Search
  • Follow NativePlanet
Share
» »బెజ‌వాడ బీసెంట్ రోడ్‌ను ఎప్పుడైనా చూశారా?

బెజ‌వాడ బీసెంట్ రోడ్‌ను ఎప్పుడైనా చూశారా?

బెజ‌వాడ బీసెంట్ రోడ్‌ను ఎప్పుడైనా చూశారా?

బెజవాడ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బీసెంట్ రోడ్డు. మనసు బావుండక పోయినా, కలతలతో సతమతం ఆవుతున్నా, ఏదైనా అనారోగ్యం ఉన్నా ఆ రోడ్డుకు వెళితే అన్నీ మర్చిపోతారు. ఎన్ని మాల్స్ వచ్చినా జనతా బజార్ అయిన బీసెంట్ రో డ్డు ముందు బలాదూర్. బందరు రోడ్డు నుంచి బీసెంట్ రోడ్డులోకి ప్రవేశించగానే సాయి క్యాంటిన్లో నుంచి కమ్మని మైసూర్ బజ్జీ వాసన నోరూరిస్తుంది. ఇంకా అక్కడ నుంచి కోరుకున్న వారికి కోరుకున్నంత ధరల్లో అన్నీ లభిస్తాయి. పండుగ రోజుల్లో ఆ వీధిలోని ర‌ద్దీ మ‌రి చెప్ప‌క్క‌ర్లేదు.

bezwadabeasantroad

ఏ వ‌స్తువైనా అందుబాటు ధ‌ర‌కే...

నాణ్య‌మైన సేవ‌ల‌ను అందించ‌డంతోపాటు ఎన్నో ర‌కాల వంట‌కాల రెస్టారెంట్‌లు క‌లిగిన ఈ వీధిని భోజ‌న‌ప్రియులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌సిద్ధ ఆంధ్ర సాయంత్రం స్నాక్స్ పునుగులు, బ‌జ్జీ, బ‌త్తిన‌కూర‌, పానీపూరీ కూడా చూడ‌వ‌చ్చు. ఈ వీధి ఆహార ప్రియుల‌కు ఎంతో ప్ర‌సిద్ధి చెందింది. ఇక్క‌డ చాలా రెస్టారెంట్లు రుచిక‌ర‌మైన ఆహారాన్ని అందిస్తాయి. ఈ బీసెంట్‌రోడ్‌లో అనేక థియేట‌ర్లు సినిమా అభిమానుల‌ను ఆహ్వ‌నం ప‌లుకుతుంటాయి. సినిమా ప్రియులు, తినుబండారాల‌కు మాత్ర‌మే కాకుండా ఈ ర‌హ‌దారి అనేక దుకాణాల‌తో పాటు షాపింగ్ ఔత్సాహికుల దాహాన్నీ తీర్చ‌గ‌ల‌దు.

ఈ ర‌హ‌దారిలో షాషింగ్ కాంప్లెక్స్ నుండి కాస్ట్యూమ్స్ నుండి కాస్మోటిక్స్ వ‌ర‌కు ఏదైనా వస్తువును కొనుగోలు చేయొచ్చు. ఇక్క‌డ ప్ర‌తి వ‌స్తువును బేరం ఆడి కోనుగోలు చేసుకోవ‌చ్చు. 500 రూపాయ‌ల నుండి 5000 రూపాయ‌ల వ‌ర‌కు వున్న వ‌స్తువుల‌ను ఇక్క‌డ కొనుక్కోవ‌చ్చు. ఇక్క‌డ మీరు అత్య‌ధిక సంఖ్య‌లో జ‌నాల ర‌ద్దీనీ చూడొచ్చు. అంతేకాకుండా. మోడ్రన్ కేఫ్, మోడ్రన్ సూపర్ మార్కెట్, నాడార్స్ షాప్, రవీంద్ర కూల్ డ్రింక్స్ అన్నీ ఎంతో పేరొందినవి. ఈ బీసెంట్‌రోడ్‌లో ప్ర‌తియేటా ప్ర‌జ‌లు ప్ర‌తి పండుగ‌ను నిర్వ‌హిస్తారు. శ్రీ‌రామ‌న‌వ‌మి, వినాయ‌చ‌వితి, దుర్గామాత పూజ‌లు అన్నీ పండుగ‌ల‌ను ఇక్క‌డ నిర్వ‌హిస్తారు.

