Search
  • Follow NativePlanet
Share
» »భారతదేశంలోని వింతైన గ్రామాల గురించి ఎప్పుడైనా విన్నారా..?

భారతదేశంలోని వింతైన గ్రామాల గురించి ఎప్పుడైనా విన్నారా..?

భారతదేశంలోని వింతైన గ్రామాల గురించి ఎప్పుడైనా విన్నారా..?

భారతదేశంలో చాలా గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి దాని సొంత సంప్రదాయాలు, సంస్కృతి, నమ్మకాలు, ప్రత్యేకతలు ఉన్నాయి. దాని కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ అనేక ప్రాంతాల్లో వింతలు, విశేషాలు ఉన్నాయి. రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు నిండి ఉన్నాయి. దేశంలో విభిన్నమైన రంగులు, ప్రసంగం, ఆహారం, కళల‌కు ప్రసిద్ధి చెందింది భార‌త‌దేశం. ఆయా ప్రాంతాల్లో ఉన్న సంస్కృతిని బట్టి మారుతూ ఉంటుంది. ఈ రోజు భారతదేశంలోని కొన్ని వింతైన గ్రామాల గురించి తెలుసుకుందాం ప‌దండి..

విషపూరిత నాగుపాము ప్రతి ఇంట్లో సభ్యుడు

మ‌హ‌రాష్ర్ట‌లోని క్షేత్‌పాల్‌ గ్రామం ఒక వింతైన ఆచారంతో ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక్కడ అత్యంత విషప్రభావం కలిగిన నల్లత్రాచు పాములు, మనుషులు ఒకే గుడిసెల్లో కలిసి ప్రశాంతంగా జీవిస్తారని చెబుతుంటారు. అంతే కాదు ప్రాణాంతక విషసర్పాలతో చిన్నపిల్లలు ఆడుకుంటారు కూడా. ఇక్కడి ప్రజలు వాటికి భయపడరు. కానీ పూజిస్తారు. తమాషా ఏమిటంటే ఈ పాము వారికి ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌దు.

1

ప్రజలు బూట్లు ధరించలేరు

భార‌త‌దేశంలోని ఒక గ్రామంలో ప్రజలు బూట్లు ధరించడం నిషేధించబడింది. ఈ గ్రామం తమిళనాడులోని కొడైకెనాల్ హిల్ స్టేషన్ సమీపంలో ఉన్న వెల్లగవి. 200-300 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇళ్ల కంటే దేవాలయాలే ఎక్కువ. బయటి నుంచి వచ్చే వారి కోసం ఇక్కడ ప్రత్యేక నిబంధన పెట్టారు. బయటి నుంచి ఎవరైనా షూ ధరించి పట్టుబడితే కఠినంగా శిక్షిస్తారు. ఈ గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ లేకపోవడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. ఇక్కడ ప్రజలు అడవుల గుండా వారి ప్ర‌యాణాన్ని కొనసాగిస్తుంటారు.

2

రెండు దేశాల మధ్య ఉన్న గ్రామం

ఒక నగరం రెండు రాష్ట్రాలకు అనుసంధానమై ఉండ‌టం చాలామంది వినే ఉంటారు కానీ, ఈ గ్రామం మాత్రం రెండు దేశాలతో ముడిపడి ఉంది. నాగాలాండ్‌లోని లోంగ్వా గ్రామం కూడా ఇలాంటి వింత గ్రామాల్లో ఒకటి. ఈ గ్రామంలో సగం భారత సరిహద్దుల్లో .. మిగిలిన సగం మయన్మార్‌ సరిహద్దుల్లో ఉంది. ఇక్కడి ప్రజలకు రెండు దేశాల పౌరసత్వం ఉండటం విశేషంగా చూడాలి. భారతదేశంలోని బ్రిటిష్ వారి పాలన చివరి రోజుల్లో బ్రిటిష్ కార్టోగ్రాఫర్లు ఈ సరిహద్దును నిర్మించారని అనేక నివేదికలు చెబుతున్నాయి. ఇరువైపులా ఉన్న గ్రామస్థులు కొన్యాక్ తెగకు చెందినవారు.

3

50 ఏళ్లలో పెళ్లి ఊరేగింపు జరగలేదు.

బీహార్‌లోని ఓ గ్రామంలో 50 ఏళ్లుగా ఎవరి పెళ్లి ఊరేగింపు జరగలేదు. ఈ గ్రామం పేరు బార్వా కాలా. గత కొన్ని దశాబ్ధాలుగా ఇక్కడ మగవాళ్లకు పెళ్లిళ్లు జరగడం లేదు. 50ఏళ్ల తర్వాత ఒక వివాహం జరిగినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇది బీహార్‌లోని కైమూర్‌ హిల్స్‌లోని బర్వా గ్రామంలో జరిగిన వాస్తవ కథ. ఈ గ్రామంలో 2017 వరకు ఎలాంటి పెళ్లి జర‌గ‌లేదు. ఈ గ్రామాన్ని బ్యాచిలర్స్ విలేజ్ అని కూడా పిలుస్తారు. న‌గ‌రం నుంచి సుమారు ప‌ది కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తేనే ఈ గ్రామానికి చేరుకోవచ్చు. ఊరిలోకి 50ఏళ్ల తర్వాత వివాహం చేసుకునేందుకు ఓ ఆడపిల్ల రావడం విశేషమ‌య్యింది.

More News

    Read more about: maharashtra kshetpal tamil nadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+