Search
  • Follow NativePlanet
Share
» »నీటి అడుగులోని అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా?

నీటి అడుగులోని అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా?

నీటి అడుగులోని అద్భుతాన్ని ఎప్పుడైనా చూశారా?

వేస‌వి సెల‌వులు వ‌చ్చేశాయి. పిల్ల‌ల అల్ల‌రి మొద‌ల‌య్యింటుంది. ఈ సెల‌వుల్లో పిల్ల‌ల్ని ఎక్క‌డికి తీసుకెళ్ల‌లా అని పెద్ద‌లు తెగ ఆలోచిస్తుంటారు. ఎందుకంటే పిల్ల‌లు ఒక్క చోట కుదురుగా ఉండ‌రు క‌దా. వాళ్ల అల్ల‌రికి హ‌ద్దులుండ‌వు. చాలామంది ఈ సెల‌వుల్లో పిల్ల‌ల్ని బీచ్‌ల‌కు, పార్కుల‌కు తీసుకెళుతుంటారు. బీచ్‌ల‌లో అయితే పిల్ల‌ల కేరింత‌ల గురించి ఇక చెప్ప‌క్క‌ర్లేదు.

పిల్ల‌ల్లా కేరింత‌లు కొట్టే అరుదైన చేప‌ల్ని పిల్ల‌ల‌కు చూపించండి. వాటిని చూసి మీ పిల్ల‌లు ఇంకా కేరింత‌లు కొడ‌తారు. ఒక‌టి రెండు చేప‌లు అక్వేరియంలో ఉంటేనే పిల్ల‌ల ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. అలాంటిది ఏకంగా వేల చేప‌లు చుట్టుతూ ఉంటే వాళ్ల ఆనందం చెప్ప‌లేం. ఏటు చూసినా చేప‌లు చుట్టుతూ అది కూడా నీటి అడుగులో అంటే పిల్ల‌ల‌కి స‌రాదాగానే ఉంటుంది క‌దా. అదేనండి. అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్ అక్వేరియం గురించి.

kukatpallymetromall

చేప బ‌రువు 60 కిలోలు..

భాగ్య‌న‌గ‌రంలో ఈమ‌ధ్య తెగ ఫేమ‌స్ అయిన అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్ ఎగ్జిబిష‌న్ గురించి మ‌నం మాట్లాడుకుంటున్నాం. ఈ అతిపెద్ద అక్వేరియాన్ని హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లిలో మెట్రో మాల్‌ ఎదరుగా ఉన్న ట్రక్‌ పార్కింగ్ మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిష‌న్ 60 రోజుల పాటు ఉంటుంది. ఈ ప్రాంతం వేస‌వి సెల‌వుల్లో పిల్ల‌ల్ని బాగా ఆక‌ట్టుకుంటుంది. హుస్సేన్‌సాగ‌ర్ తీరాన ఈ అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్ అక్వేరియం అద్భుత‌మైన ఆనందానిస్తుంది.

ఈ అక్వేరియంలోని చేప‌ల‌ను చూసేందుకు పిల్ల‌ల‌నుంచి పెద్ద‌ల‌వ‌ర‌కు అంద‌రూ త‌ర‌లివ‌స్తున్నారు. స‌ముద్రంలో జీవించే వింతైన జీవ‌రాశుల‌న్నీ ఈ అక్వేరియంలో మ‌న‌కు క‌నిపిస్తాయి. ఈ అక్వేరియంలో 650 ర‌కాల చేప‌ల్ని మ‌నం చూడొచ్చు. ఈ అక్వేరియంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమ్యూజ్‌మెంట్స్‌తోపాటు వివిధ‌ రకాల సముద్ర చేపలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ అక్వేరియంలో అరభైమా రకం చేప ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ చేప బరువు 60 కిలోలు ఉంటుంది. దాని విలువ రూ.6 లక్షలు. ఆ చేప రోజుకు కిలోన్నర చికెన్‌ తింటుందట.

kukatpallymetromall

వివిధ రకాల చేప‌లు..

