Search
  • Follow NativePlanet
Share
» »ముస్సోరిలోని వింట‌ర్ లైన్ కార్నివాల్‌ను ఎప్పుడైనా చూశారా..?

ముస్సోరిలోని వింట‌ర్ లైన్ కార్నివాల్‌ను ఎప్పుడైనా చూశారా..?

చాలామంది ఈ శీతాకాల‌పు సెల‌వుల్లో ఎక్క‌డికి వెళ్లాలో తెలియక తిక‌మ‌క ప‌డుతుంటారు. అలాంటి వారు త‌ప్ప‌కుండా డిసెంబ‌ర్ లాస్ట్ వీక్‌లో ముస్సోరీ ప్రాంతాన్ని సంద‌ర్శించాల్సిందే. ఎందుకంటే, ఇక్క‌డ ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హించే వింట‌ర్ లైన్ కార్నివాల్ క‌నుల‌విందుగా ఉంటుంది. ప్ర‌తిఏటా ఇక్క‌డ నిర్వ‌హించే ఈ కార్నివాల్‌కు దేశ‌విదేశాల నుంచి ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తుంటారు. వింటర్‌లైన్ కార్నివాల్ అనేది శీతాకాలంలో సూర్యాస్తమయం సమయంలో కనిపించే ఒక ప్రత్యేక రకమైన దృశ్యం. వింటర్‌లైన్ అనేది భారతదేశంలోని ఒక నిర్దిష్ట నగరంలో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే కనిపించే చాలా అరుదైన దృశ్యం అని చాలామందికి తెలీదు. ప్ర‌త్యేకంగా ఈ వింట‌ర్‌లైన్‌ను చూసేందుకు శీతాకాలంలో చాలామంది ప‌ర్యాట‌కులు బారులు తీరుతుంటారు. వింట‌ర్ లైన్ అంటే ఏమిటో ఒక‌సారి చూద్దాం.

mussoorie carnival festival

వింటర్‌లైన్ అంటే ఏమిటి?

శీతాకాల స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా ఇక్క‌డికి వ‌చ్చే ప‌ర్యాట‌కులు వీక్షించేది వింటర్‌లైన్ ఫినామినన్. ఈ వింట‌ర్‌లైన్ సంద‌ర్భంగా శీతాకాలంలో ముస్సోరిలో సాయంత్రం వేళ ఆకాశంలో అద్భుతమైన దృశ్యాలు ఏర్పడతాయి. లైట్ రిఫ్లెక్షన్ కారణంగా ఆకాశంలో కొంత భాగం కాంతివంతంగా, కొంత భాగంలో చీకటి అలుముకున్నట్లుగా కనిపిస్తుంది. ఇలాంటి దృశ్యాలు భారత్‌లో కేవలం ముస్సోరి, మిజోరం వంటి న‌గరాల్లో మాత్ర‌మే కనిపిస్తాయి. అందుకే చాలామంది ప‌ర్యాట‌కులు ఈ అద్భుత‌మైన దృశ్యాన్నీ చూసేందుకు ఈ సీజ‌న్‌లో ముస్సోరి వంటి ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తుంటారు. దీంతో మీరు ఈ అరుదైన అనుభూతిని పొందేందుకు ఈసారి ముస్సోరీకి త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల్సిందే.

సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ మేఘాలపై పడినప్పుడు, అవి అనేక రంగుల స్పష్టమైన గీతలను సృష్టిస్తాయి. అవి ప్రత్యేకంగా శీతాకాలంలో, చుట్టూ మంచు, పొగమంచు తెల్లటి దుప్పటి కారణంగా, వింటర్‌లైన్ చాలా స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. ఈ అద్భుత‌మైన దృశ్యం కేవ‌లం ఉద‌యం, సాయంత్రం వేళ మాత్ర‌మే క‌నిపిస్తుంది. వింటర్‌లైన్ స్పష్టంగా కనిపించే ప్రపంచంలో కేవలం 2 ప్రదేశాలు మాత్రమే ఉన్నాయి. వీటిలో మొదటిది స్విస్ ఆల్ప్స్ , రెండోది భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ.

mussoorie festival

వింట‌ర్ లైన్ కార్నివాల్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌లు...

ముస్సోరీలోని లాల్ టిబ్బా సీనిక్ పాయింట్ వింటర్‌లైన్ చూసేందుకు ఉత్తమమైన ప్రదేశమ‌ని చెప్పుకోవ‌చ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరిలో ఇక్కడ ప్రత్యేక వింటర్‌లైన్ కార్నివాల్ నిర్వహించబడుతుంది. ఈ కార్నివాల్ సమయంలో ముస్సోరీలోని మట్టి రోడ్ల‌పై వివిధ రకాల వస్తువులు, రుచికరమైన తిండిప‌దార్థాలు విక్రయించే దుకాణాలతో నిండి ఉంటుంది. సూర్యాస్తమయం సమయంలో శీతాకాలాన్ని ఆస్వాదించిన తర్వాత, పర్యాటకులు స్టార్‌గేజింగ్, నైట్ టైమ్ ఫోటోగ్రఫీ మొదలైన వివిధ కార్యకలాపాలను ఆస్వాదిస్తుంటారు. ఈ కార్నివాల్ ప్రకృతి అందాలతో పాటు అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను కూడా ప‌ర్యాట‌కుల‌కు పరిచయం చేస్తుంది.

అలాగే ఇక్కడ దొరికే ప్రత్యేకమైన వంటకాలు టూరిస్టులను ఎంత‌గానో ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే కార్నివాల్‌ సమయంలో ముస్సోరీ అంతటా అద్భుతమైన క్యాంప్ ఫైర్లు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వీటితోపాటు ఈ కార్నివాల్ సంద‌ర్భంగా ఇక్క‌డ‌ హెరిటేజ్ వాక్‌లు, స్టార్-గేజింగ్, నేచర్ వాక్‌లు, స్థానిక, జానపద కళాకారుల ప్రదర్శనలు, పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, స్కేటింగ్, హస్తకళల స్టాల్స్ వంటి కార్య‌క్ర‌మాలెన్నో ఆస్వాదించొచ్చు. ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ప్రతి సంవత్సరం ముస్సోరీకి చేరుకుంటారు.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+