భారతదేశంలోని ప్రసిద్ద నిర్మాణాలు, విగ్రహాలను ఎప్పుడైనా చూశారా?
భారతదేశం ప్రపంచంలోని అత్యంత అందమైన దేశాలలో ఒకటి. ఇది ప్రకృతి సౌంద్యర్యంతో మాత్రమే కాకుండా, గొప్ప సాంస్కృతిక వారసత్వంగా కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. అందుకే ప్రపంచం నలుమూలల ప్రజలు భారతదేశాన్ని ఓ అద్భుతమైన పర్యాటక కేంద్రంగా భావిస్తారు. వివిధ మతాలు, విశ్వాసాలు, భాషలు, ఆచారాలు, మరియు ఆహరపు అలవాట్లకు చెందిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అనేక ప్రసిద్ధ కట్టడాలు మరియు విగ్రహాలు ఇటీవల కాలంలో నిర్మించబడ్డాయి. ఈ ప్రసిద్ధ కట్టడాలను, విగ్రహాలను వీక్షించేందుకు విదేశాలనుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. మరెందుకాలస్యం మనము బయలుదేరుదాం రండి.

స్టాట్యూ ఆఫ్ యూనిటీ
ప్రపంచంలోని అత్యంత ఎతైన విగ్రహాలలో ఒకటి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ 597 అడుగుల ఎత్తు ఉంది. ఈ విగ్రహం దేశానికి మొదటి ఉపప్రధానిగా, అలాగే హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం. ఇది ఉక్కు, కాంక్రీటుతో తయారు చేయబడింది. దీనిని రామ్ వి. సుతార్ రూపొందించారు. ఇంజినీరింగ్ సంస్థ లార్సన్ అండ్ టూబ్రో నిర్మాణాన్ని చేపట్టారు. ఈ వీక్షణ గ్యాలరీలో ఒకేసారి 200 మందికి వసతి కల్పించవచ్చు. 70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను వినియోగించి 46 నెలలు ఈ విగ్రహ నిర్మాణానికి పట్టిన సమయం. స్టాట్యూ ఆఫ్ యూనిటీ కి ప్రవేశరుసుము పెద్దలకు 150 నుండి 1500 మధ్య ఉంటుంది.

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటి..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో 216 అడుగులు ఎత్తుతో సమతా మూర్తి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్రమోడీ 5 ఫిబ్రవరి 2022 న వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఇది పంచలోహాలతో రూపొందించారు. కూర్చున్నమూర్తులో్ల ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. 11వ శతాబ్దంలో జీవించిన వైష్ణవ రామానుజుల విగ్రహం. విగ్రహం ఖర్చు సుమారువెయ్యి కోట్లు దాటింది. అయితే ఎక్కువ నిధులు భక్తులచే సేకరించబడ్డాయి. ఎటువంటి ప్రవేశరుసుము లేకుండా మీరు ఈ విగ్రహాన్ని సందర్శించవచ్చు. ప్రవేశ సమయం సోమవారం నుండి శుక్రవారాల మధ్య మధ్యాహ్నం మూడు నుండి రాత్రి 8.30 వరకు ఉంటుంది. బుధవారం నాడు మూసివేయబడుతుంది. శని, ఆదివారాలలో ఉదయం 11నుండి రాత్రి 8.30 వరకు ఉంటుంది. ఈ సమయంలో సందర్శించవచ్చు.

తిరువల్లువర్ విగ్రహం
తమిళనాడులోని కన్యాకూమారి వద్ద 133 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంటుంది. 2000లో నిర్మించిన ఈవిగ్రహం తిరుక్కరల్‌లోని మూడు విభాగాలను సూచిస్తుంది. అవి ధర్మం, సంపద, ప్రేమ. ఈ విగ్రహం 38 అడుగుల పీఠంపై ఉంది. ఎత్తయిన రాతిశిల్పం విగ్రహం 3681 రాళ్లను కలిగి ఉంది.

తథాగత త్సాల్
దక్షిణ సిక్కింలోని రావంగ్లాలోని బుద్ధ పార్క్‌లో 39 మీటర్లు ఎత్తులో బుద్ధుడి విగ్రహం ఉంది. ఇది భారతదేశంలోనే ఎత్తయిన బుద్ధుడి విగ్రహంగా పేరొందింది. 2006 నుంచి 2013 దీనిని నిర్మించారు. ఈ రావంగ్లా హిమాలయన్ బౌద్ధ సర్యూ్ట్‌లో భాగం.
దలైలామా 2013లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి ఇది ఒక ప్రసిద్ధ ప్రదేశంగా మారింది. ఈ విగ్రహం గౌతమ బుద్ధుని 2550వ జయంతిని కూడా సూచిస్తుంది.

హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం
అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న తెలాంగాణ సిఎం అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విగ్రహం, ఇతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.146.50 కోట్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో 11.7 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఏడేళ్ల పాటు శ్రమించిన శిల్పులు, ఇంజనీర్లు భారీ విగ్రహాన్ని ఆవిష్కరణకు సిద్ధం చేశారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మించారు. పీఠంపైకి ఎక్కి విగ్రహం వద్దకు చేరుకునేందుకు మెట్లదారి, ర్యాంప్ ఉంటాయి.

హనుమాన్ విగ్రహం
ఏపీలోని వంశధార నది సమీపంలో ఉన్న 52 మీటర్ల ఎత్తులో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఈ హనుమాన్ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన హనుమాన్ విగ్రహంగా పేరొందింది. 2020లో ప్రారంభించిన ఈ విగ్రహం భారతదేశంలోనే ఎత్తయిన విగ్రహాలలో ఒకటిగా నిలిచింది.
వీర అభయ ఆంజనేయ హనుమాన్ స్వామి
ఏపీలోని విజయవాడ సమీపంలోని పరిటాల పట్టణంలో 41 మీటర్ల ఎత్తుతో వీర అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. 2003లో దీనిని స్థాపించారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత పొడమైన రెండో ఆంజనేయ స్వామి విగ్రహంగా పేరొందింది.
ధ్యాన బుద్ధ విగ్రహం
ఏపిలోని ధ్యాన బుద్ధ విగ్రహం 38.1 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అమరావతిలో కృష్ణా నది ఒడ్డున కూర్చున్న భంగిమలో ఈ విగ్రహం ఉంటుంది. 2015లో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.



Click it and Unblock the Notifications