180 డిగ్రీల కోణంలో ఏర్పాటు చేసిన ఈ ట‌న్నెల్‌లో స‌ముద్ర‌జాతికి చెందిన అప‌రిమా, పిరానా, రెడ్‌టెల్‌, క్యాట్‌ఫిష్‌, సిల్వ‌ర్‌షార్క్‌, అరపైమా చేప‌లు వంటి అరుదైన చేప జాతులు ప్ర‌త్యేక ఆక‌ర్ణ‌ణ‌గా నిలుస్తున్నాయి. మ‌లేషియా, సింగ‌పూర్‌, దుబాయ్ త‌దిత‌ర ప్రాంతాల్లో ల‌భించే చేప‌లు ప్ర‌స్తుతం హైద‌ర‌బాద్ న‌గరంలో ఉన్నాయి. స‌ముద్రంలో జీవించే విభిన్న మ‌త్య్స‌జాతులు ఇక్క‌డ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయి. పిల్ల‌ల్లో విజ్ఞానాన్నిపెంపొందించే విధంగా ఈ ఆక్వేరియంను తీర్చిదిద్దారు నిర్వ‌హాకులు.

ఈ ఆక్వేరియంలోని నీటిని ప్ర‌తిరోజూ శుభ్రం చేయ‌డం, స‌కాలంలో వాటికి ఆహారం అందించ‌డం వంటి ప‌నుల‌న్నీనిర్వ‌హాకులు చాలా శ్ర‌ద్ధ‌తో చేస్తున్నారు. ఇందులో సందర్శకులు మంచినీరు మరియు ఉప్పునీటి చేపలు, చిన్న మరియు పెద్ద చేపలు మరియు రంగురంగుల మరియు సాదా చేపలతో సహా అనేక రకాల చేపలను చూడొచ్చు.అంతేకాకుండా ఈ ప్రాంతంలో అనేక ర‌కాలైన, ప‌లుప్రాంతాల‌కు చెందిన ఆహార‌ప‌దార్థాలు, వంట‌కాల‌తో కూడిన ఫుడ్‌కోర్టుల‌ను కూడా నిర్వ‌హిస్తున్నారు. దాంతో సంద‌ర్శ‌కుల తాకిడి సైతం పెరుగుతూనే ఉంది. ఇక్క‌డికి వ‌చ్చిన వారు కూడా వైరేటీ రుచుల‌ను ఆస్వాదిస్తున్నారు.

kukatpallymetromall

త‌క్కువ ధ‌ర‌కే..

ఇప్పటికే నగరంలో గతంలో ఇలాంటి ఎగ్జిబిషన్ల‌ను నిర్వ‌హించ‌గా, వీటికి సందర్శకులు భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా ఈ ఎగ్జిబిష‌న్ హైదరాబాద్‌తో పాటు కరీంనగర్, ఇతర పట్టణాల్లో సందర్శకులను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. సందర్శకుల నుంచి వస్తున్న ఆదరణ కారణంగా పలుచోట్ల ఇలాంటి అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్ సందర్శకులకు ఉదయం 11 నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ 60 రోజుల పాటు నిర్వహించబడుతుంది. సందర్శకులు ఎగ్జిబిషన్‌ని సందర్శించడానికి ఈ కాలంలో ఏ రోజునైనా ఎంచుకోవచ్చు.

అండర్ వాటర్ టన్నెల్ అక్వేరియం ఎగ్జిబిషన్ టిక్కెట్ ధరలు పెద్దలకు 150రూపాయ‌లు మరియు పిల్లలకు 120రూపాయ‌లు సందర్శకులు ఆన్‌లైన్‌లో లేదా ఎగ్జిబిషన్ ప్రవేశద్వారం వద్ద టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు.

More News

    Read more about: hyderabad kukatpally metro mall
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+