Search
  • Follow NativePlanet
Share
» »ఈ మార్కెట్‌లో అన్నీ చౌక ధ‌ర‌ల‌కే ల‌భించును...

ఈ మార్కెట్‌లో అన్నీ చౌక ధ‌ర‌ల‌కే ల‌భించును...

ఈ మార్కెట్‌లో అన్నీ చౌక ధ‌ర‌ల‌కే ల‌భించును...

పాదరక్షలు కొనాలన్నా, పెళ్లి షాపింగ్ చేయాలన్నా ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్ ఉత్త‌మ ప్రాంతం.
ఢిల్లీలో మార్కెట్లకు కొరతే లేదు. ఇక్కడ ఖరీదైన మార్కెట్ నుండి చౌక మార్కెట్లు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా షాపింగ్ అంటే ఇష్టపడే వారికి ఇక్కడి మార్కెట్లు మ‌రింత ఆస‌క్తినిస్తాయి. చాందినీ చౌక్, సదర్ బజార్, లజ్‌పత్ బజార్‌లు వాటి ప్రత్యేకతలకు ప్రసిద్ధి చెందాయి, అయితే ఇప్పుడు మనం ఢిల్లీలోని ప్రసిద్ధ మార్కెట్‌లో చేర్చబడిన మరొక మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఆ మార్కేటే క‌రోల్ బాగ్‌.

దీనికి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పేరు పెట్టారు. ఇంతకు ముందెన్నడూ కరోల్ బాగ్‌ను వీక్షించనివారికోసం ఈ మార్కెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాము. మ‌రెందుకు ఆల‌స్యం క‌రోల్ బాగ్ మార్కెట్ సంద‌ర్శ‌న‌కు బ‌య‌లుదేరండి..

chandnichowk1

కరోల్ బాగ్ మార్కెట్‌కి ఎందుకువెళ్లాలి

కరోల్ బాగ్ మార్కెట్‌లో సామాన్య ప్ర‌జ‌ల‌కు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌లో అన్నీ ల‌భిస్తాయి. ఇక్కడ బ్రాండెడ్ దుకాణాలే కాకుండా స్థానిక దుకాణాలు కూడా ఉంటాయి. విక్రయదారులు కూడా తమ ఉత్పత్తులను స్టాళ్లను ఏర్పాటు చేసి విక్రయిస్తుంటారు. ఇక్కడ గఫార్ బజార్ మొబైల్ ఉపకరణాలకు ప్రసిద్ధి చెందింది. మొదటి సారి ఢిల్లీని సందర్శిస్తున్న వారికోసం కరోల్ బాగ్‌లో బస చేయడానికి చాలా హోటళ్ళు ఉన్నాయి, కరోల్ బాగ్ వివాహ లెహంగాలు మరియు షేర్వాణీలకు ప్రసిద్ధి చెందింది.

ఈ మార్కెట్‌లోకి ప్రవేశించిన వెంటనే, రెండు వైపులా అనేక స్టాల్స్ కనిపిస్తాయి. చాలా మంది జంటలు హల్దీ, మెహందీ, రిసెప్షన్ మరియు పెళ్లి బట్టలు కొనడానికి ఇక్కడకు వస్తారు. ఇక్కడ మీరు వరుడి కోసం షేర్వానీ చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయ‌వ‌చ్చు. సూట్, ధోతీ కుర్తా, కుర్తా పైజామా వంటివి ఇక్క‌డ అందుబాటు ధ‌ర‌ల‌లో ల‌భిస్తాయి.

adarbazar1

ఇక్కడి చాలా దుకాణాలలో తాజా డిజైన్‌తో కూడిన బంగారు, వజ్రాలు మరియు వెండి ఆభరణాలను చూడొచ్చు. ఇక్కడ నుండి కొత్త డిజైన్ బ్యాంగిల్స్, చీలమండలు, ఉంగరాలు, జంక్ నగలతో పాటు ఆక్సిడైజ్డ్ నగలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ మార్కెట్ బ్యాంక్ స్ట్రీట్ రోడ్ నగల వ్యాపారులకు ప్రసిద్ధి. ఆక్సిడైజ్డ్ న‌గ‌ల ధర కేవ‌లం రూ.20 నుంచి మాత్రమే ల‌భిస్తాయి.

పుస్తక మార్కెట్

ఇప్ప‌టికీ మీకు పాత పుస్తకాల పట్ల మక్కువ ఉంటే, కరోల్ బాగ్‌లోని ఆర్యసమాజ్ రోడ్డును తప్పక సందర్శించండి. ఇక్కడ పాత పుస్తకాలను పొందవచ్చు. ఇక్క‌డ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు 50 రూపాయల లోపే లభిస్తాయి.

పాదరక్షలు, సౌందర్య సాధనాలు..

బ్రాండెడ్ పాదరక్షలను ధరించడానికి ఇష్టపడే వారి కోసం ఇక్కడ చాలా దుకాణాలు ఉన్నాయి. షూస్, స్నీకర్స్, లోఫర్స్, చెప్పులు, స్లిప్పర్స్, బెల్లీస్ వంటి వివిధ రకాల పాదరక్షలు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. ఇది కాకుండా, ఉత్తమ శ్రేణి కాస్మెటిక్ ఉత్పత్తులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. విక్టోరియా సీక్రెట్ మిస్ట్ నుండి ఇంటర్నేషనల్ బ్రాండ్ స్కిన్ ,హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వరకు ఇక్కడ అందుబాటులో లేనివి ఏవీ లేవు. సొంత‌ బ్రాండ్‌ను ప్రారంభించాలనుకునేవారు , దుకాణాన్ని తెరవాలనుకునేవారికోసం ఈ మార్కెట్‌.

lajpatbazar1

ఇక్కడ టోంక్ రోడ్‌లోని మీ స్టోర్ కోసం హోల్‌సేల్ ధరలకు డిజైనర్ దుస్తులను పొందుతారు. దేశం నలుమూలల నుండి దుకాణదారులు ఇక్కడి నుండి హోల్‌సేల్ ధరలకు దుస్తులను తీసుకెళ్లి, ఆపై వారి దుకాణాల్లో మంచి ధరలకు విక్రయిస్తారు.

కరోల్ బాగ్ చేరుకోవడం ఎలా

కరోల్ బాగ్ పశ్చిమ ఢిల్లీలో ఉంది. సమీప మెట్రో స్టేషన్ బ్లూ లైన్‌లో ఉన్న కరోల్‌ బాగ్. గేట్ నంబర్ 4 నుండి బయటకు వచ్చిన తర్వాత మీరు రిక్షా లేదా ఆటో తీసుకోవచ్చు. కావాలంటే కాలినడకన కూడా మార్కెట్‌కు చేరుకోవచ్చు.

More News

    Read more about: chandni chowk sadar bazar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+