Search
  • Follow NativePlanet
Share
» »తమిళనాడులోని తిరుచిరాపల్లి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు విశేషాలు...

తమిళనాడులోని తిరుచిరాపల్లి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు విశేషాలు...

త‌మిళ‌నాడులో ప‌ర్యాట‌కులు సంద‌ర్శించేందుకు ప్ర‌సిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇక్క‌డ పురాత‌న ఆల‌యాల‌తో పాటు ప‌ర్యాట‌కులు విడిది చేసేందుకు స‌రైన ప్ర‌దేశాలు కూడా ఉన్నాయి. ఇక, తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ఈ మ‌ధ్య‌నే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రారంభించారు. ఈ విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ రూ. 1100 కోట్లతో నిర్మించబడింది. ఈ ఎయిర్‌పోర్ట్ విశేష‌త‌లేంటో ఓసారి తెలుసుకుందాం ప‌దండి.

తమిళనాడులోని తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన కొత్త టెర్మినల్‌లో సంస్కృతి, కళ, సాంకేతికతను చక్కగా పొందుపరిచారు. టెర్మినల్ వద్ద కొలం కళ నుండి శ్రీరంగం ఆలయ రంగులు, ఇతర ఇతివృత్తాల వరకు కళాఖండాలు సృష్టించబడ్డాయి. కొత్త టెర్మినల్ భవనంలో ప్రయాణికుల కోసం 60 చెక్-ఇన్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ భవనం శ్రీ రంగనాథస్వామి ఆలయ నేపథ్యంపై రూపొందించబడింది. ఇందులో కొలమ్ కళ నుంచి శ్రీ రంగనాథస్వామి ఆలయ రంగులు, ఇతర ఇతివృత్తాల వరకు వివిధ ర‌కాల కళాఖండాలను రూపొందించడం జ‌రిగింది.

రు.1,100 కోట్లకు పైగా వ్యయంతో కొత్త టెర్మినల్ భవనాన్ని అభివృద్ధి చేశారు. ఈ రెండు టెర్మినళ్ల స్థాయి, ఏటా 44 లక్షల మంది ప్రయాణికులకు వివిధ ప్రాంతాలకు చేరవేస్తుంది. కొత్త టెర్మినల్ భవనంలో 60 చెక్-ఇన్ కౌంటర్లు, 5 బ్యాగేజ్ క్యారౌసెల్‌లు, 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు, 44 డిపార్చర్ ఎమిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి.

tiruchirappalliinternationalairport

రంగనాథ స్వామి దేవాలయం ఆకారం

తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క కొత్త టెర్మినల్ భవనం రూపకల్పన తిరుచిరాపల్లి సంస్కృతి నుండి ప్రేరణ పొందింది. టెర్మినల్ గేటుపై రంగనాథ స్వామి ఆలయం వంటి ఆకారం నిర్మించబడింది. ఈ ఆల‌యంలో 100 మంది కళాకారులను నియమించారు. ఈ కొత్త‌ టెర్మినల్‌లో అనేక చిత్రాలను కూడా చూడొచ్చు.

ఇక్కడ కొత్త భవనాన్ని కళాకృతులతో రూపొందించడానికి 100 మంది కళాకారులను నియమించారు. ఈ కుడ్యచిత్రాలు 30 రోజుల్లోనే రూపొందించబడ్డాయి. ప్రతి రోజు 3,500 మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యాన్ని ఈ ఎయిర్‌పోర్టు కలిగి ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం అధికారికంగా తెలిపింది. ఈ కొత్త టెర్మినల్ ప్రయాణీకుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉందని ప్రకటన చేసింది.

tiruchirappalliinternationalairport

కొత్త టెర్మినల్ భవనం 75,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్త‌రించి ఉంది..

ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త టెర్మినల్ భవనంలో సాంకేతికతను ఉపయోగించారు. కొత్త టెర్మినల్ భవనంలో 60 చెక్-ఇన్ కౌంటర్లు మరియు 5 బ్యాగేజ్ క్యారౌసెల్‌లు ఉన్నాయి, 60 అరైవల్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు మరియు 44 డిపార్చర్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. కొత్త టెర్మినల్ భవనం 75,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది రెండు స్థాయిలలో నిర్మించబడింది. అరైవల్ లాంజ్ మరియు డిపార్చర్ వరుసగా గ్రౌండ్ ఫ్లోర్ మరియు పై లెవెల్‌లో ఉన్నాయి.

తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తరచుగా తిరుచ్చి విమానాశ్రయంగా పిలుస్తారు. సిటీ సెంటర్‌కు దక్షిణంగా 5 కిలోమీటర్లు దూరంలో ఉన్న వ్యూహాత్మక ప్రదేశం విమానాశ్రయాన్ని అద్భుతంగా చేస్తుంది. తిరుచ్చి విమానాశ్రయం ఎంతో చారిత్రక ప్రాధాన్యతను కలిగి ఉంది. ఇది రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు కీలకమైన కేంద్రాలలో ఒకటిగా ఉపయోగించబడింది.

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+