మ‌హిళ‌ల ఆభ‌ర‌ణాలు..

మ‌హిళ‌ల‌కు ఎంతో ఇష్ట‌మైన ఆభ‌ర‌ణాల‌న్నీ ఇక్క‌డ అత్యంత చౌక‌ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి.100 రూపాయ‌ల నుంచి వేల‌ల్లో కూడా కొనుగోలుచేయ‌వ‌చ్చు. గాజులు, చెవిదిద్దులు, వాచీలు చెప్పులు, చునీ్న‌లు, నైటీలు .. ఇలా అన్నీ ఒక్క‌టేమీటి అన్నీ ఇక్క‌డ ల‌భిస్తాయి. రోల్డ్‌గోల్డ్ ఐట‌మ్స్ కూడా త‌క్కువ ధ‌ర‌లకే ల‌భిస్తాయి.
బంద‌రు ఏలూరు ర‌హ‌దారుల మ‌ధ్య ఉండే ఓ కిలోమీట‌ర్ దూరం ఉన్న ఈ గ‌ల్లీలో అతిర‌ద్ద‌యిన బ‌జారు ఇది. ఆ చివ‌ర ఒక దుకాణం ద‌గ్గ‌ర ఆరంభించి చివ‌ర‌న బుక్స్‌స్టోర్ కు రావాలంటే సుమారు 3 నుంచి 4 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

bezwadabeasantroad1

అన్న‌ట్టు చెప్ప‌డం మ‌రిచిపోయానండి. ఇక్క‌డ బుక్‌స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి బుక్స్ అయినా పిల్ల‌ల‌కు, పెద్ద‌ల‌కు అంద‌రికీ కావాల్సిన స్టేష‌న‌రీ అన్నీ ఇక్క‌డ ల‌భిస్తాయి. ఇంకో విష‌యండి.. ఈ బీసెంట్ రోడ్ మ‌ధ్య‌లో ఫిష్ మార్కెట్ కూడా ఉంది. బెజ‌వాడ‌లో ఈ బీసెంట్ రోడ్ ఎంత ఫేమ‌సో.. బీసెంట్ రోడ్‌లో ఈ ఫిష్ మార్కెట్ కూడా అంతే ఫేమ‌స్‌. కుటుంబ‌సభ్యుల‌తో క‌లిసి ఇక్క‌డ రోజంతా షాపింగ్ చేయొచ్చు. ఒక‌సారి ఈవీధిలో అడుగుపెడితే అస్స‌లు టైమే తెలియ‌దు.

బీసెంట్‌రోడ్‌లో అలంకార్ థియేట‌ర్‌, సంధ్య థియేట‌ర్ అలాగే, ర‌మాక్లాత్ స్టోర్ చాలా ప్ర‌సిద్ధి చెందాయి. అలాగే ఎన్‌టిఆర్ కాంప్లెక్స్‌లో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులను కోనుగోలు చేస్తుంటారు. అన్ని ర‌కాల మొబైల్ ఫోన్లు అందుబాటు ధ‌ర‌ల‌కే ల‌భిస్తాయి.

ఎలా చేరుకోవాలి...

బ‌స్సు ద్వారా.. విజ‌య‌వాడ పాత ఆర్‌టిసి బ‌స్టాండు నుంచి ఒక కిలోమీట‌రు దూరంలో బీసెంట్ రోడ్ ఉంది.

రైలు మార్గం ద్వారా ... విజ‌య‌వాడ జంక్ష‌న్ రైల్వేస్టేష‌న్ బీసెంట్ రోడ్ నుండి 1.4 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. రైల్వేస్టేష‌న్ నుంచి ఆటోలు, సిటీబస్సులు, రిక్షాలు అందుబాటులో ఉంటాయి.

విమానం ద్వారా ..విజ‌య‌వాడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం బీసెంట్ రోడ్డు నుంచి 19.2 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. అక్క‌డినుంచి క్యాబ్స్‌, ఆటోలు అందుబాటులో క‌ల‌వు.

More News

Read more about: besant road bandar road
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+