భారత్‌లో ఇప్పటికే ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లు, మెట్రో ట్రైన్స్ వంటివెన్నింటినో నిర్మించారు. మౌలిక వసతులే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముఖ్య నగరాల్లో రోడ్లను, ఎక్స్‌ప్రేస్ వేలను కూడా నిర్మించాచరు. ఇంకా ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేస్, స్కైవేస్ నిర్మాణం కూడా శరవేగంగా ఊపందుకుంది.
చెన్నై, ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, నోయిడా, పానిపట్, చండీగఢ్ వంటి నగరాల్లో ట్రాఫిక్‌లను నివారించేందుకు ఫ్లైఓవర్‌లను నిర్మించారు. కొన్ని ప్రాజెక్టులు దేశంలోని రోడ్ నెట్‌వర్క్‌లో అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉన్నాయి. భారత్‌లో అత్యంత పొడవైన ఫ్లైఒవర్స్‌తో పాటు, ఎక్స్‌ప్రెస్ దారులను కూడా నిర్మించారు. అవెంటో ఓసారి చూద్దాం.

హోసూర్ రోడ్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు
బెంగుళూరులోని హోసూర్ రోడ్ ఎక్స్‌ప్రెస్ వే భారతదేశంలో రెండో అతి పొడవైన ఫ్లైఓవర్‌గా పరిగణించబడుతుంది. దీని పొడవు
సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది. మెటల్ డివైడర్‌లతో కూడిన ఈ 4-లేన్ టోల్‌వే, ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. హెబ్బల్ ఫ్లైఓవర్, మైసూర్ రోడ్ ఫ్లైఓవర్‌తో నగర స్కైలైన్ నెట్‌వర్క్ మరింత మెరుగవుతుంది.
బదర్‌పూర్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఢిల్లీ
ఢిల్లీలోని బదర్‌పూర్ ఎలివేటేడ్ ఎక్స్‌ప్రెస్ సుమారు 4.4 కిలోమీటర్ల పొడవుంటుంది. ఢిల్లీ వాసులకు ఈ దారి ట్రాఫిక్‌ను పూర్తిగా నివారించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బదర్‌పూర్ సరిహద్దు వద్ద ట్రాఫిక్ రద్దీ కష్టాలను ఎక్స్‌ప్రెస్ వే తీర్చుతుంది. ఫ్లైఓవర్లకు ప్రసిద్ధి చెందిన ఢిల్లీలో ధౌలా కువాన్, AIIMS, ఆనంద్‌మోయీ మార్గ్ ఫ్లైఓవర్‌లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

DND ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే
DND ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను ఢిల్లీ నోయిడా డైరెక్ట్ టోల్ రోడ్ అని కూడా పిలుస్తారు. DND ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, సుమారు 9.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఎనిమిది లేన్‌లను కలిగి ఉంటుంది. ఢిల్లీ, నోయిడాను కలుపుతుంది. ముఖ్యంగా గీతా కాలనీ ఇంటర్‌చేంజ్ వద్ద ఉన్న ఎలివేటెడ్ కూడలి, ఈ విశాలమైన హైవేలో ఒక అంతర్భాగమని చెప్పుకోవాలి.
పానిపట్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్, పానిపట్
పానిపట్‌లోని NH-1లో ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే సుమారు 3.6 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ఢిల్లీ, అమృత్‌సర్‌ను కలుపుతుంది. ఇది L&T ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. పానిపట్‌లో పొడవైన ఫ్లై ఓవర్‌గా ఇది పరిగణించబడుతుంది.
లాల్‌బాగ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్, ముంబై
లాల్‌బాగ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోనే అతి పొడవైన ఫ్లైఓవర్ జాబితాలో ఉంది. ఇది ముంబైలో ఉంది. అదే లాల్‌బాగ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే. దీని పొడవు సుమారు 2.48 కిలోమీటర్లు ఉంటుంది.

టూ-లెవల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, అహ్మదాబాద్
అహ్మదాబాద్‌లోని మొదటి టూ-లెవల్ ఎలివేటెడ్ ఫ్రీవే ఇది. నరోడా, నరోల్ మధ్య ట్రాఫిక్ రద్దీని ఈ మార్గం తగ్గించనుంది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు దీన్ని ప్రారంభించారు. ఫ్లైఓవర్ల నగరంగా పిలిచే సూరత్, వరచా ఫ్లైవేను కలుపుతుంది. నగర పురపాలక పరిమితుల ప్రకారం చూస్తే, ఈ ఫ్లైవే నాలుగు లేన్ల కేటగిరీలో భారతదేశపు అతి పొడవైన ఫ్లైఓవర్‌గా ఈ మార్గం నిలుస్తోంది.
ఈస్ట్ కోస్ట్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే, చెన్నై
చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే సుమారు 9.7 కిలోమీటర్ల పొడవుంది. ఈస్ట్ కోస్ట్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంతో చెన్నై స్కైలైన్ అభివృద్ధి చెందుతోంది.
అంబాలా-చండీగఢ్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే
అంబాలా-చండీగఢ్ ఎక్స్‌ప్రెస్‌వే సుమారు 35 కిలోమీటర్లు పొడవు ఉంది. ఇది 4-లేన్ కారిడార్. 350 మీటర్ల వయాడక్ట్ వంతెన సహా 2 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ హైవే కూడా ఈ ప్రాజెక్టులో చేరనుంది.



Click it and Unblock the Notifications













