఎక్కువ గదులతో రిషికేశ్‌లోని అతిపెద్ద ఆశ్రమంగా, పరమార్థ నికేతన్ ఆశ్ర‌మం పేరుగాంచింది. ఇక్క‌డికి వ‌చ్చే వేలాది మంది యాత్రికులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన మరియు పవిత్రమైన వాతావరణాన్ని అందమైన తోటలను అందిస్తుంది.

More News

    Read more about: uttarakhand
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+